Asia Cup: ఆసియా కప్ భారత్ కైవసం చేసుకోవడం తెలిసిందే. ఫైనల్ లో శ్రీలంకని భారత్ చిత్తుచిత్తుగా ఓడించడం జరిగింది. ఇండియన్ బౌలర్ మహమ్మద్ సిరాజ్.. అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆరంభంలోనే శ్రీలంక ఓపెనర్ ల క్రికెట్లను పడగొట్టాడు. సిరాజ్ బుల్లెట్ బంతులకు లంక బ్యాట్స్ మ్యాన్ లు బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో 7 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి సిరాజ్.. ఆరు వికెట్లు పడగొట్టడం జరిగింది. దీంతో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అందుకున్న మహమ్మద్ సిరాజ్.. తనకు వచ్చిన ఐదు వేల డాలర్లు(4.15 లక్షలు) ప్రైజ్ మనీ నీ శ్రీలంక గ్రౌండ్స్ మెన్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేశాడు. దీంతో భారతీయ క్రికెట్ ప్రేమికులు..మహమ్మద్ సిరాజ్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆసియా కప్ టోర్నీలో చాలా వరకు వర్షాలు పడటంతో మ్యాచులు.. నిర్వహించడానికి అనేక ఇబ్బందులు పడటం జరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ మధ్యలో వర్షాలు పడటం తర్వాత ఆగిపోవడం ఈ పరిస్థితులలో గ్రౌండ్స్ మెన్ డిపార్ట్మెంట్ చాలా శ్రమ పడటం జరిగింది. ఈ క్రమంలో సిరాజ్ తన ప్రైజ్ మనీ వాళ్ళందరికీ ఇచ్చేయటం సంచలనంగా మారింది. ఇక ఇదే సమయంలో ఫైనల్ మ్యాచ్ ప్రదర్శన గురించి సోషల్ మీడియాలో మహమ్మద్ సిరాజ్ స్పందించారు.
తన జీవితంలో బ్లూ జెర్సీ ధరించడం కంటే పెద్ద గౌరవం ఏదీ లేదు. నేటి ప్రదర్శన మరింత కష్టపడి ఆడేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. గంటలకు సాధన ఇంకా కృషికి తగ్గ ఫలితాలు చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది. నా ప్రదర్శనతో మన దేశం గర్వపడేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మీ అందరి ప్రేమ మద్దతు బట్టి ధన్యవాదాలు అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆసియా కప్ భారతి టీం గెలవటం పట్ల చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి… బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన పట్ల సంచలన..పోస్ట్ పెట్టారు. “సిరాజ్ మా టోలిచౌకి కుర్రోడు. నేడు ఆసియా కప్ ఫైనల్ లో ఆరు వికెట్లతో మెరిశాడు” అని సంతోషం వ్యక్తం చేశారు. మంచి ఆట తీరు కనబరిచాడని రాజమౌళి ప్రశంసించారు.