IND vs NZ: నేడు ముంబాయి వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి భారీ ఎత్తున క్రికెట్ ప్రేక్షకులు… అధిక ధరతో టికెట్లు కొంటున్నారు. ఇదిలా ఉంటే 2019 సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ఓడించడంతో ఈ మ్యాచ్ లో కివీస్ నీ ఓడించాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఆల్రెడీ ఈ టోర్నీలో లీగ్ దశలో న్యూజిలాండ్ పై భారత్ గెలవడం జరిగింది. అయినా గాని వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్ లో న్యూజిలాండ్ చాలాసార్లు ఆడటం జరిగింది. 2007, 2011 సెమీస్ లలో ఓడింది. ఆ తర్వాత 2015, 2019 లలో రన్నర్ రప్ గా నిలిచింది.
గత రెండు టోర్నీలలో కొద్ది పార్టీలో వరల్డ్ కప్ చేజార్చుకుంది. దీంతో ఈసారి జరగబోతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ భారత్ టీం ఫుల్ ఫామ్ లో ఉంది. టోర్నీ మొదలయ్యి ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. దీంతో సెమీఫైనల్ మ్యాచ్ నీ కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ జట్టు ఫామ్ ని బట్టి చూస్తే టీంలో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏ జట్టు అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటుందా వారికి విజయ అవకాశాలు ఎక్కువ అని ముంబాయి వాంకాడే స్టేడియం పిచ్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల తర్వాత రెండో బ్యాటింగ్ కి దిగే జట్టుకి ఎక్కువ మంచి ప్రభావం.. ఉంటుందట. దీంతో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది.