IND vs NZ: వరల్డ్ కప్ టోర్నీలో మొదటి సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం సాధించింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత్ 50 ఓవర్ లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ 117, శ్రేయస్ 105 ఇద్దరూ సెంచరీలతో రాణించారు. అదేవిధంగా గిల్ 80, రోహిత్ 47, కేఎల్ రాహుల్..30 పరుగులతో అద్భుతంగా రాణించటం జరిగింది. అనంతరం 398 పరుగుల లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ కి దిగిన కివీస్ 327 పరుగులకు ఆల్ అవుట్ అయిపోయింది. భారత్ బౌలర్ లలో మహమ్మద్ షమ్మీ ఏడు వికెట్లు పడగొట్టాడు.
మిగతా బౌలర్లలో బుమ్రా, కుల్డీప్, సిరాజ్ చెరో వికెట్ తీయడం జరిగింది. షమ్మీ తన బౌలింగ్ తో బ్యాటింగ్ పిచ్ పై కివీస్.. బ్యాట్స్ మ్యాన్ లను నిలదొక్కుకోకుండా చేశాడు. అయితే భారత్ భారీ టార్గెట్ ఇచ్చిన గాని న్యూజిలాండ్ ఆటగాళ్లు దాదాపు 30 ఓవర్ ల వరకు మ్యాచ్ గెలిచే రీతిలో పరుగులు చేయడం జరిగింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మ్యాన్ మిచెల్ సెంచరీతో అద్భుతంగా ఆడటం జరిగింది. అయితే చివరిలో న్యూజిలాండ్ ఆటగాళ్లు తడబడటంతో.. ఒత్తిడి ఓవర్ ఓవర్ కి పెరిగిపోవడంతో 48.5 ఓవర్ లలో 327 పరుగులకు ఆలౌట్ అయిపోయారు. దీంతో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఫైనల్ కి చేరుకోవడం జరిగింది.
సెకండ్ సెమీఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ లో భారత్ తో ఆడనున్నారు. స్వదేశంలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నీ విజేతగా భారత్ గెలవాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ పోరులో ధోని సారధ్యంలో గెలవడం జరిగింది. ఆ తర్వాత 2015 మరియు 2019 లలో ఇండియా ఓటమి పాలయ్యింది. అయితే ఈసారి మాత్రం ఫైనల్ కీ చేరుకోవడంతో ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలని ఇండియన్ క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.