NewsOrbit
Cricket Sports ట్రెండింగ్

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

Share

Virat Kohli: ముంబై వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ .. చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఉండేది. 49 సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్.. పేరిట ఉన్న రికార్డును న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 117 పరుగులు చేసి 50ఓ సెంచరీ తన పేరిట రికార్డు క్రియేట్ చేయడంతో.. సచిన్ రికార్డు బ్రేక్ అయింది.

India vs New Zealand semifinal match Virat Kohli broke Sachin records and created a world record

విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన టైంలో స్టేడియంలో సచిన్ కూడా ఉండటం విశేషం. దీంతో సచిన్ రికార్డు బ్రేక్ చేసి వెంటనే సచిన్ కి సలాం చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సన్నివేశం చూసి స్టేడియంలో ప్రేక్షకులంతా.. చప్పట్లతో విజిల్స్ తో రచ్చ రచ్చ చేశారు. స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు 50కి పైగా పరుగులు సాధించారు. అంతేకాకుండా వరల్డ్ కప్ ఓకే ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లీ ఈ టోర్నీలో బ్రేక్ చేయడం జరిగింది. మొత్తం మీద కివీస్ తో జరుగుతున్న సెమీఫైనల్ లో భారత్ బ్యాట్స్ మెన్స్ అద్భుతంగా రాణించారు. మొదటినుండి కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు ఆట ప్రారంభించటం అది చివరి వరకు సాగింది.

India vs New Zealand semifinal match Virat Kohli broke Sachin records and created a world record

దీంతో ముంబై వాంకాడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీస్ లో 50 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 397 భారీ స్కోర్ చేయడం జరిగింది. ఓపెనర్లు రోహిత్, గిల్ చాలా దూకుడుగా ఆడటంతో.. మొదటినుండి రన్ రేట్ ఆరుకు పైగా ఉంది. ఆ తర్వాత కోహ్లీ చెలరేగి ఆడటంతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా సెంచరీ చేయడం జరిగింది. చివరిలో కేఎల్ రాహుల్ 20 బంతులలో 39 పరుగులు చేయడం జరిగింది. 2019 వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్ లో ఇండియాని న్యూజిలాండ్ ఓడించడం జరిగింది. దీంతో కచ్చితంగా ఈ మ్యాచ్ లో కివీస్ నీ ఓడించి ఇండియా అరేంజ్ తీర్చుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.


Share

Related posts

ప్యాంట్ జిప్’పై ఈ గుర్తు ఉంటే అర్థం ఏంటో తెలుసా?

Teja

సూపర్ స్టార్ మహేశ్ బాబుపై సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్?

Varun G

Indian Rupee: మన లక్షలు అక్కడ కోట్లతో సమానం..! ఆ దేశాల్లో లగ్జరీ చేయవచ్చు..! ఎక్కడెక్కడ అంటే..?

bharani jella