Paluke Bangaramayenaa November 15 2023 Episode 74 Highlights: ఏంటి అభిషేక్ ఏం ఆలోచిస్తున్నావు స్వర గురించేనా అని ఝాన్సీ అడుగుతుంది. ఏమీ లేదు ఝాన్సీ అని అభిషేక్ అంటాడు. పొద్దున గుడి దగ్గర నాకు విశాల్ కనపడ్డాడు అని ఝాన్సీ అంటుంది. ఏమైనా అన్నాడా అని అభిషేకం అడుగుతాడు. ఏమి అనలేదు అభి నేనే వాడికి ఇచ్చి పడేసాను ఆడవాళ్లు అంటే వాడికి చాలా చులకన ఆడవాళ్ళ జోలికి వస్తే వణుకు పుట్టేలా చేయాలి వాడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇంకెవరైనా ఆడవాళ్ళ జోలికి వస్తే విశాల్ కు పట్టిన గతే పడుతుందని ఎనక ముందు ఆలోచించాలి నువ్వు ఏం చేస్తావో ఏమో అభిషేక్ ఒక్క ఆధారం కనిపెట్టు వాడిని ఉరికంభo ఎక్కేలా చేస్తాను అని ఝాన్సీ అంటుంది. గట్టిగానే ప్రయత్నిస్తున్నాను ఝాన్సీ వాడికి త్వరలోనే శిక్ష పడేలా చేస్తాను స్వరకి అన్యాయం జరగకుండా చూస్తాను పాపస్వర అమాయకురాలు అని అభిషేక్ అంటాడు.

ఏంటో స్వర గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అని ఝాన్సీ అంటుంది. అదేమీ లేదు ఝాన్సీ డ్యూటీ మాత్రమే చేస్తున్నాను అని అభిషేక్ అంటాడు. సరే చాలా పొద్దుపోయింది స్వరకి చెప్పి ఇంటికి వెళ్దాం పద అని ఝాన్సీ అంటుంది. కట్ చేస్తే, ఆర్య అభిషేక్ గురించి స్వర చెప్పడం విని బాగా ఆలోచిస్తాడు. ఇంతలో స్వర అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు ఆర్య అని అడుగుతుంది. అక్క నీకు విశాల్ కి పెళ్లి జరగకూడదు అని ఆర్య అంటాడు.విశాల్ గురించి తెలిశాక నేను ఎలా అతని చేసుకుంటాను తమ్ముడు అని స్వర అంటుంది. అయితే నేను నీకోసం ఒక మంచి అబ్బాయిని చూస్తాను అక్క నేను చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ఆర్య అంటాడు. సరే తమ్ముడు నువ్వు చూసినా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని స్వర ఆర్య కి మాట ఇస్తుంది. ఏంటి ఆర్య మీ అక్కను దేనికో ప్రామిస్ చేయించుకుంటున్నావు అని అభిషేక్ అడుగుతాడు. మా అక్క పెళ్లి గురించి సార్ ఆ విశాల్ ని చేసుకోవద్దు నేను చూసిన అబ్బాయిని చేసుకోమని చెప్తున్నాను అని ఆర్య అంటాడు.

అమ్మ స్వర పొద్దుపోయింది అత్తయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మేము బయలుదేరుతా మ్మమ్మ అని యశోద అంటుంది. ఆంటీ చీకటి పడింది కదా భోజనం చేసి వెళ్లొచ్చుగా అని స్వర అంటుంది. ఇంటిదగ్గర అత్తయ్య మాతో కలిసి భోజనం చేయడం అలవాటు స్వర ఇంటికి వెళ్లాక తింటాం లే అని యశోద అంటుంది. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు నేను చేత అడిగి మారి మాకు ఇష్టమైనవి వండించుకొని తింటాము అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే కీర్తి మీ ముద్దుల అక్క ఎక్కడికి వెళ్ళింది అని వాళ్ల బామ్మ అంటుంది. నీకే ముద్దుల పెద్ద మనవరాలు కదా నన్ను అడుగుతావేంటి అని కీర్తి అంటుంది.యశోద మొన్న చీరలు కొన్నట్టు ఈరోజు ఏం చేస్తుందో ఏమో ఎక్కడ ఉందో ఫోన్ చెయ్ అని వాళ్ళ బామ్మ అంటుంది. ఇంతలో చందన వచ్చి నీకు అంత అవసరం లేదు లేవే ముసలి మేమే వచ్చేసాము అని అంటుంది. అదేంటే చేతులు అన్ని కవర్లు ఉన్నాయి అని వాళ్ళ బామ్మ అంటుంది. ఇవి మీ మనవడి పేరు చెప్పి బాంబులు 10000 పెట్టి తెచ్చాము అని చందన అంటుంది. నేను అనుకున్నంత పనిచేసిందే యశోద ఇది అని వాళ్ళ బామ్మ అంటుంది. అక్క ఇవన్నీ ఎందుకు తెచ్చావు అన్నయ్యకు నచ్చవు కదా అని కీర్తి అంటుంది.

ఇంతలో అభిషేక్ కూడా బాంబులు తీసుకొని వస్తాడు. అన్నయ్య నువ్వు కూడా బాంబులు తెచ్చావా అక్క 10,000 అప్పు చేసి నీ పేరు మీద బాంబులు తెచ్చింది అని కీర్తి అంటుంది. అయితే తిరిగి ఇచ్చేసి రా చందన అని అభిషేక్ అంటాడు. తిరిగి ఇచ్చేస్తే మా పరువు ఉంటుందా అని చందన అంటుంది. మి వాదనను ఆపండి మి విరుపక్షాల వారి మాటలు విన్న తర్వాత చందన తెచ్చిన బాంబులు కాల్చుకొని రెండు రోజుల తర్వాత డబ్బులు కట్టవలసిందిగా తీర్పు ఇస్తున్నాను అని ఝాన్సీ అంటుంది. నేను ఒప్పుకోను పది వేలు ఎక్కడి నుంచి తెచ్చి కడతాను అని చందన అంటుంది.ఆ పది వేలు నేనిస్తానులే చందన అని ఝాన్సీ నచ్చ చెప్తుంది. ఏంటి ఝాన్సీ వాళ్లకు ఇలా ఇవ్వడం అలవాటు చేస్తేనే నిను వేధించుకు తింటారు అని వాళ్ళ బామ్మ అంటుంది.

కట్ చేస్తే స్వర అభిషేక్ గురించి ఆలోచిస్తుంది. నిజంగా సార్ నా పక్కన ఉంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది అని స్వర తన మనసులో అనుకుంటుంది. అక్కడే కానిస్టేబుల్ పడుకొని ఉంటాడు. అతని చూసి ఏంట అంకుల్ మీరు ఇక్కడ పడుకున్నారు అన్నం తిన్నారా అని అడుగుతుంది స్వర. తిన్నాను అమ్మ అబి సార్ వాళ్ళ ఇంటికి వెళ్లాను కదా అక్కడే తిన్నాను అని అతను అంటాడు. అదేంటి మా ఇంటి దగ్గర తినొచ్చు కదా అని స్వర అంటుంది.

సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే తినకుండా వదిలిపెట్టడమ్మా ఆయనే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వదిలిపెట్టరు ఆ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఆ ఇంటికి ఎవరూ కోడలుగా వెళ్తారు కానీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు అని ఆ కానిస్టేబుల్ అంటాడు. కట్ చేస్తే స్వర కృష్ణ దగ్గరికి వెళ్లి ఏంటి కృష్ణయ్య అభిషేక్ మీద నాకు ఇష్టం పెరుగుతుంది ఏం మాయ చేస్తున్నావేంటి అని కృష్ణయ్య తో మాట్లాడుతుంది స్వర.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది