NewsOrbit
Cricket Entertainment News ట్రెండింగ్

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

Share

Dua Lipa: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 చివరి దశకు చేరుకోవడం జరిగింది. ఈ టోర్నీలో భారత్ తిరుగులేని విజయాలతో ఫైనల్ కీ చేరుకుంది. దీంతో ఆదివారం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తిలకించడానికి ప్రధాని మోదీ తోపాటు ఆస్ట్రేలియా ప్రధాని కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఉదయం ఏడు గంటలకే కవరేజ్ ప్రారంభించాలని స్టార్ స్పోర్ట్స్ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేన గగనతల విన్యాసాలు చేయనుంది.

World Pop Sensation Dua Lipa perform at World Cup final in Ahmedabad

బాలీవుడ్ ప్రముఖులతో పాటు చాలామంది సెలబ్రిటీలు మ్యాచ్ తిలకించడానికి రాబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా సందడి చేయబోతుందట. ప్రపంచ ప్రఖ్యాతి గాయని అయిన ఈమె ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతుందట. బీసీసీఐ ముగింపు వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ ప్రముఖ ఫేమస్ గాయనినీ రంగంలోకి దింపడం జరిగిందట. గతంలో దువా UEFA చాంపియన్స్ లీగ్ తో సహా కొన్ని క్రీడా కార్యక్రమాలలో ప్రదర్శన ఇవ్వడం జరిగింది.

World Pop Sensation Dua Lipa perform at World Cup final in Ahmedabad

యూకేకి చెందిన ఈ లేడీస్ సింగర్ కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. దువా షోకి మంచి డిమాండ్ ఉంది. దువా పాడిన చాలా పాటలు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి. రీసెంట్ గా ఆమె పాడిన ఓ పాట ఐదు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ కప్ ఫైనల్స్ కి ప్రముఖ లేడి పాప్ సింగర్ దువా రావడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ ధోని సారథ్యంలో ఇండియా గెలవడం జరిగింది. మళ్లీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో… ఇండియా ఫైనల్ కి చేరుకోవడంతో ఎలాగైనా ఫైనల్ గెలవాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఇప్పటివరకు సాగిన అన్ని సీజన్లలో కెల్లా ఈ సీజన్ బిగ్ బాస్ లో హిస్టరీ క్రియేట్ చేసిన అభిజిత్..??

sekhar

Krishna Mukunda Murari: మురారి తన భర్త అని అందరికీ తెలిసేలా చేసిన ముకుంద.. సూపర్ ట్విస్ట్ రేపటికి..

bharani jella

రామ్ `ది వారియ‌ర్‌` తెలుగు, త‌మిళ్ వర్షన్ల మ‌ధ్య‌ తేడా ఏంటో తెలుసా?

kavya N