Trinayani Today Episode November 18 2023 Episode 1088: పాడుపాము పాతికవేలు పెట్టికొన్న చీరని పాడు చేసింది నూనె పోసి అని సుమన తిట్టుకుంటుంది. లక్షల కోసి చీరలు సొమ్ములు కొంటున్నావు దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి అని విక్రాంత్ అంటాడు.డబ్బు పోయిందని అంటున్నారు కానీ నేను మంటల్లో కాలుతుంటే నువ్వు సంబరపడిపోతావ్ అనుకుంటా అని సుమన అంటుంది. కాల్ లేదు కదా సంతోషించు ఇంకెందుకు అంటావు అని విక్రాంత్ అంటాడు. అంతమంది మొగోళ్ళు ఉన్నారు నన్ను కొట్టినందుకు ఒక్కరైనా అడిగారా అని సుమన అంటుంది. విశాల్ బ్రో అడిగాడు కదా అని విక్రాంత్ అంటాడు. నన్ను చేసుకున్నది మీరా విశాల్ భావన అని సుమన అంటుంది. నీకు దండం పెడతాను అలా అనకే విశాల్ బ్రో వింటే బాధపడతాడు నిన్ను కూడా ఒక చిన్న పిల్లలాగానే చూస్తాడు అని ఈ కాంత్ అంటాడు.

దత్త పుత్రిక అయిన గాయత్రిని తెచ్చుకొని పాతిక కోట్లు ఇచ్చారు కదా అని సుమన అంటుంది. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే చెంప పగులుతుంది అని విక్రాంత్ అంటాడు. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి గాయత్రి పాపని దత్తత తీసుకొని పాతిక లక్షలు ఇచ్చారు, మరి నన్ను దత్తత తీసుకొని అందులో సగమైన ఇస్తారా నాన్న అని పిలుస్తాను అని సుమన అంటుంది. మీ అక్క చెంప పగల కొట్టినా నీకు బుద్ధి రాలేదే అయినా ఇందాక ఎందుకు వదిన నిన్ను లాగిపెట్టి కొట్టింది అది అడుగుదామని వచ్చి మర్చిపోయాను అని విక్రాంత్ అంటాడు. అందుకొచ్చారా నేను చీర విప్పి మార్చుకుంటుంటే ఇంక దేనికైనా వచ్చారేమో అనుకున్నాను అని సుమన అంటుంది. నీ మొహానికి ఇంకా ఆ సరదా కూడా నా అంటూ విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఏం చేస్తున్నావు అక్క అని పావన మూర్తి అడుగుతాడు. అందంగా ఉండడం కోసం ఫేషియల్ చేసుకోవడానికి పిండి తయారు చేసుకుంటున్నాను అని తిలోత్తమ అంటుంది.

ఏంటి అక్క ఇంత వయసు అయిపోయిన నీకు అందం మీద వ్యామోహం పోలేదా అని పావని మూర్తి అంటాడు. నాది ఎoత వయసు పావన మూర్తి తీపి తిప్పి కొడితే 55 సంవత్సరాలు లేవు అని తిలోత్తమ అంటుంది. నిన్నే అక్కయ్య అంటున్నాను అంటే నీకు ఎంత వయసుంటుందో తెలియదా అని పావన మూర్తి తానలో తను అనుకుంటాడు. ఇంతలో వల్లభ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది తిలోత్తమ. విక్రాంత్ విశాల్ నైని ముగ్గురు కలిసి బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క కొన్ని పాలు తీసుకొస్తావా ఉలొచికి పట్టాలి అని సుమన అంటుంది. అలాగే చెల్లి గాయత్రీ కి కూడా పట్టాలి తీసుకువస్తాను అని హాసిని కిచెన్ లోకి వెళుతుంది. అక్కడ తిలోత్తమ ఫేషియల్ కోసం కలుపుకున్నది చూసి పాలనుకుని తీసుకువచ్చి ఉలొచికి గాయత్రికి పట్టిస్తూ ఉంటారు. తిలోత్తమ ఫోన్ మాట్లాడి వచ్చి కిచెన్ లో ఫేషియల్ కోసం కలిపింది లేదేంటి అని పావన మూర్తిని అడుగుతుంది.ఏమో నాకేమీ తెలుసు అక్క అక్కడ ఉన్నది అదేంటి అని పావన మూర్తి అంటాడు.అవి పాలు అని తిలోత్తమ అంటుంది. ఒకవేళ అవే పాలనుకుని పిల్లలకు పట్టిస్తున్నారా ఏంటి అని వాళ్ళు గబగబా వస్తారు. పాలే తాగిస్తున్నారా అమ్మ అని ఎద్దులయ్య అడుగుతాడు. పాలు కాకపోతే ఇంకేం తాపిస్తాం అని సుమన అంటుంది. అవి పాలో కాదు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది కదా అని ఎద్దులయ్య అంటాడు. ఇంతలో త్రిలోత్తమ వచ్చి నేను ఫేషియల్ కోసం కలుపుకున్న పిండిని తెచ్చి పిల్లలకు పట్టిస్తున్నారా అని అడుగుతుంది.

అయ్యో అవి పాలను కొన్ని తెచ్చి పిల్లలకు పట్టాను అని హాసిని అంటుంది. అందుకే కదమ్మా ఇందాకటి నుంచి నేను అడుగుతున్నాను అని ఎద్దులయ్య అంటాడు. ఇంతలో విక్రాంత్ విశాల్ నైని ఎక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. ఫేషియల్ కోసం తయారు చేసుకున్నది తెచ్చి పిల్లలకు పట్టించారు అని పావని మూర్తి అంటాడు. ఏది పాలో ఏవి కాదో చూసుకోవద్దా పిల్లల్ని కన్నా తల్లులేనా మీరు అని విక్రాంత్ అంటాడు. విక్రాంత్ నన్ను కూడా అన్నావు కదా అని హాసిని అంటుంది. సుమనన్ను కూడా కలిపే అన్నాను వదిన అని విక్రాంత్ అంటాడు. స్వామీజీ గాయత్రి దేవికి ఆపద వస్తుంది అంటే మా అక్క కన్నా కూతురికే కదా అనుకున్నాను ఈ అనాధ పిల్లతో కలిసి నా బిడ్డకు పాల్పడితే నా కూతురుకి కూడా ఆపద వచ్చింది అని సుమన అంటుంది. ఏం మాట్లాడుతున్నావే మెంటల్ దానా చంప పగులుతుంది అని ఈక్రాంత్ అంటాడు. చిట్టి ఎందుకు అలా మాట్లాడతావు చూసుకోకుండా పట్టాను అని హాసిని అంటుంది.

ఇవి నీ కొడుకు పూనాకి పట్టించాల్సింది అప్పుడు తెలిసేది అని సుమన అంటుంది. మీ గోల ఆపి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని నైని అంటుంది. ఇంతలో స్వామీజీ వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. నేను ఇందాక కిచెన్ లో మొహానికి కెమికల్ లేనివి పెట్టుకుందామని బియ్యప్పిండి సున్నిపిండి కలిపి అక్కడ పెట్టుకున్నాను గురూజీ అది పాలనుకొని తెచ్చి పిల్లలకు పట్టారు అని తిలోత్తమ అంటుంది. గురువుగారు పిల్లలకు ఏమైనా అవుతుందా అని నైని అడుగుతుంది. పసిపిల్లలు కదా నైని పిండి అరగదు ఇబ్బంది పడతారు ఏం జరిగినా మనం చేసేది ఏమీ లేదు అని స్వామీజీ అంటాడు. అయినా అది కలుపుకొని కిచెన్ లో ఎందుకు పెట్టావు అమ్మ అని విశాల్ అంటాడు. అలా పెట్టండి గడ్డి అని హాసిని అంటుంది.
ఏ మెంటల్ నేనేం చేశాను చూసుకోకుండా నువ్వే తెచ్చి పట్టించావు అని తిలోత్తమ అంటుంది. పిల్లలు అలా ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది స్వామీజీ ఏం చేయాలి అని నైని అడుగుతుంది. నువ్వెందుకు తల్లడిల్లుతావు నైని పిల్లల ఏడుపును బాధను చూసి తట్టుకోలేక ఆ అమ్మవారి దిగి రావాలి అని తిలోత్తమ అంటుంది. ఏంటి తిలోత్తమ ఎగతాళి చేసి మాట్లాడుతున్నావ్ పరిహాసానికి సమయం కాదు ఇది అని స్వామీజీ అంటాడు. నేను అన్న దాంట్లో తప్పేముంది స్వామీజీ దసరా ఉత్సవాలలో పిల్లలకు ఒక్కరోజు పాలు దొరకవు అంటే విశాలాక్షమ్మ వచ్చి పాలు ఇచ్చింది ఇప్పుడు అలాగే అమ్మను వచ్చి కాపాడమనండి అని తిలోత్తమ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది