NewsOrbit
Cricket Entertainment News ట్రెండింగ్

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

Share

World Cup 2023: ఆదివారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా ఫైనల్ కీ చేరుకోవడంతో.. పైగా స్వదేశంలో ఈ టోర్నీ జరుగుతూ ఉండటంతో బీసీసీఐ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్ లో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వాయుసేన విన్యాసాలు నిర్వహించబోతున్నారు. ఇదే సమయంలో ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్లకు బీసీసీఐ ఆహ్వానం పంపింది. వారికి స్పెషల్ బ్లేజర్ అందించనుంది.

BCCI has released the World Cup Final Match Celebrations schdule

ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండటంతో ఆయన తప్ప మిగతా కెప్టెన్లు అందరూ రానున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కి బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రముఖ సింగర్లు, డాన్సర్లతో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించి షెడ్యూల్ బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వరల్డ్ కప్ జీవితాంతం గుర్తుండిపోయేలా అద్భుతమైన ప్రదర్శనలతో నిండిపోతుందని స్పష్టం చేసింది. మ్యాచ్ కు ముందు మధ్యాహ్నం 1.35-1.50 గంటలకు సూర్యకిరణ్ IAF ఏయిర్ షో ఉంటుందని పేర్కొంది. ఫస్ట్ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో సింగర్ ఆదిత్య గాధ్వీ షో, ఇన్నింగ్స్ బ్రేక్ లో ప్రీతమ్ చక్రవర్తి, జోనిత, నకాశ్ అజీజ్.. ప్రదర్శనలు ఉండనున్నాయి.

BCCI has released the World Cup Final Match Celebrations schdule

రెండో ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో లేజర్, లైట్ షో ఉండనుంది.. అని బీసీసీఐ ట్వీట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా షో కూడా ఉండబోతున్నట్లు గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ లో దువా లిపా షోకి సంబంధించి అలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఆ వార్తలు అవాస్తవమని తేలిపోయాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ లీగ్ దశలో భారత్… ఆస్ట్రేలియాని ఓడించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఈ రెండు జట్లు ఆడుతుండటంతో.. అందరిలో ఉత్కంఠ నెలకొంది.


Share

Related posts

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే అభిమానులకి షాక్ గ్యారెంటీ..!!

sekhar

యూరిన్ ఇన్ఫెక్షన్ పోవాలంటే ఇలా చేయండి!

Teja

Nuvvu Nenu Prema:నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ పవిత్ర పుట్టినరోజు.. ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి..

bharani jella