Prema Entha Madhuram November 18 2023 Episode 1103: ఉష బయట కూర్చుని రాసుకుంటూ ఉంటుంది.ఇంతలో దివ్య వచ్చి ఉష ఇంట్లో చానా పని పెట్టుకొని నువ్వు రాసుకుంటూ ఉన్నావా రా అని జ్యోతి అంటుంది. అక్క నేను చదువుకోవాలి ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఉష అంటుంది. చదువు తర్వాత చదువుకుందువులే కానీరా అని జ్యోతి వెళ్ళిపోతుంది. వీళ్ళు నన్ను చదువుకోనీయరు ఎగ్జామ్ లో పాస్ అవ్వనివ్వరు అనుకుంటూ చిరాకు పడుకుంటూ వెళ్ళిపోతుంది ఉష. కట్ చేస్తే, అభయ్ అక్కి అనుని కథ చెప్పమ్మా అని అంటారు. అలాగే అని అను పిల్లలకు కథ చెప్తుంది. ఆర్య బయట పడుకుందామని వెళ్లి మంచం లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. పక్కన పేపర్లు కనపడగానే ఆ పేపర్లు తీసుకుని వాళ్ల కథని రాసుకుంటాడు అర్య. ఇంతలో ఉషా వచ్చి ఏంటి అన్నయ్య ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. పెద్ద గాలి వచ్చి పేపర్ల ఎగిరిపోతాయి. అయ్యో పేపర్లన్నీ గాలికి ఎగిరిపోయాయి అని వాళ్ళిద్దరూ ఆ పేపర్లని తీస్తారు.

పేపర్లు తీస్తే దాంట్లో రైటింగ్ కనిపిస్తుంది. ఏంటన్నయ్య బయట కూర్చుని ఏం రాస్తున్నావు అని ఉష అంటుంది. ఏదో టైం పాస్ కోసం రాసుకున్నానమ్మా అని ఆర్య అంటాడు. అన్నయ్య ఈ కథ చాలా బాగుంది ఈ కథలోని మొదటి పేపర్ ఏది అన్నయ్య అని ఉషా అడుగుతుంది. గాలికి ఎక్కడో ఎగిరి పోయిందమ్మ అని ఆర్య అంటాడు. ఆ పేపర్ గాలికి ఎగిరిపోయి అను దగ్గర పడుతుంది. ఆ పేపర్ తీసుకొని అను చదువుతుంది. నీ మనసులోని ప్రేమని ఎవరికీ చెప్పాలో తెలియక పేపర్ల మీద రాసుకుంటున్నారా సార్ అని అను బాధపడుతుంది. ఇంతలో ఉషా వచ్చి గాలికి ఈ పేపర్ ఇక్కడ వచ్చి పడిందా అను గారు ఈ కథ మా అన్నయ్య రాశాడు చాలా బాగుంది కదా అండి అని ఉష అంటుంది. అవును ఆ కథ చాలా బాగుంది అని అను అంటుంది. ఆ పేపర్ తీసుకొని వెళ్లి అన్నయ్య ఇదిగో ఆ కథలోని మొదటి పేపర్ అని ఉష ఆర్య కి ఇచ్చి, అన్నయ్య దీన్ని పబ్లిక్ సిటీ చేయిస్తే బాగుంటుంది అని ఉష అంటుంది. వద్దమ్మా ఏదో టైం పాస్ కోసం రాసుకున్నాను అని ఆర్య అంటాడు.

సరదా కోసం రాసినట్టు లేదు అన్నయ్య ఎవరో రైటర్ కథ రాసినట్టు ఉంది ఇలాంటి టాలెంట్ ఎవరికి ఉంటుంది చెప్పు అని ఉష అంటుంది. ఇంతలో పిల్లలు వచ్చి మాకు కథ చెప్పు ఫ్రెండ్ అని అంటారు. అవునా అన్నయ్య ఇందాకటి నుంచి పిల్లలు కథ చెప్పమని గొడవ చేసి మరి వచ్చారు అని ఉషా అంటుంది. అలాగే అని ఆర్య పిల్లలకి కథ చెప్తాడు. కిటికీలోనుంచి చూస్తూ అను సంతోష పడిపోతుంది. కట్ చేస్తే, ఇడియట్ చెప్పిన పని సక్రమంగా చేయలేకపోయావు అని మానస హరీష్ ని తిడుతుంది. సారీ మేడం నేను ఎంతో ప్రయత్నించాను ఆ ఫోటో అక్కడ అందరికీ చూపెడదామని కానీ కుదరలేదు అని హరీష్ అంటాడు. అంత మందిలో ఒక్కరు కూడా ఆ లెటర్ చదవలేదా అని మానస అంటుంది. చదవాలని దివ్య పట్టుకుంటే అనుగారు వచ్చి లాక్కొని అక్కడే ఉన్న దీపంలో పడవేస్తే కాలిపోయింది మేడం అని హరీష్ అంటాడు. చూడు మానస ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు ఫోటో అయితే పంపించావు కానీ లెటర్ ఎందుకు పంపించావ్ నిజం బయట పెట్టాలంటే ఒక్క నిమిషం పట్టదు కానీ అది కాదు కదా మనకు కావలసింది ల్యాండ్ రాయించుకోవాలి కదా అని ఛాయా అంటుంది.

పండగ పూట సంతోషంగా ఉంటే చూడలేక వాళ్ళ సంతోషం పాడు చేద్దామని అలా చేశాను ఛాయా సారీ అని అంటుంది మానస. ఇవన్నీ పక్కన పెట్టండి ఇంతకు నీ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది అని జలంధర్ అంటాడు. మాట్లాడాను సార్ ఇంకో పది రోజుల వరకు మంచి రోజులు లేవంట ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందామని అత్తయ్య చెప్పింది అని హరీష్ అంటాడు. నీ పెళ్ళెప్పుడు కావాలి ఆ ల్యాండ్ ఎప్పుడు మా చేతికి రావాలి టైం లేదురా ఏదో ఒక చెయ్యి అని జలంధర్ అంటాడు. అన్నయ్య నువ్వు ఆవేశ పడకు నేను పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ఏర్పాట్లు చేసేసాను అని ఛాయా అంటుంది. ఈ దెబ్బతో ఆర్య పని అయిపోతుంది ఆ ల్యాండ్ మన చేతికి వస్తుంది అని జలంధర్ అంటాడు. నేను కూడా ఒక పథకం వేశాను అది గనక జరిగితే అను జీవితంలో మళ్ళీ ఆర్య మొహం చూడదు అని మానస అంటుంది. కట్ చేస్తే,పిల్లలు స్కూల్ కి లేట్ అవుతుంది తొందరగా రండి స్నానం చేయిస్తాను అని అను అంటుంది. అను గారు మీరు ఎటో బయటకు వెళ్లాలనుకున్నారు కదా నేను మా అన్నయ్య పిల్లలకు స్నానం చేయిస్తాము మీరు వెళ్ళండి అని ఉష అంటుంది. ఏమి వద్దు ఉషా వాళ్ళు అల్లరి బాగా చేస్తారు అని అను అంటుంది. అలా అల్లరి చేస్తేనే నాకు ఇష్టం ఏం పర్వాలేదు అని పిల్లల్ని తీసుకొని ఉషా వెళ్లిపోతుంది.

పిల్లలు రండి రండి వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి స్నానం చేద్దురు అని ఆర్య అంటాడు. వాళ్లని కిటికీలోనుంచి చూస్తున్నా అను అయ్యో సారు ఆ లాకెట్ ని చూస్తే గుర్తుపట్టేస్తాడు అని టెన్షన్ పడుతుంది. అక్కి స్నానం చేసే అంతవరకు ఈ లాకెట్ తీసి ఇక్కడ పెడుతున్నాను అని ఉష అంటుంది. ఆర్య ఉష పిల్లలు ఇద్దరికీ స్నానం చేయిస్తారు. స్నానం చేపించాక టవల్ పెట్టి ఆర్య ఒళ్లంతా తుడుస్తూ ఉంటాడు. ఏంటి పిల్లలు ఇప్పటిదాకా గంతులు వేసిన మీరు సైలెంట్ అయిపోయారు ఏంటి అని ఉష అంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ లు రోజు ఇలాగే స్నానం చేయిస్తారంట మాకు చెప్పి వాళ్ళు ఆనంద పడుతూ ఉంటారు అలా ఎందుకు ఎంజాయ్ చేస్తారో ఈరోజు మాకు అర్థం అయింది అని ఆభయ్ అంటాడు.

పిల్లలు ఈ రోజు నుంచి మనము ఇక్కడే ఆడుకుంటూ అల్లరి చేస్తూ స్నానం చేద్దాం అని ఆర్య అంటాడు. థాంక్యూ ఫ్రెండ్ అని అభయ్ అక్కి ఆర్య కి ముద్దు పెడతారు. వెల్కమ్ డియర్ అని ఆర్య అంటాడు. పిల్లలు మీరు వెళ్లి రెడీ అవ్వండి మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని ఆర్య అంటాడు. ఆర్య పిల్లలకి స్నానం చెయిస్తుంటే చూసిన అను ఆనందంతో పొంగిపోతుంది. పిల్లల్ని తీసుకొని లాకెట్ తీసుకొని ఉషా లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడే కూర్చుని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది