NewsOrbit
Cricket ట్రెండింగ్

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

Share

IND vs AUS final: నేడు అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూడటానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. ఇంక చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ రాబోతున్నారు. ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హాజరు కావడం జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిగ్ స్క్రీన్స్ పలు జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

Full details of Big Screens in all districts of Andhra Pradesh State in the background of World Cup Final Match

వైజాగ్ లో ఆర్కే బీచ్, అనంతపూర్ లో పోలీస్ ట్రైనింగ్ కాలేజీ, ఏలూరు ఇండోర్ స్టేడియం, గుంటూరు మాజేటి గురవయ్య హై స్కూల్, కడప ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, కర్నూల్ డిఎస్ఏ స్టేడియం, నెల్లూరు విఆర్ హైస్కూల్, ఒంగోలు జడ్పీ మినీ స్టేడియం, శ్రీకాకుళం ఎంహెచ్ స్కూల్, తిరుపతి కెవిఎస్ స్పోర్ట్స్ పార్క్, విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో… ప్రత్యేక స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 2011లో స్వదేశంలో జరిగిన వండే వరల్డ్ కప్ అప్పట్లో ధోని సారధ్యంలో ఇండియా గెలిచింది. తర్వాత 2015, 2019 లో గెలవలేదు.

Full details of Big Screens in all districts of Andhra Pradesh State in the background of World Cup Final Match

అయితే మళ్ళీ ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియా ఫైనల్ కీ చేరుకోవటంతో విజయం సాధించాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ అన్ని మ్యాచ్ లో విజయం సాధించింది. ఫైనల్లో తలపడనున్న ఆస్ట్రేలియాతో కూడా లీగ్ దశలో భారత్ ఓ మ్యాచ్ గెలవడం జరిగింది. ఈ క్రమంలో మరోసారి ఈ రెండు టీమ్స్ తలపడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఉత్కంఠత నెలకొంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉంది.


Share

Related posts

Today Gold Rate: తటస్థంగా బంగారం.. వెండి పైపైకి.. నేటి రేట్లు ఇలా..

bharani jella

Kids: మీ పిల్లలకు దంతాల సమస్యలు రాకూడదంటే ఇవి ఇవ్వకండి..!

bharani jella

Stomach Pain: కడుపు ఉబ్బరంగా ఉంటే.. వెంటనే ఇలా ట్రై చేయండి..!!

sekhar