Malli Nindu Jabili November 19 Episode 498: ఏంటి మల్లి ఎక్కడికి వెళ్తున్నావ్ అని గౌతమ్ అడుగుతాడు. అత్తయ్య ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టి పూలు పెట్టి రమ్మని చెప్పిందండి వెళ్తున్నాను అని మల్లి అంటుంది. అయితే ఇద్దరం వెళ్దాం పద అని గౌతమ్ అంటాడు. సరే అని వాళ్ళిద్దరూ ధ్వజస్తంభo దగ్గరికి వెళ్తూ ఉండగా. మల్లి వాళ్ళ ఫ్రెండ్ చూసి మల్లి బాగున్నావా అని అంటుంది. చిత్రా బాగున్నావా మనం తర్వాత మాట్లాడుకుందాం అని మల్లి అంటుంది. ఏంటే తర్వాత మాట్లాడుకుందాం అంటున్నావ్ మీ ఆయన ఎక్కడ అని చిత్రం అంటుంది. చిత్రా మనం తర్వాత మాట్లాడుకుందాం అని మల్లి అంటుంది. మల్లి మీ ఫ్రెండ్ ఏమి అడగకూడని ప్రశ్న అడగలేదు కదా చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు తనను ఎందుకు వెళ్లిపొమ్మంటున్నావు అని గౌతమ్ అంటాడు. ఇతను ఎవరు మల్లి మీ ఆయన ఎక్కడ అని చిత్ర అంటుంది. మల్లి నీ చేసుకున్నది నేనే గౌతమ్ నంద మల్లి నా భార్య ఎందుకు మీరు అలా అడిగారు అని గౌతమ్ అంటాడు.

మల్లి నీ ఆట పట్టించడానికి అలా అడిగానండి సారీ అని చిత్ర అంటుంది. భార్యాభర్తల మధ్య ఆట పట్టించడాo ఏంటి మీరు చదువుకున్న వారే కదా తెలివుంది కదా ఇలాగేనా చేసేది ఇంకెప్పుడు ఇలా చేయకండి అని గౌతమ్ వార్నింగ్ ఇస్తాడు చిత్రాకి. దండం పెడతాను ఇకనుంచి వెళ్లవే అని మల్లి అంటుంది. సారీ అండీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను మల్లి మనం తర్వాత కలుద్దాం అని చిత్ర వెళ్ళిపోతుంది. ఎక్కడ దొరుకుతారో ఏమో ఇలాంటి వాళ్లంతా అని గౌతమ్, మల్లి మనం వెళ్లి దీపాలు పెడదాం పద అని అంటాడు. మల్లి గౌతమ్ ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టి భగవంతుడా మల్లి జీవితంలో ప్రతి క్షణం నేనే అందరికంటే గొప్పగా చూసుకునేలా ఉండాలి మల్లి జీవితంలో ఇంకెవరూ నాకన్నా గొప్పగా ఆలోచించకూడదు అందరికంటే ఎక్కువగా ప్రేమగా నేనే చూసుకోవాలి అని గౌతమ్ తన మనసులో అనుకుంటాడు. ఈశ్వర అరవింద్ సార్ కి నాకు పెళ్లైన విషయం తెలిసిన రోజు ఆయన నన్ను క్షమించి దగ్గరికి తీసుకునేలా చేయి అని మల్లి మొక్కుకుంటుంది.

ఇంతలో కీర్తి గౌతమ్ కి ఫోన్ చేసి తాళిబొట్టు పూలదండలు కొత్త బట్టలు తెచ్చాను సార్ లోపలికి రమ్మంటారా అని అడుగుతుంది. ఓకే నువ్వు అక్కడే ఉండు కీర్తి నేను తర్వాత ఫోన్ చేస్తాను అని గౌతమ్ అంటాడు.కట్ చేస్తే,అందరూ నంది వాహన పూజ దగ్గర ఉంటారు. వసుంధర ఇలారా శరత్ అన్నయ్యకి నీకు పిల్లల చేత బట్టలు పెట్టిస్తాను ఎందుకు వసుంధర భయపడుతున్నావ్ రా వచ్చి కూర్చో అని కౌసల్య అంటుంది. వసుంధర వచ్చి పీట మీద కూర్చుంటుంది.

మల్లి గౌతమ్ చేతుల ఫస్ట్ పెట్టించి తర్వాత నీ చేత పెట్టిస్తాను మాలిని అని కౌసల్య అంటుంది. అమ్మ కొత్త బట్టలు వసుంధర అత్తయ్యకేనా మీరు ఆ అత్తయ్యకు పెట్టేది ఏమీ లేదా అని గౌతమ్ అంటాడు. అలాంటి తెలివి తక్కువ పని నేను ఎందుకు చేస్తాను గౌతమ్ అని కౌసల్య ఇంకో పీఠ వేసి మీరాని కూర్చోమంటుంది. అలా అనగానే వసుంధర పైకి లేచి మీరు నన్ను అవమానించడానికి ఇలా చేస్తున్నారు కదా నాతో సమానంగా మీరాకీ బట్టలు పెడతారా నాకేమీ అక్కర్లేదు అని వసుంధర అంటుంది. కౌసల్య అమ్మగారు నాకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదండి కావాలంటే ఇంటి దగ్గర బట్టలు పెడుదురుగానే ఇప్పుడు శరత్ బాబుకి వసుంధర అమ్మగారికి పెట్టండి అని మీరా అంటుంది.

Malli Nindu Jabili Episode 497: మల్లి మంచి మనసుకు కరిగిపోయిన మాలిని..
ఇక్కడ పెద్దపులి ఏమి లేదు అత్త అంతలా భయపడుతున్నావు ఎందుకు అని గౌతమ్ అంటాడు. శివపార్వతుల కళ్యాణం అయిపోయింది కదా ఇంకా గొడవలు ఎందుకు ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్లిపోదాం అని మాలిని అంటుంది. అమ్మ ఇంకా ఎన్ని రోజులు యిలా సర్దుకుంటూ పోతావు నీకు అంటూ ఒక గుర్తింపు వద్ద అని మల్లి ఏడుస్తుంది. అత్తయ్య ఎందుకు ఇప్పుడు ఇక్కడ పెద్ద గొడవ చేస్తున్నారు బట్టలే కదా పెట్టేది అని అరవింద్ అంటాడు. నువ్వు ఊరుకో అరవింద్ ఎక్కువ మాట్లాడకు అని వసుంధర అంటుంది. చూడండి అత్తయ్య ఇంకా ఎన్ని రోజులు అత్తయ్య అలా బాధపడుతూ ఉండాలి తప్పు జరిగింది మామ వల్ల శిక్ష పడాల్సిందే మామ కి కానీ మీరా అత్తకు ఎందుకు వేస్తావు మామయ్య మీరా అత్త పక్కన కూర్చోండి నేను బట్టలు పెడతాను అని గౌతమ్ అంటాడు.

శరత్ మిరా పీటల మీద కూర్చుంటే మల్లి గౌతమ్ బట్టలు పెట్టబోతు ఉండగా, వసుంధర వచ్చి ఆ బట్టల ని కింద విసిరేస్తుంది. అత్త ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా అని గౌతమ్ అంటాడు. ఇది నా ఆత్మ అభిమానానికి సంబంధించినది రా నువ్వు ఇంకేం మాట్లాడకు ఇది నా భర్త పక్కన కూర్చొని బట్టలు తీసుకుంటే నేనెలా తట్టుకొని ఊరుకుంటాను అనుకుంటున్నావు నువ్వు ఎన్ని చేసినా ఇలాగే చేస్తూ ఉంటాను పరాయి ఇళ్లలో పడి తిని తిరిగే వాళ్ళని ఏమంటారు తెలుసా అని వసుంధర అంటుంది. ఇక ఆపుతారా ఇంకొక మాట అంతకుమించి మాట్లాడితే బాగోదు అని మల్లి అంటుంది.. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది