Malli Nindu Jabili November 17 2023 Episode 497: నేను మా అక్క తరఫున కూడా అమ్మవారికి మొక్కుకున్నాను అక్క నీకు కచ్చితంగా పిల్లలు ఉంటారు నేన నా భుజాల మీద ఎక్కించుకొని ఆడిస్తాను అని మల్లి అంటుంది. నిన్ను చూస్తూ ఉంటే ఒకప్పుడు మన అనుబంధం గుర్తుకు వస్తుంది ఆ రోజుల్లో మనం ఎంత ఆనందంగా ఉండే వాళ్ళము మల్లి ఆ రోజులు తిరిగి వస్తాయా, నేను లెటర్ మార్చడం వల్ల మల్లికి గౌతమ్ కి పెళ్లి అయింది మన జీవితాలు బాగుండాలి అంటే మీ ఇద్దరికీ పెళ్లి అయినా విషయం బయటపడకుండా ఉండాలి అని మాలిని అంటుంది. గతాన్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడడం వల్ల ఉపయోగం లేదు మాలిని ఈలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది అని అరవింద్ అంటాడు. నేను ఏదీ కావాలని చేయలేదు అరవింద్ మల్లి జీవితం బాగుండాలని అప్పుడు ఇప్పుడు ఒక అక్కగా కోరుకుంటున్నాను అని మాలిని అంటుంది. సరే శివపార్వతుల కళ్యాణం మొదలవుతుంది వెళ్దాం పదండి అని మల్లి అంటుంది. కట్ చేస్తే మీరా శరత్ మెట్లు దిగుతూ ఉండగా మీరా కింద పడిపోతూ ఉంటే శరత్ పట్టుకుంటాడు.

చూసుకో లేదండి అని మీరా అంటుంది.ఏం ఆలోచిస్తున్నాడుస్తున్నావు మీరా కింద పడిపోతే దెబ్బ తగులుతుంది చూసుకోవాలి కదా అని శరత్ అంటాడు. వావ్ సూపర్ గా ఉంది మీ జంట చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారే నేను లేకుండా అని వసుంధర అంటుంది. బాగున్నారా అమ్మగారు ఎన్ని రోజులు అయింది మిమ్మల్ని చూసి అని మీరా అంటుంది. థాంక్స్ ఎక్కడ అక్క అని పిలుస్తావు అనుకున్నాను పర్వాలేదు అమ్మగారు అన్నావు ఇంకా నా మీద గౌరవం ఉందన్నమాట నా మొగుడు నీ మొగుడు అయ్యాడని గర్వపడుతున్నావు అనుకున్నాను బెస్ట్ బెస్ట్ మెచ్చుకోవచ్చు అని వసుంధర అంటుంది. ఈ తల పొగరే వద్దు అనేది వసుంధర శాంతంగా ఉంటే నువ్వు బాగుంటావు నేను బాగుంటాను అహం పెంచుకొని మాట్లాడి ఏం సంపాదించుకుంటావో చెప్పు ఇన్ని రోజులు అయినా నీలో మార్పు రాలేదు అని శరత్ అంటాడు.

నేను లేకుండా నేలకొండపల్లి వెళ్లి మీరు చేసిన పనులు అన్ని చూస్తున్నాను అని వసుంధర అంటుంది. ఇంతలో కౌసల్య వచ్చి బాగున్నావా వసుంధర ఇంకా కళ్యాణం దగ్గరికి రాలేదేంటి అని అడుగుతుంది. మల్లి ఆడించే నాటకంలో మీరందరూ సూత్రధారులై నన్ను వంటరిని చేసి ఆడుకుంటున్నారా చెప్తా మీ అందరి సంగతి అని వసుంధర అంటుంది. ఇప్పుడు గతాన్ని తొవ్వుకొని ఎందుకు వసుంధర ఇబ్బంది పడతావు శివపార్వతుల కళ్యాణం దగ్గరికి వచ్చాము కళ్యాణం చూసి ఇంటికి వెళ్ళిపోదాం అని కౌసల్య అంటుంది. నేను శివపార్వతుల కళ్యాణం చూద్దామని వచ్చాను కానీ ఇంకా ఎవరిదైనా కళ్యాణం జరుగుతుందేమో చూద్దాం అని వసుంధర అంటుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సమయం మించిపోతుంది పదండి అని శరత్ అంటాడు. వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ చూసి ఇంకా వసుంధర అత్తయ్యకు తల పొగురు దిగలేదు నేను ఇచ్చే సర్ప్రైజ్ వల్ల నా మేనత్తకి ఈరోజుతో అహం దిగిపోతుందిలే అని గౌతమ్ అనుకుంటాడు.

కట్ చేస్తే, అందరూ కళ్యాణం దగ్గరికి వెళ్తారు. అమ్మ పార్వతి వైపు తల్లిదండ్రులుగా ఎవరు ఉంటున్నారు అని పంతులుగారు అంటాడు. నేను మల్లి ఉంటున్నాం పంతులుగారు అని గౌతమ్ అంటాడు. మరి శివుడి పక్క తల్లిదండ్రులుగా ఎవరు ఉంటున్నారు అని పంతులుగారు అడుగుతాడు. మాలిని అరవింద్ ఉంటున్నారు పంతులుగారు అని గౌతమ్ చెప్తాడు. రెండు జంటలు వచ్చి పీటల మీద కూర్చోండి బాబు అని పంతులు అంటాడు. అరవింద్ జంట గౌతమ్ జంట పీటల మీద కూర్చుంటారు. శివపార్వతుల కళ్యాణం జరిపించిన వారికి ఏమైనా అరిష్టాలు బాధలు, గ్రహ దోషాలు ఉన్న తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అని పంతులుగారు చెప్తాడు.అందరూ శివపార్వతుల కళ్యాణం శ్రద్ధగా చూస్తూ ఉంటారు. బాబు ఈ జిలకర బెల్లం శివపార్వతుల తలల మీద పెట్టండి అని పంతులుగారు వాళ్లకు జీలకర్ర బెల్లం ఇస్తాడు.

గౌతమ్ మల్లి శివుడి తల మీద జిలకర బెల్లం పెడతారు. అరవింద్ మాలిని పార్వతీదేవి తల మీద జిలకర బెల్లం పెడతారు. పంతులుగారు మంగళసూత్రాన్ని వారి ఇద్దరి చేతులకు చూయించి నమస్కారం పెట్టించి అమ్మవారి మెడలో వేయిస్తాడు. అందరూ అక్షంతలు వేస్తారు.అయ్యా ఇంతటితో శివపార్వతుల కళ్యాణం అయిపోయింది, ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని జరిపించిన గౌతమ్ మల్లి దంపతులు దండలు మార్చుకుంటే బాగుంటుంది అని పంతులుగారు అంటాడు. అలాగే అని మల్లి గౌతమ్ దండలు మార్చుకుంటారు. అయ్యా అరగంటలో నంది వాహన పూజ ఉంటుంది

అది కూడా చూసి వెళ్తే శుభం జరుగుతుంది అని పంతులుగారు అంటాడు. అలాగే పంతులుగారు అరగంటలో నేను కూడా చేసే పని ఒకటి ఉంది ఈరోజు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగిపోతే బాగుంటుంది అని గౌతమ్ అంటాడు. అలాగే బాబు అన్ని సవ్యంగానే జరుగుతాయి అని పంతులుగారు అంటాడు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నావు కదా అత్త అరగంటలో నీకే తెలుస్తుంది ఉండు అప్పుడు ఏం చేస్తావో చూస్తాను అని గౌతమ్ అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది