Mamagaru November 17 2023 Episode 59: మీరు ఇందాక కరెక్ట్ గా మాట్లాడారండి మీరు అలా మాట్లాడతారని నేను అనుకోలేదు అని వసంత అంటుంది. మనల్ని అంత అవమానించినప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా అందుకే కావాలని అలా మాట్లాడాను అని సుధాకర్ అంటాడు. ఎవరు ఏ కొలత కొలిస్తే మనము అదే కొలత కొలవాలండి మన మంచితనానికి వాళ్లకు చులకనగా కనడుతున్నాము వాళ్ళు చేసిన దానికి ఇమాత్రం మాట్లాడాల్సిందే అని వసంత అంటుంది. కట్ చేస్తే చంగయ్య వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. నాన్న నేను బిజినెస్ చేద్దామనుకుంటున్నాను అని గంగాధర్ అంటాడు. ఏ బిజినెస్ నాన్న అని చంగయ్య అడుగుతాడు. అదే మామయ్య పెళ్లిలో హోల్సేల్ బిజినెస్ పెట్టిస్తాను అన్నారు కదా దాని గురించి అని గంగ అంటుంది. ఏంటమ్మా అది నువ్వు నిజం అనుకుంటున్నావా అదేదో పెళ్లి కోసం చెప్పిన చిలిపి అబద్ధం అమ్మ అని చంగయ్య అంటాడు. అబద్దమా అని గంగ అంటుంది.

నా గురించి నీకు పూర్తిగా అర్థం కాలేదా అమ్మా అర్థమయ్యేలా నువ్వన్నా చెప్పాలి కదా దేవమ్మ అని చoగయ్య అంటాడు.చిన్న అబద్ధమని ఎలా అంటారు మామయ్య గారు ఇది రెండు జీవితాలకు సంబంధించింది కదా అని గంగ అంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మ అలాగే మీ నాన్న దగ్గరికి వెళ్లి రెండు జీవితాల గురించి అని చెప్పి రెండు లక్షల కట్నం తీసుకురా అని చoగయ్య అంటాడు. మామయ్య మీకు అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నారా అని గంగ అంటుంది. చూసావా దేవమ్మ నేను ఇస్తే మాత్రం తీసుకుంటారు తీసుకురమ్మంటే మాత్రం ఎందుకు అని ప్రశ్నిస్తారు అని చంగయ్య అంటాడు. అంటే మామయ్య గారు మీ అబ్బాయి భవిష్యత్తు గురించి మీకు బాధ్యత లేదా అని గంగ అంటుంది.చూసావా దేవమ్మ నాకు బాధ్యత లేదా అని నీ కోడలు అడుగుతుంది అని అంటాడు చoగయ్య.

నేనేదో పాజిటివ్ గానే అన్నాను మామయ్య అని గంగ అంటుంది. మీ అత్తయ్య ఎప్పుడో అడిగింది గంగాధర్ చేత వ్యాపారం పెట్టించమని అని చoగయ్య అంటాడు. మరి పెట్టించొచ్చు కదా నాన్న అని గంగాధర్ అంటాడు. నువ్వు వ్యాపారానికి పనికిరావు అని చoగయ్య అంటాడు. అది కాదండి ఒక్కసారి వాడికి అవకాశం ఇచ్చి చూడండి అని దేవఅమ్మ అంటుంది. రేయ్ పుత్ర మీ అమ్మ ఓటు కూడా నీకే పడింది రా చూద్దాంలే అని చoగయ్య అంటాడు. చూద్దాంలే కాదు మామయ్య ఇప్పుడే చేయండి అని గంగ అంటుంది. నువ్వు వెళ్లి గోవర్ధన్ కొట్లో నుంచి 50వేల సామాన్ తెచ్చుకో అవి ఎక్కడైనా అమ్మేసి నీ వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకో అప్పుడు నీ తెలివితేటలని నమ్ముతాను సరే నా అని చంగయ్య అంటాడు. అలాగే నాన్న అని గంగాధర్ అంటాడు. ఏమ్మా దీనికి నీకు ఓకేనా దీని గురించి ఏదైనా నోటీసు రాసుకుందామా నోటి మాట చాలా అని చoగయ్య అంటాడు.

దీనికి నోటీస్ ఎందుకులే మామయ్య గారు అని చేతులెత్తి నమస్కారం పెడుతుంది గంగ.కట్ చేస్తే, చాలా థాంక్స్ గంగ నువ్వు నాన్నతో మాట్లాడి వ్యాపారం పెట్టించినందుకు అని గంగాధర్ అంటాడు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ లో గెలవాలి మామయ్య గారి మాట నిలబెట్టాలి అని గంగ అంటుంది. కట్ చేస్తే గంగ వాళ్ళ ఆయన బిజినెస్ బాగా నడవాలని దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొడుతుంది. గంగాధరికి డబ్బు ఇవ్వడం వెనకాల ఏదో ఫిటింగ్ ఉండే ఉంటుంది కదా అండి అని శ్రీలక్ష్మి అంటుంది. గంగ పూజ చేసి అందరికీ హారతిస్తుంది. నన్ను ఆశీర్వదించు అమ్మ అని గంగాధర్ వాళ్ళ అమ్మ కాళ్ళకి నమస్కారం పెడతాడు.

అవకాశం ఇచ్చిందేమో నేను ఆశీర్వాదం ఇచ్చేదేమో మీ అమ్మ అని తన మనసులో చంగయ్య అనుకుంటాడు. గంగాధర్ వెళ్లి మీ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకో అని దేవమ్మ అంటుంది. గంగాధర్ వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆల్ ద బెస్ట్ అని ఇంట్లో వాళ్లు అందరూ చెప్తారు. గంగ అబ్బాయికి ఎదురుగారా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అలాగే అత్తయ్య అని గంగ గంగాధర్ ఆటో తిసుకొని వెళ్తుంటే ఎదురు వచ్చి ఆల్ద బెస్ట్ అని చెప్తుంది. కట్ చేస్తే గంగాధర్ సామాన్లు తీసుకొని షాపులు ఇల్లులు అన్ని తిరిగి అమ్ముతూ ఉంటాడు. ఎలక్ట్రికల్ సామానంత అమ్ముడు పోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది