Prema Entha Madhuram November 17 2023 Episode 1102: అమ్మ దివ్య అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తాడు అందుకో అని సుగుణ అంటుంది.దివ్య అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తాడు తీసి వాళ్ళ అమ్మకి ఇస్తుంది.ఆ పసుపు తాడికి మంగళసూత్రాలు కూచి అను కి ఇచ్చి అమ్మ అను ఇది అమ్మవారి దగ్గర పెట్టి మెడలో వేసుకో అని సుగుణ చెప్తుంది. అలాగే అని అను ఆ పసుపు తాడును అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొని మెడలో వేసుకొని ఈ పసుపు తాడు నా భర్త చేతుల మీదుగా కాపాడి నాకు ఇచ్చావు నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేనమ్మ అని మనసులో అను అనుకుంటుంది. అమ్మ దివ్య ముత్తైదువులకి వాయనాలు ఇవ్వండి అని సుగుణ అంటుంది. అలాగే అమ్మ అని దివ్య అను ముత్తైదువులకి వాయనాలు ఇచ్చి పంపించేస్తారు. కట్ చేస్తే, అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. దివ్య ఈరోజు నువ్వు వేసినట్లు హరీష్ కి పెట్టమ్మా అని సుగుణ అంటుంది.

అలాగే అమ్మ అని దివ్య అట్లు ఎసుకు వచ్చి హరీష్ కు పెడుతుంది. సుగుణ అందరికీ అట్లు వడ్డిస్తుంది, అయ్యో అట్లు అయిపోయాయే ఉండు నాన్న నీకు తీసుకు వస్తాను అని సుగుణ వంటింట్లోకి వెళ్తుంది. భగవంతుడా ఈ రోజు ఎలాగైనా సార్ నేను వేసిన అట్లే తినాలి అని అను టకటక ఆట్లు వేస్తుంది. ఇంతలో సుగుణ వంటింట్లోకి రాగానే ఆంటీ ఈ అట్లు వేడివేడిగా ఉన్నాయి తీసుకువెళ్లండి అని అంటుంది అను. ఆట్లు తీసుకువెళ్లి ఆర్యకు వేయబోతుండగా అమ్మ అట్లు చల్లారిపోయాయి ఆ అట్టు నాకు వెయ్యి అని ఉష అంటుంది. మీరందరూ తింటున్నారు అన్నయ్యకు ఒక్కటి కూడా వేయలేదే ఇవి అన్నయ్య కోసం తెచ్చాను అని సుగుణ అంటుంది. పర్వాలేదమ్మా ఉషాకి వేయి అని ఆర్య అంటాడు. సూర్య ఈ మధ్య దీనికి నీ గారాభం ఎక్కువైపోతుంది రా అని సుగుణ అంటుంది. అమ్మ ఈ అట్ల మీద ఆయిల్ ఎక్కువ ఉంది అన్నయ్యకే వేయి అని ఉష అంటుంది. వంటింట్లో నుంచి చూస్తున్నా అను హమ్మయ్య అని అనుకుంటుంది.

దివ్య నువ్వు హరీష్ తిన్న ప్లేట్లో తిను అని సుగుణ అంటుంది. అలాగే అమ్మ అని దివ్య హరీష్ తిన్న ప్లేట్లో తింటుంది. దివ్య తినడం అయిపోతే ఇక నువ్వెళ్ళు నేను ఇవన్నీ తీసి వేస్తాను అని సుగుణ అంటుంది.ఎక్కడ సుగుణ ఇస్తారాకుని తీసి వేస్తుందోనని అను పరిగెత్తుకొచ్చి ఆంటీ ఇక్కడి పని నేను చూసుకుంటాను మీరు వేరే పని చూసుకోండి అని అంటుంది. అలాగే అమ్మ అని సుగుణ వెళ్ళిపోతుంది. సుగుణ వెళ్ళిపోగానే అను అటు ఇటు చూసి ఎవరూ లేరు అనుకొని ఆర్య తిన్న ప్లేట్లో అట్లు వేసుకుని తింటుంది. కట్ చేస్తే అందరూ ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో కొరియర్ బాయ్ వచ్చి కొరియర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. హరీష్ ఆ కొరియర్ తీసుకొని విప్పి చూస్తాడు. ఏంటి హరీష్ అది అని దివ్య అడుగుతుంది. ఎవరిదో ఫోటో ఉంది దివ్య అలాగే ఇందులో లెటర్ కూడా ఉంది అని హరీష్ తీసి లెటర్ చదువుతాడు. సూర్య పేరు ఉందంటే అది అన్నయ్యది హరీష్ సూర్యకి ఇచ్చేసేయ్ అని సుగుణ అంటుంది.

ఇటు ఇవ్వు నేను చదువుతాను అని దివ్య ఆ లెటర్ ను చదువుతుంది. దివ్య అన్నయ్యది నువ్వెందుకు చదువుతున్నావ్ ఇచ్చేసేయ్ అని సుగుణ అంటుంది. ఇటు ఇచ్చేయ్ దివ్య అని ఆర్య తీసుకోబోతుండగా జ్యోతి తీసుకుని చదువుతుంది. సూర్య కానీ సూర్య నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు నాకు తెలుసు సూర్య చనిపోయాడు అని జ్యోతి చదవు తుండగా అను గబగబా వచ్చి ఆ లెటర్ తీసుకొని అక్కడే ఉన్న దీపం మీద పడేస్తుంది. దీపం మీద పడిన లెటర్ కాలిపోతుంది. ఏంటి రాధా గారు మీరు చేసిన పని అని దివ్య అంటుంది. సారీ దివ్య గారు అనుకోకుండా జారి కింద పడిపోయింది అని అను అంటుంది. ఏంటి ఆ లెటర్ లో అలా రాసి ఉంది ఎవరు నువ్వు అని దివ్య అడుగుతుంది. చెప్పు సూర్య ఎవరు రాశారు నీకు ఆ లెటర్ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని సుగుణ అంటుంది. అంటే అమ్మ నాతోపాటు వచ్చిన వాడు నా ఫ్రెండ్ అతని పేరు కూడా సూర్య అందుకే సూర్య కానీ సూర్య అంటారు అందరూ వాడు ఇక్కడికి వచ్చిన రోజే అనుకోకుండా చనిపోయాడు ఆ విషయం కూడా నాకు మొన్ననే తెలిసింది అని ఆర్య అంటాడు.

అయ్యో పాపం కుటుంబంతో సంతోషంగా ఉందామని వచ్చాడు తన వాళ్ళని చూసుకోకుండానే చనిపోయాడా ఎంత దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది, ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లుతున్నారో సూర్య నువ్వు ఆ కుటుంబానికి అవసరం వచ్చినప్పుడు సహాయం చేయి నాన్న అని సుగుణ అంటుంది. అలాగే అమ్మ ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని ఆర్య అంటాడు. అందరూ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోతారు. చాలా థాంక్స్ రాధా గారు మీరు చేసిన సమయానికి మీరు వచ్చి కాపాడారు అని ఆర్య అంటాడు. మీరు మంచివారు అండి మీకు మంచే జరుగుతుంది అని అను వెళ్లిపోతుంది.

కట్ చేస్తే ఆర్య జెండి కి ఫోన్ చేసి ఆ లెటర్ ని ఫోటో ని పంపించిన వాళ్ళు ఎవరో తెలుసుకో నేను ఇక్కడికి సూర్య గా వచ్చినట్టు ఎవరికో తెలిసింది వాళ్లు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలా చేస్తున్నారు వీలైనంత తొందరగా పట్టుకో జెండి అని ఆర్య అంటాడు. అలాగే సార్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ కొరియర్ బాయ్ దొరుకుతాడు వాడికి నాలుగు తగిలిస్తే వాడే చెప్తాడు అని జెండి అంటాడు. అను గారికి నిజం చెప్పడం చాలా మంచిదయింది ఆవిడే లేకపోతే ఈరోజు గోరం జరిగిపోయేది అని ఆర్య అంటాడు. మంచికి ఎప్పుడైనా మంచే జరుగుతుంది ఆర్య అని జెండి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది