Naga Panchami November 16 2023 Episode 202: చిత్ర జ్వాలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్లేట్లతో ఆడుకుంటూ ఉంటారు. అందరూ భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఏంటి మేము వచ్చాక కూడా మీరు అలాగే కూర్చొని ఆడుకుంటున్నారు మాకు వడ్డించరా అని వైదేహి అంటుంది. ఆ మాట ఇంటి పెత్తనం తీసుకున్న పంచమికి చెప్పు మాకు కాదు అని జ్వాల అంటుంది. పెత్తనమేమో ఆవిడది వoటెమో మేము చేయాలా మేము చేయము పంచమిని చేయమనండి అని చిత్ర అంటుంది.ముందే ఆ విషయం చెప్పాలి కదా నినే వంట చేసేదాన్ని అని వైదేహి అంటుంది. అదంతా మాకు తెలియదు మాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అని జ్వాల అంటుంది. ఇప్పుడు వంట నేను చేస్తాను అని మోక్ష అంటాడు. ఈరోజు వంట నేను చేశాను అని సుబ్బు అంటాడు. సుబ్బు నువ్వు చిన్నపిల్లాడివి నువ్వు ఎలా చేశావు అని పంచమి అంటుంది.

ఎవరు చేస్తే ఏముంది ముందు ఆకలి దంచేస్తుంది వడ్డించండి అని మోక్ష అంటాడు. అందరూ కూర్చోండి నేను వడ్డిస్తాను అని పంచమి అంటుంది సుబ్బు నువ్వు కూడా వచ్చి కూర్చొని తిను అని రఘు అంటాడు. వంట చేసిన వాళ్లు వడ్డిస్తే బాగుంటుంది మీరు అందరూ తింటే నా కడుపు నిండినట్టే అని సుబ్బు అంటాడు. సిసిరా వచ్చి అన్నం తిను అని చిత్ర అంటుంది. నేను సుబ్బుతో తింటానమ్మా అని సిసిరా అంటుంది. పంచమి అందరికీ భోజనం వడ్డిస్తుంది. అందరూ చాలా బాగా వండవు సుబ్బు అని తింటారు. కానీ చిత్ర జ్వాల మాత్రం నోట్లో అన్నం పెట్టుకోగానే నాలుక మంట మండుతుంది. ఇదేంటే అందరూ అమృతం లాగా ఉందని తింటుంటే మీరు మంట మండుతుందని అరుస్తున్నారు అని శబరి అంటుంది. వాళ్లకి వండడం చేతకాక పోయినా వండిన దానికి ఎగ్గులు పెట్టడం బాగా వచ్చు అని చిత్ర వాళ్ళ ఆయన అంటాడు. అక్క మనకేమో నోరు మండుతుంటే వాళ్ళు ఏంటి అక్క అమృతం లాగా ఉందని తింటున్నారు అని చిత్ర అంటుంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఎగతాళిగా మాట్లాడుతున్నాం అంటారు చిత్రా కాసేపు సైలెంట్ గా ఉండు అని జ్వాలా అంటుంది.

సుబ్బు ఏ మాట కా మాట చెప్పుకోవాలి చిన్నపిల్లవాడివైనా చాలా బాగా చేశావు సుబ్బు అని మోక్ష అంటాడు. ఎందుకు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు ఇప్పుడు తిని చూడండి బాగానే ఉంటుంది అని సుబ్బు అంటాడు. అక్క ఇంకొక ముద్దు పెట్టుకుని చూద్దాం అని చిత్ర నోట్లు అన్నం పెట్టుకుని తింటుంది. ఏంటి చిత్ర అలాగే తింటున్నావ్ కారం మoడట్లేదా అని జ్వాల అంటుంది. అక్క సూపర్ గా ఉంది అక్క వంట నువ్వు కూడా తిను అని చిత్ర అంటుంది. జ్వాలా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని పర్వాలేదు బాగానే చేశావు అని అంటుంది. నాన్న ఈరోజు వర్షం పడుతుందేమో జ్వాలా ఒకరిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం కదా అని వాళ్ళ ఆయన అంటాడు. అందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోతారు. సుబ్బు సిసిరా మీరు రండి మీరు అన్నం తిందురు వడ్డిస్తాను అని పంచమి వాళ్ళిద్దరికీ అన్నం పెడుతుంది.

కట్ చేస్తే, ఏంటి పంచమి పక్క కింద వేసుకున్నావు మంచం మీద పడుకో అని మోక్ష అంటాడు. వద్దులేండి మీరు ఇబ్బంది పడతారు అని పంచమి అంటుంది. నిజంగా నేనంటే నీకు ఇష్టమే నా పంచమి నేను ఎంత దగ్గర అవుదామనుకున్నా కొద్ది నువ్వు దూరం పెడుతున్నావ్ అని మోక్ష అంటాడు. మీరంటే నాకు ప్రాణం అండి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నియమ నిష్టలు పాటించాలి నన్ను అర్థం చేసుకోండి అని పంచమి అంటుంది. చూడు పంచమి నువ్వు ఎంత ప్రయత్నించినా నేను మరణిస్తాననేది సత్యం అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ నేను బ్రతికి కాలం భయపడుతూ బ్రతకలేను పంచమి, నీ ప్రేమను పొంది చావాలనుకుంటున్నాను నన్ను ఎందుకు దూరం పెడుతున్నావ్ పంచమి నేను నా చావు గురించి భయపడట్లేదు, ఒక్కరోజైనా నీతో సంతోషంగా గడపాలి అనేదే నా కోరిక అని మోక్ష పంచమి నుదుటిమీద ముద్దు పెట్టబోతాడు.

అక్కడే ఫణీంద్ర తొంగి చూస్తూ ఉన్నది గమనించిన పంచమి మోక్షమే పక్క నెట్టేసి, చూడండి మన చుట్టూ కనిపించని మన శత్రువులు ఉంటారు మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్న వాళ్ళు వచ్చి నిన్ను కాటు వేస్తారు నన్ను దయచేసి అర్థం చేసుకోండి అని పంచమి అంటుంది. పంచమి పక్కకు నెట్టి వేసి అలా అనగానే మోక్ష ఏమి చేయలేక సైలెంట్ గా వెళ్ళిపోయి పడుకుంటాడు. కట్ చేస్తే నీలాంబరి పంపించిన ఇద్దరు వ్యక్తులు బీరువా తాళం పగలగొట్టి డబ్బులు తీసి ఇల్లంతా చల్లుతారు. అటుగా వెళ్తున్న చిత్ర చూసి అక్క ఇటు రా డబ్బులు ఎవరో తీసి అంత ఎగజల్లారు అని పిలుస్తుంది. గబగబా వచ్చి జ్వాలా చూసి ఈ పని పంచమి చేసిందని దానిమీద నెట్టేద్దాం చిత్ర అప్పుడు అందరు దాన్ని తిడతారు అని జ్వాల అంటుంది..