Nindu Noorella Saavasam November 16 2023 Episode 82: కాదు నేనంటే నీ ఇష్టం నేనే కట్ చేస్తా అని అమృత అంటుంది.అమ్మకి మేమిద్దరం అంటేనే ఇష్టం అన్నయ్య నేను కట్ చేస్తాము అని ఆకాష్ అంటాడు. పిల్లలు మీ కన్నా మీ మమ్మీకి మీ డాడీ అంటే ఇష్టం కాబట్టి మీ డాడీ కట్ చేస్తాడు అని నిర్మల అంటుంది.కాదమ్మ గారు చిన్నమ్మ గారికి అందరికంటే మనోహరిమ్మ గారే ఎక్కువ ఇష్టం అందుకనే మనోహరి మేడం కట్ చేస్తుంది అని నీలా అంటుంది. నీలా ఏం మాట్లాడుతున్నావే అని మనోహరీ అంటుంది. మీరు ఊరుకోండి అమ్మగారు చూడండి మిమ్మల్ని ఇప్పుడు ఎలా కేక్ కట్ చేయిస్తాను అని నీలా అంటుంది.నువ్వు ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడావు అంటే ఆ కేక్ నీ నోట్లో కుక్కి చంపేస్తాను అని మనోహరి అంటుంది. మీరు ఉండండి అమ్మగారు అని నీలా అంటుంది.

నీలా నేను ఫ్రెండ్ ను మాత్రమే వాళ్ళు ఫ్యామిలీ కాబట్టి వాళ్లు కట్ చేస్తేనే బాగుంటుంది అని మనోహరి అంటుంది.పిల్లలు మీరు నలుగురు గొడవ పడకుండా నలుగురు కట్ చేయండి అని నిర్మల అంటుంది.అలాగే అని పిల్లలు అంటారు. భాగమతి ఫోటో చూద్దామని తొంగి తొంగి చూస్తుంది కానీ ఫోటో కనిపించట్లేదు. కట్ చేస్తే గుప్తా గారు మీరు నా కుటుంబాన్ని కాపాడకపోతే నేను కాపాడుకోలేనని అనుకుంటున్నారా అని అరుంధతి గబగబా ఇంట్లోకి పరిగెత్తుకెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి పిల్లలు కేక్ కట్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మ అని పాట పాడు. పిల్లలను చూసిన అరుంధతి కాసేపు సంతోషిస్తుంది. పిల్లలు కేక్ కట్ చేస్తుంటే మిస్సమ్మ దగ్గరికి వెళ్లి మిస్సమ్మ అమనూహరి కేక్ లో ఏదో కలిపింది ఆ కేకు తినకుండా చూడు అని అరుంధతి అంటుంది. మిస్సమ్మకి తన మాటలు ఏమీ వినపడవు. ఏంటి మిస్సమ్మ చెప్తుంటే వినపడట్లేదా అని గట్టిగా అరుస్తుంది అరుంధతి. మిస్సమ్మ ఫోటో చూడడానికి ముందుకు వస్తుంది. కట్ చేస్తే అరుంధతి మళ్లీ గుప్తా దగ్గరికి పరిగెత్తుకెళ్ళి గుప్తా గారు నా కుటుంబాన్ని కాపాడండి వెళ్లి ఆ భాగికి చెప్పండి నేను ఎందుకు భాగమతికి కనపడట్లేదు అని అంటుంది.

తన శక్తితో అరుంధతి అక్కడే ఉందని గమనించిన గుప్తా గారు, చూడు బాలిక ఈరోజు అమావాస్య ఆత్మలు అమావాస్య రోజు ఎవరికీ కనపడవు ఏమీ మాట్లాడిన వినపడదు 24 గంటల వరకు నువ్వు ఎవరికీ కనిపించవు బాలికను ఇక్కడే ఉంటే విను ఇందాకటి నుంచి ఇదే చెప్పడానికి ప్రయత్నించాను కానీ నువ్వు వింటేగా నీ గోల నీదే, అయినా ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది బాలిక నీ కుటుంబానికి ఏ ఆపద రాదు నువ్వేమి టెన్షన్ పడకు అని గుప్తా అంటాడు.అంటే 24 గంటల వరకు నేను ఎవరికీ కనపడనా అప్పటిదాకా నా కుటుంబాన్ని ఏం చేస్తుందో ఆ మనోహరి ఎలా కాపాడుకోవడం అని అరుంధతి ఏడుస్తూ కూర్చుంటుంది.కట్ చేస్తే, పిల్లలు కేక్ కట్ చేయగానే నీలా బాంబు పేలుస్తుంది. బాంబు పేలగానే అక్కడ ఉన్న భాగమతి భయపడి పోయి కింద పడిపోతూ ఉండగా తన చేయి తాకి కేక్ మొత్తం కింద పడిపోతుంది. అమరేంద్ర తనను పడిపోకుండా పట్టుకుంటాడు.

కేకు కింద పడిపోవడంతో నీలా భయపడిపోయి, వెళ్ళిపోదాము మనోహరి అమ్మగారు చూస్తే చంపేస్తుంది అని అనుకుంటుంది. నువ్వేమన్నా చిన్న పిల్లవానే నీలా ఇప్పుడు ఆ బాంబుతో ఆడుకోకపోతే నీకు వచ్చే నష్టం ఏముంది నా ప్లాన్ అంతా పాడు చేసావు అని మనోహరి నీలా ని తిడుతుంది. ఇలా జరుగుతుందని నేను మాత్రం ఊహించలేదు అమ్మగారు అని నీలా అంటుంది. కింద పడిపోయిన భాగమతి కళ్ళు మండుతున్నాయని ఏడుస్తుంది. మిస్సమ్మ నీకేమైంది అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ నీకేమైంది కళ్ళు ఎందుకు మండుతున్నాయి అని నిర్మల అంటుంది. రాథోడ్ ఐస్ తీసుకురా అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ ఐస్ తీసుకొచ్చి ఇస్తాడు అమరేంద్ర భాగమతి కళ్ళకు పెడతాడు. తనను లేపి సోపాల్లో కూర్చోపెట్టు అమరేంద్ర అని శివరామ్ అంటాడు. ఏమి కాదులే మిస్సమ్మ ఐస్ పెట్టాను కదా తగ్గిపోతుంది అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, అందరూ నిద్రపోతారు.అంజు పాపా మనోహరి దగ్గర పడుకుంటుంది.

తనకి ఒక కల వస్తుంది ఆ కలలో మనోహరి వాళ్ళ అమ్మని యక్సిడెంట్ చేసి చంపేసినట్టు కనిపిస్తుంది, అంజుకి అలా కనపడగానే అమ్మ అని గట్టిగా అరుస్తుంది. పక్కనే ఉన్న మనోహరి దిగ్గున లేచి కూర్చొని అంజు నీకేమైంది అని అంటుంది. అంజు అరవడం ఇల్లంతా వినపడుతుంది అంజు ఎక్కడ ఉంది అని అందరూ వెతుకుతూ ఉంటారు. అంజు ఎందుకు అంత గట్టిగా అరిచావు అని మనోహరి అంటుంది. అసలు మీరు మా అమ్మ ఫ్రెండేనా ఆంటీ అని అడుగుతుంది అంజు. బెస్ట్ ఫ్రెండ్ ను అంజలి అని మనోహరి అంటుంది. అయితే మా అమ్మను యాక్సిడెంట్ చేసి ఎందుకు చంపావు అని అంజు అడుగుతుంది.

ఆ మాట వినగానే మనోహరి గుండెలు పగిలిపోయి భయపడతుంది. మీరు మా అమ్మను యాక్సిడెంట్ చంపినట్టు కలొచ్చింది ఆంటీ అని అంజు అంటుంది. ఇంతలో భాగమతి అటు వెళ్తుండగా అంజు పాప మనోహరి గదిలో కనపడుతుంది, అంజలి ఇక్కడే ఉంది అని భాగమతి అందరికీ చెప్తుంది. అమ్మో ఇప్పుడు అంజు అమరేంద్ర కి చెప్పితే ఆరాలు తీసి జైలుకు పంపిస్తాడు ఈ విషయం అంజు ఎవరికీ చెప్పకుండా చూసుకోవాలి అని మనోహరి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది