Naga Panchami November 18 2023 Episode 204: కానీ ఇందులో ఒక మెలిక ఉంటుంది పిల్లికి ఎలుక ఆహారం ఎలుకకు ప్రాణ సంకటం ఒక జీవికి మేలు జరగడానికి మార్గం కనిపిస్తూ ఉంటుంది అదే సమయంలో మరో జీవికి కీడు కాచుకొని ఉంటుంది అది సృష్టి రహస్యం దానిని ఎవ్వరూ చేదించలేరు అని స్వామీజీ అంటాడు. నాకు కీడు జరిగిన పర్వాలేదు పంచమికి మంచి జరగాలి అని మోక్ష అంటాడు. పంచమి పవిత్రమైన నాగ కన్య పంచమి కోసం తపిస్తున్నావు కాబట్టి నాకు తెలిసిన ఒక నిజాన్ని చెప్తాను పంచమి గర్భవతి అయితే తన కడుపున మానవ జీవి పెరుగుతున్నట్టయితే పంచమి పాముగా మారదు అని స్వామీజీ అంటాడు. నిజమా స్వామి అని మోక్ష అంటాడు. శిశువు తన కడుపులో మోయడం వలన పంచమి పాముగా మారడం జరగదు అని స్వామీజీ అంటాడు.

ఈ అవకాశం చాలు స్వామీజీ పంచమి పాముగా మారకుండా చేస్తాను అని మోక్ష అంటాడు. జన్మరిత్యా పంచమి పాము అని నీకు తెలుసు పంచమితో కలిసి నప్పుడు నీవు ప్రాణాలతో ఉండవు అలా జరిగితే సృష్టికి విరుద్ధం ఈ కారణం వల్లనే బాబు ఇంతకాలం నీకు ఈ విషయం చెప్పలేదు అని స్వామీజీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినందుకు సమస్యకు పరిష్కారం అయితే దొరికింది ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను అని మోక్ష వెళ్లిపోతాడు. కట్ చేస్తే, మనల్ని మించిన శక్తి ఏదో ఉంది కంత్రి అని తంత్రి అంటాడు. అవును తంత్రీ దానితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని కంత్రి అంటాడు. ఒరేయ్ ఆ శక్తి ఇక్కడే ఎక్కడో ఉంది మనల్ని పిలుస్తుంది రా అని తంత్రి అంటాడు. ఇంతలో సుబ్బు అక్కడికి వస్తాడు. నువ్వా మమ్మల్ని పిలిచింది అని కంత్రి అంటాడు. మా పేర్లు నీకెలా తెలుసు నువ్వు ఎవరో చెప్పు లేకుంటే కరకర నమిలి మింగేస్తాం అని తంత్రి అడుగుతాడు. నీకు అంత శక్తి ఉందా అని సుబ్బు అంటాడు.

నిన్ను మంటలో వేచి కాల్చుకొని తింటాం అని తంత్రి అంటాడు. ఓ అలాగా అని సుబ్బు నెమలికతో ఇలా అంటాడు. దానితో వాళ్ల ఒళ్లంతా మంటగా దురదగా ఉంటుంది. వాళ్లు కిందపడి మీద పడి గోకోడం చూసిన సుబ్బు మళ్లీ దురద తగ్గేలాగా చేస్తాడు. ఒరేయ్ దురద తగ్గిపోయింది రా అని కంత్రి అంటాడు. చిన్న దురదకే తట్టుకోలేకపోయారు ఏంటి అని సుబ్బు అంటాడు. తన మాయతో సుబ్బు వాళ్లను కొద్దిసేపు కొట్టుకునేలా చేసి మళ్లీ ఇటువైపు వస్తారా అని అంటాడు. మళ్లీ ఇటువైపు రాము అంటూ తoత్రి కంత్రి మాయమైపోతారు. కట్ చేస్తే, పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి నా భర్తను నువ్వే కాపాడాలి స్వామి అని మొక్కుకుంటుంది. ఇంతలో ఫణేంద్ర పంచమి ఉన్న గుడి దగ్గరికి వస్తాడు. నేను వెళ్ళాలి పక్కకు జరగండి అని పంచమి అంటుంది. నాగదేవత నాకు అంత చెప్పింది పంచమి మీ అమ్మ పగ తీర్చడం కోసం భూలోకానికి వచ్చావంట అని ఫణేంద్ర అంటాడు. నేను పుట్టింది పెరిగింది భూలోకంలోనే నాకు నాగలోకంతో సంబంధం లేదు అని పంచమి అంటుంది.

నీ భర్తని నువ్వు కాటేసి చంప లేకపోయినా నాగదేవత నాకు అవకాశం ఇచ్చింది వచ్చే కార్తీక పౌర్ణమి వరకే భూమి మీద నీకు చివరి రోజు నిన్ను నేను నాగలోకానికి తీసుకువెళ్లడం నిన్ను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అని ఫణేంద్ర అంటాడు. నా భర్తను నేను కాపాడుకుంటాను అందుకోసం ఎవరితోటి అయినా పోరాడుతాను నన్ను చంపిన తర్వాతే ఎవరైనా నా భర్త దగ్గరికి వెళ్ళగలరు మీ ప్రయత్నం ఫలించదు నాగరాజా నాగలోకానికి వెళ్లిపోండి అని పంచమి గట్టిగా తెగేసి చెబుతుంది. ఎలా జరగదో చూస్తూ అంతవరకు నేను నీ వెంటనే ఉంటాను యువరాణి అని ఫణీంద్ర అంటాడు. ఇంతలో మోక్ష వచ్చి దేవుడి దర్శనం అయిందా పంచమి అని అంటాడు మోక్ష. అయ్యింది కానీ మీరేంటి ఇలా వచ్చారు అని పంచమి అడుగుతుంది. నువ్వు పూజించే దేవుని దర్శించుకోవాలని వచ్చాను అని మోక్ష అంటాడు. పంచమి ఇతను ఎవరు అని మోక్ష అడుగుతాడు. నేను పంచమి కి దూర బంధువు నుండి నా పేరు ఫణీంద్ర పంచమిని చూసి చాలా కాలం అయింది అని ఫణీంద్ర అంటాడు.

అవును మీరు ఎక్కడ ఉంటారు అని మోక్ష అడుగుతాడు. అమెరికాలో ఉంటానండి గుడికి వస్తే సడన్గా పంచమి కనిపించింది అని ఫణేంద్ర అంటాడు. అయితే రండి మా ఇంటికి వెళ్దాం అని మోక్ష అంటాడు. లేదండి సిటీలో పని ఉండి వచ్చాను ఇంకెప్పుడైనా కలుస్తాను అని ఫణేంద్ర వెళ్ళిపోతాడు. పంచమి మీ బంధువు చాలా అందంగా ఉన్నాడు రా వెళ్ళిపోదాం అని మోక్షం తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఆ పంచమిని తన్ని తరిమేశారా నేను చెప్పిన పని అయిపోయిందా అని నీలంబరి అంటుంది. ఒక చిన్న పిల్లవాడు మమ్మల్ని కొట్టి తరిమేసాడు అని కంత్రి తంత్రి చెప్తారు.

ఒక చిన్న పిల్లవాడికి అన్ని శక్తులు ఉండడం అసంభవం ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని రండి అని నీలాంబరి అంటుంది. ఆ పిల్లవాడిని చూస్తే మాంత్రికుల లేడు కానీ ఆ పిల్లవాడి ముందు మేము ఎందుకు పనికి రాము అని కంత్రి అంటాడు. సరే మీతో పని ఉన్నప్పుడు పిలుస్తాను ఇప్పుడు మీరు వెళ్లిపోండి అని నీలాంబరి అంటుంది. కంత్రి తంత్రీ మాయమైపోతారు. ఏదో ఒకటి చేసి గ్రామ దేవతను ప్రసన్నం చేసుకొని వరాలు పొందుతాను అని నీలాంబరి అనుకుంటుంది..