NewsOrbit
Cricket ట్రెండింగ్

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

Share

IND vs AUS: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ కి దిగిన భారత్ 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేయడం జరిగింది. ఆస్ట్రేలియా అద్భుతమైన ఫీల్డింగ్ తో పాటు చక్కనైన బౌలింగ్ చేయడం జరిగింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్..లో పిచ్ బౌలర్ లకు చాలా అనుకూలంగా ఉంది. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియన్ బ్యాట్స్ మ్యాన్ లు భారీ షాట్లు కొట్టడానికి అష్ట కష్టాలు పడటం జరిగింది.

Australia won the title for the sixth time after India defeat in the World Cup final

అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేయడం జరిగింది. ఈ క్రమంలో మొదట ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ వార్నర్, మిచ్చెల్, స్మిత్ త్వరగా పడిపోగా ట్రావెస్ హెడ్ 137 పరుగులు చేసి ఆస్ట్రేలియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. హెడ్ కి జోడీగా లబుస్ 58 పరుగులు చేసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్ ఓడిపోవడంతో స్టేడియంలో ప్రేక్షకులు మరియు ఆటగాళ్లు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది కన్నీరు కూడా పెట్టుకోవడం జరిగింది. 2011వ సంవత్సరంలో ధోని సారధ్యంలో వరల్డ్ కప్ గెలవడం జరిగింది.

Australia won the title for the sixth time after India defeat in the World Cup final

ఈసారి కూడా ఇండియా గెలుస్తుందని అందరూ భావించారు. ఈ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా భారత్ జైత్రయాత్ర సాగింది. అంతేకాకుండా లీగ్ దశలో ఆస్ట్రేలియాపై భారత్ ఓసారి విజయం సాధించింది. దీంతో కచ్చితంగా ఫైనల్ ఇండియా గెలిచి కప్ సాధిస్తుందని భావించారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోయింది. భారత్ ఆటగాళ్లు చాలా ఎక్స్ ట్రాలు కూడా ఇవ్వటం పెద్ద మైనస్ అయింది. ఈ టైటిల్ తో మొత్తం అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆరుసార్లు గెలిచినట్లయింది.


Share

Related posts

జాగింగ్ కి వెళ్లి కోట్లు సంపాదించిన యువకుడు.. ఏం జరిగిందంటే?

Teja

ఐపీఎల్ గ్యారేజీ : కొట్టినోడికి కొట్టినంత మహా భాగ్యం

Special Bureau

EPFO : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక.. ఆ తేదీని అప్డేట్ చేయకపోతే మీ పీఎఫ్ డబ్బులు గల్లంతు..

bharani jella