IND vs NZ: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో… ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్ ధర లక్షల్లో పలుకుతుందట. ఏకంగా ఒక్కో సెమీఫైనల్ టికెట్ 2.5 లక్షల ధరలు పలుకుతున్నాయట. అయినా గాని క్రికెట్ ప్రేమికులు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఎంత డబ్బు అయినా పెట్టి టికెట్ కొనుగోలు చేసి మ్యాచ్ నీ చూడాలని ఆసక్తి కనబరుస్తున్నారు. మరోపక్క అధిక ధరలకు టికెట్లు అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్టు కూడా చేస్తూ ఉన్నారు.
ఈసారి ఎలాగైనా ఇండియా ఫైనల్ కి వెళ్లి వరల్డ్ కప్ సాధించాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. 2011లో స్వదేశంలో జరిగిన వండే వరల్డ్ కప్ టోర్నీలో ధోని సారథ్యంలో ఇండియా గెలవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన రెండు వరల్డ్ కప్ టోర్నీ లలో ఇండియా గెలవలేకపోయింది. కానీ ప్రజెంట్ ఈ టోర్నీలో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఈ క్రమంలో బుధవారం న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ జట్టు ప్రత్యర్థుల వ్యూహాలను బాగా అంచనా వేయగలదని తెలిపారు. న్యూజిలాండ్ అత్యంత క్రమశిక్షణ గల జట్టు.
న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా స్మార్ట్ గేమ్ ఆడుతారు. ప్రత్యర్థుల మెంటాలిటీని బాగా అర్థం చేసుకోగలుగుతారు. కీలక మ్యాచ్ లలో న్యూజిలాండ్ చాలా తెలివైన గేమ్ ఆడుతుందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సెమిస్ లోకి భారత్ టీం రావడంతో.. ముంబైలో జరిగే మ్యాచ్ గెలవాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్ చాలా కీలకం. ఎందుకంటే వచ్చే వరల్డ్ కప్ టోర్నీకి వీళ్ళ వయసు పెరగనుంది. అప్పటికి రిటైర్మెంట్ ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఈ సెమీఫైనల్ మ్యాచ్ నీ భారత్ స్టార్ ఆటగాళ్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.