Kane Williamson: స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ జైత్రయాత్ర సాగుతున్న సంగతి తెలిసిందే. మొదటినుండి నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వరకు ఎక్కడ ఓడిపోకుండా అద్భుతమైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. దీంతో వన్డే వరల్డ్ కప్ టోర్నీ పాయింట్ల పట్టికలో… భారత్ టాప్ లో నిలిచింది. బుధవారం మొదటి సెమీఫైనల్ కివీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించడం జరిగింది. ఏకంగా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ ఇద్దరూ సెంచరీలతో రాణించారు. బౌలింగ్ లో మహమ్మద్ షమ్మీ 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
న్యూజిలాండ్ టీంలో మిచెల్ సెంచరీతో రాణించటం జరిగింది. ఇదిలా ఉంటే మ్యాచ్ ఓడిపోయిన అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ లో భారత్ నీ అడ్డుకోవడం చాలా కష్టమని అన్నారు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని స్పష్టం చేశారు. భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే.. ఫైనల్ లో ఆపటం ఎలాంటి జట్టుకైనా కష్టమని పేర్కొన్నారు. టోర్నీ మొదటి నుంచి భారత్ అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా వైఫల్యాలు ఎదురవుతుంటాయి. అటువంటి పరిస్థితులలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యం. కానీ టీమిండియా ఈ టోర్నీలో నిజంగా అద్భుతంగా ఆడుతోంది.
కనీసం ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా రాణిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్ కీ చేరుకున్నారు.. అంటూ కెన్ విలియమ్సన్ భారత్ ఫామ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే నేడు ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య సెకండ్ సెమిస్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఆ జట్టు ఫైనల్ లో భారత్ తో ఆడనుంది. 2011లో స్వదేశంలో ధోని సారథ్యంలో భారత్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది. మళ్లీ ఎప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇండియా ఫైనల్ కి చేరుకోవటంతో అది స్వదేశంలో కావటంతో ఇండియా గెలవాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.