Mamagaru November 16 2023 Episode 57: చూడు గంగ మాధవరావు గారి మాటే అల ఉంటుంది కానీ వ్యక్తి చాలా మంచివాడు నేనే అడ్వాన్స్ తీసుకొని పనిచేయలేదు సారీ గంగ అని గంగాధర్ అంటాడు. నాకు ఐస్ క్రీమ్ తినబుద్ది అవట్లేదు వెళ్దాం పద అని గంగ అంటుంది. అదేంటి గంగ నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా అని గంగాధర్ అంటాడు. ఇప్పుడు ఆ ఇష్టం పోయిందండి అని గంగ అంటుంది. కట్ చేస్తే శ్రీలక్ష్మి పిల్లలకి స్టేషన్ చెప్తుంది. ఇంతలో చంగయ్య వచ్చి ఏంటి పిల్లలు చదువుకుంటున్నారా బాగా చదువుకోండి తొమ్మిదవ ఎక్కం చాలా గమ్మత్తైన ఎక్కం అని అంటాడు. తాతయ్య ఓ మంచి సినిమా వచ్చింది అది పిల్లలదే మమ్మల్ని సినిమాకి తీసుకువెళ్ళు తాతయ్య ప్లీజ్ అని పిల్లలు ప్రేమగా అడుగుతారు. సరే రా మిమ్మల్ని సినిమాకి తీసుకు వెళ్తాను కానీ నేను ఒక కథ చెప్తాను దాన్ని తెలుగులో తప్పులు పోకుండా రాయండి అప్పుడు తీసుకువెళ్తాను అని చంగయ్య అంటాడు. ఫిట్టింగ్ మాస్టారు ఎన్ని ఫిట్టింగ్ లు అయినా పెడతాడు అని శ్రీలక్ష్మి తన మనసులో అనుకుంటుంది.

మేము తెలుగు బాగా రాస్తాం తాతయ్య చెప్పండి అని పిల్లలు అంటారు.చెప్తాను రాసుకోండి అని చెంగయ్య కాదా చెప్పడం మొదలు పెడతాడు. అనగనగా అవంతిపురంలో విక్రమదీత్యుడు అనే రాజు ప్రజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అనుకోకుండా ఒక రోజు రాజు వేటకు వెళ్లాల్సి వచ్చింది రాజు వేసుకుని వెళ్తున్న గుర్రం వెళుతుండగా శబ్దం వస్తుంది అని చంగయ్య అంటాడు. తాతయ్య గుర్రం వెళ్తున్నప్పుడు వచ్చే సెద్ధం ఎలా రాస్తారు ఇది చీటింగ్ అని పిల్లలు అంటారు. పందెం అదే కదమ్మా రాయాలి అని చంగయ్య అంటాడు. ఎప్పుడు మీరు ఇంతే తాతయ్య అని పిల్లలు కోపంగా లేచి వెళ్లిపోతారు.ఏంటండీ పిల్లలు ఏదో సరదాపడి సినిమాకి తీసుకు వెళ్ళమంటే వాళ్లను కూడా బాధ పెడతారా అని దేవమ్మ అంటుంది. ఏదో సరదాగా సినిమాకు తీసుకెళ్లమన్నారు అని తీసుకువెళ్తే పిల్ల జల్లా అందరూ వస్తారు రెండు ఆటోలు కావాలి సినిమాకి వెళ్ళాక అందులో ఏమైనా తింటారు సినిమా అయిపోయి బయటికి వచ్చాక ఇంటికి వెళ్లి వంట వార్పు ఏం చేస్తాం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్దాం అంటారు సరే అని రెస్టారెంట్ కి వెళ్లి తినేసి వస్తే ఒక్కరోజు ఆనందం కోసం పది వేలు ఖర్చు అవుతాయి దేవమ్మ అని చంగయ్య అంటాడు.

కట్ చేస్తే గంగ అతను నీ ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సింది సారి గంగ అని గంగాధర్ అంటాడు. మీరు సారీ దేనికి చెప్తున్నారండి వేసుకునే బట్టలను బట్టి మనుషులకు విలువిస్తారు ఈ మనుషులు వాళ్లకు తగ్గట్టు మనం మారాలి కానీ వాళ్లేదో అన్నారని బాధపడకూడదు అండి మీరు బిజినెస్ ఎందుకు పెట్టకూడదు అని గంగ అంటుంది. గంగ బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి మన దగ్గర ఎక్కడ ఉన్నాయి అని గంగాధర్ అంటాడు. మీ నాన్న దగ్గర ఉన్నాయి కదండీ నీ భవిష్యత్తు కంటే ఆయనకు డబ్బే ముఖ్యమా అడగండి అని గంగ అంటుంది. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు గంగ అని గంగాధర్ తన మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే సీతారామయ్య పెట్టిన వీడియో పాండురంగ వాళ్ళ ఇంట్లో అందరూ చూస్తారు. ఏంట్రా పాండురంగ నువ్వు లంచం తీసుకోవడం ఏంటి అని చంగయ్య అంటాడు. అది అంతా ఉట్టిదే నాన్న నేను అతని ల్యాండ్ రిజిస్టర్ చేయలేదని అలా వీడియో చేసి పెట్టాడు అని పాండురంగ అంటాడు. నువ్వు లంచం తీసుకోలేదని నీకు తెలుసు నాకు తెలుసు ఊర్లో వాళ్లకు తెల్వదు కదా పాండురంగ అని చెంగయ్య అంటాడు. అయితే ఏం చేయమంటావు నాన్న అని పాండురంగ అడుగుతాడు. ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించి తప్పుగా అనుకుంటుంటే మా అన్నయ్య అలా తప్పు చేయడు అని మీరు అందరూ అనండి అని చoగయ్య అంటాడు. అలాగే నాన్న అని గంగాధర్ అంటాడు.

ఏంట్రా సుధాకర్ నువ్వేం మాట్లాడవేంటి అని చOగయ్య అడుగుతాడు. ఈ విషయంలో నన్ను ఏమీ అడగకండి నాన్న అయినా ఎవరికి ఏ అవసరం ఉందో ఎవరు మనసులో ఏముందో మనకేం తెలుసు అని సుధాకర్ అంటాడు. అంటే నీ ఉద్దేశ్యం ఏంట్రా తమ్ముడు లంచం తీసుకున్నాడు అని అంటున్నావా నువ్వే ఇలా అంటే ఊళ్లో వాళ్ళు ఏమంటారు అని చoగయ్య అంటాడు. అందుకే నాన్న ఈ విషయం గురించి నాకు ఏమీ తెలియదు నన్ను అడగకండి అని సుధాకర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే చూశారా మీ అన్నయ్య తమ్ముడు అంటూ ఓ ప్రేమ తెగ వలక కోస్తారు చూశారా ఇప్పుడు మీ అన్నయ్య నువ్వు లంచం తీసుకున్నావు అంటున్నాడు అని శ్రీలక్ష్మి అంటుంది.

శ్రీలక్ష్మి నేను అసలే టెన్షన్ లో ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడకు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అని పాండురంగ అంటాడు. ఏంటండీ మీ అన్నయ్యని అనేసరికి రోషం పొడుసుకు వచ్చిందా అని శ్రీలక్ష్మి అంటుంది. చూడు శ్రీ లక్ష్మి పెద్దవాడన్నక నాలుగు మాటలు అంటాడు పడాలి దానికి ఎందుకు ఇంతలా గింజుకుంటున్నావ్ అని పాండురంగ అంటాడు.నేను మీ లాగా సిగ్గు రోషం లేకుండా పుట్టలేదండి అని శ్రీలక్ష్మి అంటుంది. ఆ మాటకి పాండురంగడు శ్రీలక్ష్మి మీదికి చేయలేపుతాడు. ఆగిపోయారే కొట్టండి ఆగనకార్యం కూడా చేయండి అని శ్రీలక్ష్మి అంటుంది. పాండురంగడు ఏమేం మాట్లాడకుండా బయటికి వెళ్లిపోతాడు..