Trinayani November 16 2023 Episode 1086: గాయత్రి పాప నా చేతిలో ఉన్న మా అమ్మ ఎక్కడ ఉందో తనకి ఏ ఆపద వస్తుందో అని బాధపడుతున్నాను అని విశాల్ అంటాడు. ఎక్కడో ఉన్న గాయత్రి అమ్మగారికి ఆపద వస్తే నాకు తెలవకుండా ఎలా ఉంటుంది, అయినా యమదీప దానం చేసి మంచి పనే చేశాను అమ్మగారికి ఆపద వస్తుంది కాబట్టి ముందే జాగ్రత్త పడొచ్చు అని నైని అంటుంది. ముందే తెలిసింది కాబట్టి జాగ్రత్త పడొచ్చు నైని అని విశాల్ అంటాడు. కట్ చేస్తే. అఖండ స్వామికి మా ప్రణామాలు అని తిలోత్తమ అంటుంది. ఏంటి తిలోత్తమ ఎన్నడూ లేనిది నీ మొహం సంతోషం వెలిగిపోతుంది అని అఖండ స్వామి అంటాడు. మమ్మీ గాయత్రి పెద్దమ్మకి గండం ఉందని చెప్పమ్మా అని వల్లభ అంటాడు. అందుక మీ సంతోషమంతా కానీ మృత్యువు ఎవరు ఎక్కడ ఉన్నా ఆపలేరు తిలోత్తమ అని స్వామి అంటాడు. గాయత్రి అక్క కంపెనీలో పనిచేసే ఎంప్లాయిస్ కి బోనసులు నెలకు వచ్చేసరికి జీతాలు ఇస్తుంది కాబట్టి దేవత అని అంటే నమ్మొచ్చు, కానీ నాకు మృత్యుదేవత అంటే నేను ఎలా నమ్మగలను స్వామీజీ అని తిలోత్తమ అంటుoది.

అంటే నీ ఉద్దేశం నీ వల్ల గాయత్రీ దేవికి ఆపద వస్తుందని అనుకుంటున్నావా, కాదు నీకే ఆపద వస్తుంది ఆ ఆపద నుంచి నిన్ను నైని కాపాడుతుంది అని అఖండ స్వామి అంటాడు. అదే ఎందుకు కాపాడుతుంది స్వామీజీ అని తిలోతమ అంటుంది. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అని అఖండ స్వామి అంటాడు. కట్ చేస్తే అందరూ స్నానాలు చేయండి ఉత్తరేణి ఆకులు వేసుకొని అని విశాల్ అంటాడు. ఉత్తరేణి ఆకులే ఎందుకు వేసుకుని స్నానం చేయాలి విశాల్ అని తిలోత్తమ అడుగుతుంది. చెల్లి నీకు తెలుసు కదా మన ఊర్లో రోజు చేసేవాళ్లం కాదా అని నైని అంటుంది. ఉత్తరేణి ఆకులు గంగలో వేసుకుని స్నానం చేస్తే మనకున్న దరిద్రాలని పోతాయి అని దమ్మక్క అంటుంది. ఉదయం నుంచి ఎక్కడ బలాదూరుగా తిరిగి వచ్చారు ఇప్పుడు అన్ని వివరాలు అడుగుతున్నారు అని హాసిని అంటుంది. ఎక్కడికి వెళ్తే నీకెందుకే నువ్వు ఇంట్లో ఉండి పని చేసుకో అని వల్లభ అంటాడు. పండగల పేరు చెప్పి పనిచేసే వాళ్ళతో అనుకులoగా ఉండి పని చేయించుకోవాలి కానీ కోప్పడకూడదురా వాళ్ళు ఎన్ని అంటే మనకేంటి రా అని తిలోతమ అంటుంది. అంటే ఎన్ని అన్నా దులిపేసుకుంటున్నారన్నమాట అని హాసిని అంటుంది. వెళ్లండి అందరూ వెళ్లి స్నానం చేసి రండి అని హాసిని అంటుంది.నైని నేను స్నానం చేసి వస్తాను నువ్వు ఈ లోపు దీపం పెట్టు అని విశాల్ అంటాడు. సరే బాబు గారు అని నైని అంటుంది. ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోతారు.

సుమన వెళ్తూ ఉండగా తిలోత్తమ పిలిచి, డబ్బులు కాలిపోయినందుకు అందులో సగము కానీ ఏమైనా ఇస్తామన్నారా మీ అక్క కాని మీ బావ కానీ అని తిలోత్తమ అంటుంది. లేదు అత్తయ్య నేను చేసుకున్న దానికి వాళ్లు ఎందుకు ఇస్తారు అని సుమన అంటుంది.7 కోట్లు పోయిన మూడు కోట్లయినా బంగారo రూపంలో మిగిలింది లే మమ్మీ అని వల్లభ అంటాడు. మీ అక్క పూజలు వ్రతాలు అని అట్లతద్దికి దీపావళికి దీపాలు పెడుతూ రోజు పూజలు చేస్తుంది కాబట్టి ఇలా జరిగింది కదా లేదంటే నీ డబ్బు ఎందుకు కాలిపోయేది అని తిలోత్తము అంటుంది. అవును మమ్మీ ఇటునుంచి ఆలోచిస్తే బాగానే ఉంది అని వల్లభ అంటాడు.మా అక్క అలా ఆలోచిస్తుందంటారా అని సుమన అంటుంది. చూడు సుమన నీ దగ్గర బోడి 10 కోట్లే ఉన్నాయి నా దగ్గర వందల వేల కోట్లు ఉన్నాయి పూజలు చేసి దానధర్మాలు చేసిన తరగని ఆస్తి ఉందని బిల్డప్ ఇస్తుంది మీ అక్క అని సుమనకి ఎక్కించి చెప్తుంది తిలోత్తమా. అంతేనంటావా అని సుమన అంటుంది. ఈరోజు నిన్నే టార్గెట్ చేస్తారు కావాలంటే చూడు అని తిలోత్తమ అంటుంది. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తుంది అని సుమను అడుగుతుంది. చిన్న మరదలా ఏం చేస్తుందో చూస్తూ ఉండు అని వల్లభ అంటాడు. సరే ఏం చేస్తుందో అది చూస్తాను అంటూ సుమన కోపంగా వెళ్ళిపోతుంది. బలేగ లాక్ చేసావు మమ్మీ సింపుల్ గాని వల్లభ అంటాడు.

రేయ్ చాపను పట్టాలంటే గాలం వెయ్యాలి కదా వల్లభ చూస్తూ ఉండు ఇంట్లో ఎంత పెద్ద రచ్చ జరుగుతుందో అని తిలోత్తమ అంటుంది కట్ చేస్తే హాసిని పిల్లలకు దిష్టి తీద్దామని గోగునారా నూనెలో ముంచుతుంది.ఇంతలో వల్లభ సుమన తిలోత్తమ అక్కడికి వస్తారు. అమ్మ నీ పెద్ద కోడలు ఏమో చేస్తుంది చూడు అని వల్లభ అంటాడు. పిల్లలకు దిష్టి తీద్దామని గోగునారా చుడుతున్నాను అని హాసిని అంటుంది. దానితో దిష్టి తీస్తే పోతుందని ఎవరు చెప్పారు అని తిలోత్తము అడుగుతుంది. అస్తమానం ఇంట్లోనే కూర్చుంటే ఏం తెలుస్తుంది నిక్రాంత్ నువ్వు వెలిగించు అని హాసిని అంటుంది. ఏ మాకు ఏమైనా పని పాట లేవనుకున్నావా ఆని తిలోత్తమ అంటుంది. మా అమ్మకి పాట రాదు కానీ డాన్స్ వస్తుంది కాలు లేపి ఇలా ఇలా డాన్స్ చేస్తావు కదా అమ్మ చూపించు అని వల్లభ అంటాడు. రేయ్ పిచ్చోడా నేనెప్పుడూ రా అలాంటి చెత్త డాన్స్ వేసింది అని తిలోత్తమ అంటుంది. ఏమో ఎవరికి తెలుసు ఎవరు లేనప్పుడు కుప్పిగంతులు వేస్తున్నావేమో అని హాసిని అంటుంది. ఏంటి అక్క అత్తయ్య ని పట్టుకొని అంత మాట అనేశావు అని సుమన అంటుంది. నేనెక్కడ పట్టుకున్నాను మామయ్యే పట్టుకోలేదు అత్తయ్యని నేను పట్టుకోగలనా సో స్వీట్ అత్తయ్య అని బుగ్గను గిల్లుతుంది హాసిని. ఏ మెంటల్ దాన ఏంటే అలా గిల్లేసావని తిలోత్తమ అంటుంది. వదిన వాళ్లతో మనకెందుకు దిష్టి తియ్యి అని విక్రాంత్ అంటాడు.

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తిలోత్తమ అత్తయ్య దిష్టి అందరి దిష్టి పోవాలి అని హాసిని అంటుంది. ఏ పిచ్చి మొహం దాన నా కళ్ళు పడితే దిష్టి తగులుతుందని అంటావా అని తిలోత్తమ అంటుంది.వదిన ఉలోచికి కూడా తీయి అని విక్రాంత్ అంటాడు. నా కూతురికి ఎవరి దిష్టి తగలదు కానీ ఆ పెద్ద బొట్టం దిష్టి తగలపొతే చాలు అని సుమన అంటుంది. ఈరోజు పాములు రావు లేచిన మరదలా ఎందుకు అంటే దీపాలు ఇల్లంతా పెట్టారు, కిందనేమో భూ చక్రాలు ఆకాశంలోనేమో టపాకులు ఇల్లంతా పొగతో నిండిపోయింది మనిషే స్పృహ తప్పి పడిపోతాడు ఇంకా పాము ఎక్కడి నుంచి వస్తుంది అని వల్లభ అంటాడు . దిష్టి తగలకూడదనే పుండరీనాదానికి ఎందుకు తీయలేదు అని తిలోత్తమ అంటుంది. కన్నది నేనే అయినా నా రక్తం నా వంశధారకుడు అని మీరు ముద్దులు పెడుతున్న ఏ ఇన్ఫెక్షన్ కాలేదు కదా అందుకే ఇంకా దిష్టి ఎక్కడ తగులుతుంది అని తీయలేదు అని హాసిని అంటుంది. ఏం మాట్లాడింది మమ్మీ అది అని వల్లభ అంటాడు.

పిల్లలలో కూడా తేడా చూపిస్తున్నారని వదినా క్లియర్ గా చెప్పింది అని విక్రాంత్ వెళ్ళిపోతాడు. పదండి అత్తయ్య లక్ష్మీదేవి దగ్గర దీపాలు పెడతారంట అని సుమన అంటుంది. ఈరోజు నేను కూడా అమ్మవారి దగ్గర దీపం వెలిగించాలి అని తిలోత్తమ వెళ్ళిపోతుంది. ఈవిడ అమ్మవారి దగ్గర దీపం పెడితే నేనేం చేయాలి అని సుమన అనుకుంటుంది. కట్ చేస్తే అందరూ లక్ష్మీదేవి దగ్గర పూజకు సిద్ధం చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారమ్మా ఏమీ కనిపించట్లేదు అని పావని మూర్తి అడుగుతాడు. దురంధర పిన్ని లాగా హైట్ ఉంటే తెలిసేది బాబాయ్ అని హాసిని అంటుంది. దమ్మక్క నైని వదిన అమ్మవారికి అఖండ దీపం పెట్టడానికి రెడీ చేస్తున్నారు మామయ్య అని విక్రాంత్ అంటాడు. ఇంతలో తిలోత్తమ ఒక మూకుడు పట్టుకొని అందులో నూనె పోసుకొని వస్తుంది. మమ్మీ నువ్వేంటో పట్టుకొచ్చావు ఏంటి అని వల్లభ అంటాడు. చేతిలో చిప్ప పట్టుకొని అడుక్కుందామని వచ్చిందేమో అని హాసిని అంటుంది. ఇది చిప్ప కాదే పిచ్చి మొహం దాన దీపపు ప్రమిద ఆని తిలోత్తమ అంటుంది. అక్క అఖండ దీపం పెట్టడానికి తెచ్చింది అని పావని మూర్తి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది