Nindu Noorella Saavasam November 15episode 81: అమ్మగారు కేకు అదిగో అక్కడ ఉంది చూడమ్మా అని నీలా అంటుంది. కేకు దగ్గరికి వెళ్లి మనోహరి కేక్ మీద ఒక స్ప్రే కొడుతుంది. అమ్మగారు ఎందుకమ్మా అది కొడుతున్నారు అని నీలా అడుగుతుంది. కేకు డెకరేషన్ తక్కువైంది అందుకే డెకరేషన్ పూర్తి చేస్తున్నాను అని మనోహరి అంటుంది. అక్కడే పక్కనే ఉండి నిలబడి చూస్తున్న అరుంధతి మను ఏం చేస్తున్నావే కేకు పిల్లలు పెద్దలు అందరు తింటారే వాళ్లకు ఏమైనా అవుతుంది అని బాధపడుతుంది అరుంధతి. అమ్మగారు ఆ స్ప్రే చల్లిన కేక్ తింటే ఏమీ అవదు కదా అమ్మ అని నీలా అడుగుతుంది. ప్రాణాలు అయితే పోవె వాంతులు విరోచనాలు అవుతాయి హాస్పిటల్ కి వెళ్తారు ఆ మిస్సమ్మని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు నేను అమరేంద్ర హ్యాపీగా ఉంటాము అని మనోహరి అంటుంది. అది విన్న అరుంధతి అయ్యో పిల్లలకు ఆపద వస్తుందా ఇప్పుడు ఎవరికి చెప్పాలి మిస్సమ్మకు చెప్పితే మనుకి డౌట్ వస్తుంది ఇప్పుడు గుప్తా గారు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు అని అనుకుంటుంది.

మిస్సమ్మ వెళ్లి కేక్ తీసుకురా అని నిర్మల అంటుంది. అలాగే అని భాగమతి కేకు తీసుకురావడానికి తన రూమ్ లోకి వెళుతుంది. భాగమతి వస్తుందని గమనించిన మనోహరి నీలా బాత్రూంలో దాక్కుంటారు.వాళ్లు అదే గదిలో ఉన్నారని గమనించలేని భాగమతి వచ్చి కేక్ తీసుకుని వెళుతూ ఉండగా అది ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది ఏంటి బాక్స్ ఓపెన్ చేసినట్టు ఉంది అని నిలబడి చూస్తుంది భాగమతి.ఏంటే దానికి డౌట్ వచ్చిందా అలా చూస్తుందేంటి దొరికిపోతామా అని మనోహరి అంటుంది. మిస్సమ్మ త్వరగా కేక్ తీసుకురా అని రాథోడ్ పిలుస్తాడు. వస్తున్నాను రాథోడ్ గారు అంటూ భాగమతి వెళ్ళిపోతుంది. అమ్మగారు ఆ భగవంతుడి దయవల్ల బతికిపోయామండీ అని నీలా అంటుంది. అము పెద్దదాన్ని నాకు రెస్పెక్ట్ ఎవరు ఇస్తలేరు అని అంటున్నావు కదా ఈ రోజు నువ్వే డాడీ తో మాట్లాడు అని అంజు అంటుంది. అమ్మో నేను మాట్లాడాను నువ్వే మాట్లాడు అని అమృత అంటుంది. ఇంతలో అమరేంద్ర వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. అంటే సార్ పిల్లలు నీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అని రాథోడ్ అంటాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు అని అమరేంద్ర అడుగుతాడు.

పిల్లలు ఈరోజు మీ అమ్మ బర్త్డే కదా ఏమీ అనడు చెప్పండి అని శివరామ్ అంటాడు. అంటే డాడీ కేక్ కట్ చేసెటప్పుడు అమ్మ ఫోటో ఉంటే అమ్మ పక్కనే ఉందని ఫీల్ అవుతామని అము చెప్పాలనుకుంటుంది అని అంజు అంటుంది. ఒరేయ్ అమరేంద్ర ఈ ఒక్కరోజే కదా పిల్లలు అడిగింది తెచ్చి పెట్టరా అని నిర్మల అంటుంది. గుప్తా కి ఈ విషయం చెబుదామనే పరిగెత్తుకెళ్తున్న అరుంధతి ఆగి ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తుంది. ఉన్న సమస్యనే ఎలా పరిష్కరించాలని అనుకుంటుంటే ఇప్పుడు ఇది ఒకట ఆయన ఫోటో పెట్టడానికి ఒప్పుకోవద్దు అని అనుకుంటుంది అరుంధతి. సరే అని అమరేంద్ర ఫోటో తేవడానికి తన గదిలోకి వెళ్లి తీసుకు వస్తూ ఉంటాడు. భాగమతి కేక్ తెచ్చి అక్కడ పెడుతుంది. అమరేంద్ర కూడా ఫోటో తెచ్చి అక్కడ పెడతాడు. ఇంతలో బర్త్డే సెలబ్రేషన్ కి అందరూ వస్తూ ఉంటారు. కట్ చేస్తే అరుంధతి గుప్తా దగ్గరికి వెళ్లి గుప్తా గారు అక్కడ గోరం జరిగిపోతుంది మను కేక్ లో ఏదో కలిపింది పిల్లలకు ఆపద వస్తుంది రండి మీరు వాళ్లకి చెప్పి ఆపుదురుగాని అని అంటుంది అరుంధతి. ఈరోజు అమావాస్య ఏదో జరగబోతుంది నేను రాలేను బాలిక ఏది జరిగిన అంతా విధి రాతే దానిని ఎవ్వరూ మార్చలేరు అని గుప్తా అంటాడు.

ఏంటి గుప్తా గారు మౌనంగా ఉన్నారు రా ఏంటి నేను చెప్పేది నీకు వినపడుతుందా అయ్యో అక్కడ ప్రమాదం జరిగిపోతుంది అని అరుంధతి మొత్తుకుంటుంది. చనిపోయిన తరువాత దశదిశకర్మ అయిపోయాక ఇక్కడే ఉంటే ఆత్మ గొషిస్తుంది అని ఎంత చెప్పినా నువ్వు వినలేదు నేను ఇక్కడే ఉంటాను మా వాళ్ళ సంతోషం చూస్తూ అని ఇక్కడే ఉన్నావు ఇప్పుడు నన్నేం చేయమంటావు నేను చేసేదేమీ లేదు రాను అని గుద్ధ అంటాడు. నేను ఏం పాపం చేశానని గుప్తా గారు నన్ను అప్పుడే చంపేసి తీసుకువెళ్లిపోయారు ఇప్పుడు నా కుటుంబానికి ఆపద వస్తుంది అంటే మీరు పట్టించుకోవట్లేదు వస్తారా రారా అని అరుంధతి గట్టిగా అరుస్తుంది. నీవు ఎంత గట్టిగా అరిచినా ఈ రోజు అమావాస్య గడియలు మొదలవుతున్నాయి ఎవరికైనాను ప్రమాదం జరుగుతుంది దానిని ఆపడం నా తరమైతే కాదమ్మా నేను ఏమీ చేయలేను అని గుప్తా అంటాడు. ఇప్పుడు ఎలా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అత్తయ్య వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అని అరుంధతి ఆరాటపడుతూ మళ్లీ కేక్ కట్ చేసే దగ్గరికి వెళుతుంది. కట్ చేస్తే, మిస్సమ్మ మేడం గారి ఈ ఫోటో తెచ్చి సార్ అక్కడ పెట్టాడు చూడాలన్నావు కదా వెళ్లి చూడు అని రాథోడ్ అంటాడు.

భాగమతి ఫోటో చూద్దామని వస్తుంది కానీ అందరూ అడ్డు ఉండేసరికి ఆ ఫోటో కనిపించట్లేదు అయ్యో ఫోటో కనిపించట్లేదు అని భాగమతి అటు ఇటు తొంగి చూసి వీళ్ళ చాటుకు వాళ్ళ చాటుకు వెళ్లి చూస్తుంది కానీ ఫోటో మాత్రం కనిపించట్లేదు. ఈరోజుతో ఆ మిస్సమ్మ పని అయిపోయినట్టే నే అది బయటికి నేను అమరేంద్ర తో ఇంట్లో హ్యాపీగా ఉంటాను ఇదే జరుగుతుంది అని మనోహరీ నీలా తో అంటుంది. అమ్మగారు నాకెందుకు డౌట్ కొడుతుందమ్మా అని నీలా అంటుంది. నీకు ఇలాంటి డౌట్లు వస్తే ఇలాంటి కేకులు పది తెప్పించి నిన్ను చంపేస్తాను నోరు మూసుకొని జరిగేది చూస్తూ ఉండు అని మనోహరి అంటుంది. పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా ఎవరు కట్ చేస్తారు అని నిర్మల అడుగుతుంది. అమ్మకి నేనంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేనే కేక్ కట్ చేస్తాను అని అంజు అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది