Prema Entha Madhuram november 15 episode 1100: అను ఆ గుమ్మం దగ్గర నిలబడి బాధపడుతుంది, ఆర్య ఈ గుమ్మం దగ్గర నిలబడి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఉషా వచ్చి అన్నయ్య నువ్వు అన్నం తిందువు గాని రా పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా అని అంటుంది. పర్వాలేదు నేను ఇప్పుడు తినను నాకేం వద్దు అని ఆర్య అంటాడు. అదేంటి అన్నయ్య మేము అంటే ఆడపిల్లలం కాబట్టి ఉపవాసం ఉన్నాము మరి నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు మంచి భార్య దొరకాలని ఉంటున్నావా అర్థమైందిలే అని ఉషా అంటుంది. అదేమీ లేదమ్మా ఇల్లు అలంకరిద్దాము అని ఆర్య అంటాడు. ఇంతలో హరీష్ వస్తాడు. హాయ్ హరీష్ ఇప్పుడేనా నా రావడం అని ఆర్య అంటారు. మీరు చాలా అదృష్టవంతులు బావగారు అని ఉష అంటుంది. దేనికి అని హరీష్ అంటాడు. మా అక్క నీకోసం ఉపవాసం ఉంది కదా అందుకు అని ఉషా అంటుంది. అవునా అని హరీష్ దివ్య ని అడుగుతాడు. దివ్య ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతుంది.

అక్క నీకు మండిపడడమే వచ్చు అనుకున్నాను సిగ్గుపడడం కూడా వచ్చా అని ఉష అంటుంది. అది అలాగే అల్లరి చేస్తుంది బాబు లోపలికి రా అని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడే పక్కన నిలబడిన జ్యోతి చూసి బాధపడుతుంది. జ్యోతిని చూసిన ఆర్య దగ్గరికి వెళ్లి చూడమ్మా జ్యోతి నిన్ను కూడా మీ ఆయన దగ్గరికి చేరుస్తాను ఏదో కారణాల వల్ల మీ ఆయన నీకు దూరంగా ఉన్నాడు కానీ పర్మినెంట్గా దూరమైపోలేదు మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది నన్ను నమ్ము అని ఆర్య వెళ్ళిపోతాడు. నేను ఏదో ఒక రోజు తిరిగి వస్తానని నమ్మకంతోని ఎదురుచూస్తున్నారు కదా సార్ అని అను అక్కడే నిలబడి చూసి అనుకుంటుంది. కట్ చేస్తే, జ్యోతి పూలు కుచ్చుతుంది ఆర్య మాట్లాడుతూ ఉంటాడు. ఉష పిల్లలతో ఆడుకుంటుంది ఇదే మంచి సమయమని హరీష్ దివ్య దగ్గరికి వెళ్లి ఒక పూలదండ తీసుకొని తన మెడలో వేసి దగ్గరికి లాక్కుంటాడు.

హరీష్ ఏంటిది ఎవరైనా చూస్తే బాగోదు. ఏంటి దివ్య ఇప్పుడు భయపడుతున్నావు మన ఇద్దరికీ పెళ్లి కాబోతుంది ఒక ముద్దు పెట్టవా అని అడుగుతాడు. వద్దు ఎవరైనా చూస్తే బాగోదు అని దివ్య అంటుంది. పిల్లలతో ఆడుకుంటున్నావు చూసి ఆట పట్టిద్దామని రాకెట్లు చేసి తీసుకొచ్చి వాళ్ళ మీద విసిరేస్తుంది. ఎక్కడి నుంచి పడుతున్నాయని హరీష్ అటు ఇటు చూస్తాడు. ఎవరు వేశారో నాకు అర్థమైంది అంటూ దివ్య నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని హరీష్ చేయి పట్టుకొని లాగుతాడు. దివ్య ఎక్కడ చూస్తుందో అని ఉష పిల్లల్ని తీసుకొని పరిగెడుతూ ఉండగా అక్కి చేతికి పూల ప్లేటు తాకి ఆర్య మీద పడిపోతాయి.

అరే పూలన్నీ కింద పడిపోతున్నాయి అని వాళ్ళు పైనుంచి చూస్తారు. ఆర్య కూడా పూలు పడుతున్నాయి ఏంటి అని పైకి చూస్తాడు. అప్పుడు అక్కికి ఆర్య కనబడతాడు. అరే అతను మీ అన్నయ్య ఏంటి మా ఫ్రెండ్ అని ఆకాంక్ష అంటుంది. కాదు మా అన్నయ్య చూపెడతాను కదా అని ఉష వాళ్ళని తీసుకొని కిందికి వస్తుంది. చూడండి ఇతను మా అన్నయ్య సూర్య అని ఉష అంటుంది. మొహానికి టవల్ ఉంటే ఎలా మొహం కనిపిస్తుంది అని ఆకాంక్ష అంటుంది. మొహానికి ఉన్న టవల్ ఉష తీసేస్తుంది.

చూసావా ఇతను మీ అన్నయ్య అన్నావు కాదు మా ఫ్రెండ్ ఇక్కడ ఏం చేస్తున్నావు ఫ్రెండ్ అని ఆకాంక్ష అడుగుతుంది. అక్కి మన ఫ్రెండు కోటేసుకొని ఉంటాడు ఇతను చూడు మామూలు బట్టలు వేసుకున్నాడు ఇతను మన ఫ్రెండ్ కాదేమో అని అభయ్ అంటాడు. అదేంటి అన్నయ్య మరి మొహం అలాగే ఉంది అని ఆకాంక్ష అంటుంది. అక్కి మనం ఒక సినిమాలో చూసాం కదా ఇద్దరు ఒకేలాగా ఉంటారు వీళ్లు కూడా కమల పిల్లలు ఏమో అని అభయ్ అంటాడు. వాళ్ళ అన్నయ్య అలా అనగానే అక్కి పరీక్షిద్దామని కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు నటిస్తుంది. అప్పుడు ఆర్య అక్కి నీకేమైంది అని అంటాడు. చూసావా ఇతను మన ఫ్రెండ్ కాకపోతే ఎందుకు నన్ను పట్టుకుంటాడు అన్నయ్య రా మన అమ్మకి మా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడని చెబుదాము అని పిల్లలు ఇద్దరు లోపలికి పరిగెడతారు. ఇదేంటి అన్నయ్య పిల్లలకి నువ్వు తెలుసా ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని ఉష అంటుంది. అంటే అమ్మ పూజ రోజు వచ్చాను కదా అప్పుడు నేను వాళ్ళతో ఆడుకున్నాము అప్పటినుంచి ఫ్రెండ్ అని అంటున్నారు వాళ్లకి నేనే మీ అన్నయ్యనని తెలియదు కదా అని ఆర్య కవర్ చేస్తాడు.

ఓ అవునా అని ఉష అంటుంది. పిల్లలు ఎక్కడ నిజం చెప్తారో అని లోపలికి గబగబా పరిగెత్తుకెళ్తాడు ఆర్య. అమ్మ అమ్మ అంటూ పిల్లలు లోపలికి వెళ్తారు. మీ అమ్మ పూజ మందిరంలో ఉంది కానీ ఇలా రండి మీకోసం లడ్డు చేశాను తిని ఎలా ఉందో చెప్పండి అని సుగుణ అడుగుతుంది. ఆర్య లోపలికి వచ్చి పిల్లల కోసం వెతుకుతూ ఉండగా, అను ముసుగు వేసుకొని ఆర్య చూడకుండా పక్కకు తిరిగి నిలబడుతుంది. పిల్లల వాళ్ళ అమ్మ అని దగ్గరికి వెళ్లి పిల్లలు ఎక్కడికి వెళ్లారండి నేను వీళ్ళ ఫ్రెండ్ అని చెప్తున్నారు అని ఆర్య అంటాడు. నేను మిమ్మల్ని మా ఇంటికి పూజకు వచ్చిన రోజే చూశానండి ఏ కారణం లేకుండా మీరు అలా చేయరని నాకు తెలుసు అందుకే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు అసలేం జరిగిందో చెప్పండి అని అను అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది.