NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Madhu yashki: కాంగ్రెస్ నేత ఇంటికి భారీగా పోలీసులు, అకస్మిక సోదాలు .. పోలీసులపై మథుయాష్కీ ఫైర్

Share

Madhu yashki: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైయ్యాయి. ఓ వైపు అభ్యర్ధులు ప్రచారంలో బిజీబిజీగా ఉండగా, అధికారుల సోదాలు వారిలో ఆందోళన కల్గిస్తున్నాయి. పలువురు నాయకుల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లపైనా దర్యాప్తు సంస్థలు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఇళ్లలో పోలీసులు, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.

రీసెంట్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోమవారం నుండి హైదరాబాద్ లో ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. మై హోమ్ భుజాలో నివాసం ఉంటున్న మంత్రి సబిత అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో మూడు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చినట్లుగా ఐటీ శాఖ తేల్చింది. ప్రదీప్ రెడ్డి పాటు కోట్ల నరేంద్ర రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో రూ.7 కోట్ల 50 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో హయత్ నగర్ లో సీనియర్ నేత, ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ నివాసంపై పోలీసులు దాడి చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు చేసేందుకు ఇంటికి రాగా మధు యాష్కీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారంటూ ప్రశ్నించారు. మధు యాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారం రావడంతో దాడికి పాల్పడినట్లు గా తెలుస్తొంది. అయితే అసలు ఫిర్యాదు ఎవరు చేశారు.. సెర్చ్ వారెంట్ ఏదీ అని పోలీసులను మధు యాష్కీ ఫైర్ అయ్యారు. సమాచారం తెలియడంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం మధు యాష్కీ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి హయత్ నగర్ లో టైన్షన్ వాతావరణం నెలకొంది. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

BTech Ravi: పోలీసుల అదుపులో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి..?


Share

Related posts

Karthika Deepam Today Episode: మోనితను చెంప మీద కొట్టి,మెడలోని తాళిని తెంచేసిన కార్తీక్.!

Ram

Neelam sahni బ్రేకింగ్ : నీలం సాహ్ని రాజీనామాను ఆమోదించిన ఏపీ ప్రభుత్వం..!! 

sekhar

ఆ ముగ్గురూ పేరుకే రెబల్స్… ధైర్యం నిల్స్?

CMR