Children : పిల్లలు..తల్లిదండ్రుల మాట వినాలంటే పాటించాల్సిన పద్ధతులు
జనరేషన్ కి జనరేషన్ ( Generation ) కి మధ్య టెక్నాలజీ తో పాటు మనుషులలో కూడా చాలా మార్పులు రావడం తో ఇప్పటి పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు.పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాల్సింది పోయి.. పిల్లలు చెప్పింది పెద్దలు వినవలిసిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు అన్నీ వాళ్లకే తెలిసినట్లుగా మాట్లాడే పద్దతి వలన.. పెద్దలు చెప్పిన మాటలను అర్ధం చేసుకోకుండా మొండి ధోరణి లో ప్రవర్తించడం వలన కొన్ని పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఎంతయినా ఉంది. మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినాలంటే ఈ విధం గా చేసి చూడండి.
Children : 12 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ ఉన్నవారికి ఇలా చేసి చుడండి.
నెలలో పౌర్ణమి తిథి రోజు ఒక కొబ్బరికాయను తీసుకుని, మీ పిల్లలను తూర్పు దిక్కుగా కూర్చో బెట్టి ఆ కొబ్బరికాయతో క్లాక్ వైజ్ (సవ్య దిశలో) 7 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ లో (అపసవ్యదిశలో ) 7 సార్లు తిప్పి దిష్టి తీసి.. ఆ కొబ్బరికాయను ( Coconut ) ఎవరూ తొక్కని ప్రదేశంలో పారేయాలి. లేదంటే ప్రవహిస్తున్న నీటిలో అయినా వేసేయాలి. ఇలా 4 పౌర్ణమిలు చేసి చూడండి. మీ పిల్లలు చాలా త్వరగా మీ మాట వింటుంటారు. దీనితో పాటు , పౌర్ణమి రోజున మీ పిల్లల చేతితో అందరికీ పులిహోర ప్రసాదంగా పంచిపెట్టే విధం గా చూడండి. ఇలా చేస్తే శివానుగ్రహం వలన మీ పిల్లలు చెప్పిన మాట వింటారు.
టీనేజ్ లో ఉన్న పిల్లలు మీ మాట వినాలంటే ..
పిల్లల్ని ప్రభావితం చేసే వయస్సు టీనేజ్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ వయస్సులోనే వారు పెడదారి పట్టే అవకాశం బాగా ఉంటుంది. ఆ వయస్సులోనే మీ మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు.ఆ వయస్సు వాళ్ళని డీల్ చేయడం కన్నా పులి మీద స్వారీ చేయడం తేలికంటారు. అంట కష్టం గా ఉంటుంది టీనేజర్స్ ని డీల్ చేయడం అంటే.. అలాంటి వారికోసం తల్లిదండ్రులు ఈ విధానాలను చేసిచూడండి. నెలలో ఒక మంగళవారం రోజు చెట్టునుండి రాలి పడిన 11 రావి ఆకులు తీసుకుని ఆ ఆకుల మీద సింధూరంతో ‘శ్రీరామ’ అని మీ పిల్లల చేత రాయించి..
ఆ 11 రావి ఆకులను దండ గా కట్టి ఆంజనేయ స్వామి విగ్రహానికి మీ పిల్లల చేతితోనే ఆ దండ వేయించండి. ఇలా నెలలో ఒక్కసారి మంగళవారం రోజు చేస్తే.. హనుమంతుని అనుగ్రహం వలన త్వరలో మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు. దీనితో పాటు ప్రతిరోజూ నరసింహస్వామి చిత్రపటం దగ్గర…మీ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ ఆవ నూనెతో దీపాన్ని పెట్టించండి. ఇలా చేస్తే పిల్లలు అతిత్వరలో తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు .
ఈ విధానాలను నమ్మకం తో పాటించి చూడండి మీ పిల్లలు ఖచ్చితంగా మీ మాట వింటారు.