Pickels 1.వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను డైరెక్ట్ గా వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే వంటలు మంచి వాసన కలిగి ఉంటాయి.
2.కందముక్కలను ఉడకపెట్టే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, ముక్కలు త్వరగా ఉడుకుతాయి.
3.బియ్యం నిల్వ పెట్టుకునే డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేసుకుంటే బియ్యానికి పురుగు పట్టదు.
4.ఒక్కో సారి దోసల పిండి బాగా పులిసిపోతుంది అలాంటప్పుడు , ఆ పిండిలో రెండు చెంచాల గోధుమ పిండిని కలుపుకుంటే దోశలు రుచిగా వస్తాయి.
5.అల్లం వెల్లుల్లిని రుబ్బుకునే ముందుకాస్త వేపుకుంటే ,ఆ మిశ్రమం ఎక్కువ రోజుల పాటు తాజా గా ఉంటుంది.
6.బత్తాయి రసం తీసాక మిగిలిన గుజ్జులో గింజలను తీసివేసి పంచదార కలుపుకొని తింటే రుచి గా ఉండడం తో పాటు మంచి పోషకాలు అందుతాయి.
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో ఒక గుప్పెడు వేపాకులు వేస్తే సమస్య ఉండదు.
7.రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్ది శుభ్రం చేస్తే కొత్త వాటిలా తళ తళ మెరుస్తాయి.
8.ఇత్తడి లేదా రాగి పాత్రలను బాగా పండిన అరటిపండు గుజ్జుతో తొమినా కూడా కోత్తవాటిలా ఉంటాయి.
9.నెయ్యి తాజా గా ఉండి మంచి వాసన వస్తు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే వెన్నకాస్తున్నప్పుడు , గిన్నెలో ఒక తాజా తమలపాకును వేసి కాస్తే సరిపోతుంది.
9.నిల్వ చేసుకునే పచ్చళ్లకు ఆవ నూనెను వాడుకుంటే పచ్చళ్ళు ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటాయి.
10.అరటికాయ ముక్కలు కోసినతర్వాత నల్లబడకుండా ఉండాలంటే ఆ ముక్కల్ని మజ్జిగలో వేస్తే సరిపోతుంది.
11.వంటకాల్లో కారం వేసుకోవడం తో పాటు చిటికెడు ఉసిరి పొడిని కూడా వేసుకోవడం వలన వంటలు రుచిగా ఉంటాయి.
12.ఆకుకూరలు తాజాగా ఉండాలంటే వాటిని తడి వస్త్రం లో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
13.వాడేసిన నిమ్మ తొక్కలతో లంచ్‌బాక్స్ లు ని రుద్దితే మంచి వాసన వస్తాయి.