mens: శృంగారంలో పాల్గొనాలంటే ఆసక్తి ఉంటే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. అది నిజం అయినప్పటికీ దానికోసం సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే కొవ్వును పెంచే ఆహారం తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా చేరుతుంది. అది శృంగార ఆసక్తిని నశింపచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉండడం వలన అంగస్తంభన సమస్యలు వస్తాయి.
అదే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిల వలన హృదయ స్పందన సరిగా ఉండి పడకగదిలో స్వర్గం మీ సొంతమవుతుంది…భావప్రాప్తి ఎంత ఎక్కువ సేపు కలిగితే వీర్యం లో నాణ్యత అంత ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల సంతానం కలిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం లేదా స్ఖలనం చేసిన మగవారు ఇవేవి చేయని మగవారి కంటే మంచి నాణ్యత గల స్పెర్మ్ కలిగి ఉంటారు . బాగా బిగుతైన లోదుస్తులు ధరించడం, ఎక్కువ సమయం కుర్చీలో కూర్చుని పని చేయడం,వేడిగా ఉండే వాతావరణంలో పని చేయడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత బాగా పెరిగి ఫలితంగా శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుంది.టైట్-ఫిట్టింగ్ లేదా లూస్-ఫిట్టింగ్ లోదుస్తులు వేసుకునే వారికంటే టైట్ లోదుస్తులు ధరించినవారికి స్పెర్మ్ నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని పరిశోధనలో సైతం తేలింది.
ఏదేమైనా, స్పెర్మ్ ఉత్పత్తి ప్రారంభం నుండి పూర్తి చేయడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుంది, కాబట్టి మనిషి తన లోదుస్తులను మార్చుకుంటే, అతని స్పెర్మ్ నాణ్యత మెరుగుపడటానికి ఒక వారం రెండు వాలలో జరగదు దానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆ అలవాటుని మానిన వెంటనే రిసల్ట్ కోసం చూడకండి. కానీ బిగుతైన లోదుస్తులు ,జీన్స్ ప్యాంట్లు వేసుకునేటప్పుడు మాత్రం అలోచించి వాటిని మానేయడానికి ప్రయత్నం చేయాలి అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.