కాన్సర్ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త!

ప్రపంచంలో స్థూలకాయుల సంఖ్య ఎలా అయితే పెరుగుతుందో అలానే స్థూలకాయం వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోందని ఒక కొత్త అధ్యయనంలో బయటపడింది.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు స్థూలకాయంతో సంబంధం ఉన్న 12 రకాల కాన్సర్‌లతో పాటు  మొత్తం 30 రకాల కాన్సర్‌లను పరిశీలించారు. 1995 నుంచి 2014 లోపు అమెరికాలో 25 నుంచి 84 ఏళ్ల లోపు వయస్సు గ్రూప్‌లో ఈ కాన్సర్‌ల బారి పడిన వారిని పరిగణనలోకి తీసుకున్నారు. వీరి సంఖ్య దాదాపు కోటీ 46 లక్షలు. ‘లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌’ జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు.

స్థూలకాయంతో సంబంధం ఉన్న 12 రకాల కాన్సర్‌లలో ఆరు రకాల కాన్సర్‌లకు సంబంధించి స్థూలకాయం కారణంగా 25-49 వయస్సు గ్రూప్‌లో కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇంకా తక్కువ వయస్సు గ్రూప్‌లలో ఈ ప్రమాదం అవకాశం ఇంకా పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ ఆరు రకాల కాన్సర్‌లు మల్టిపుల్ మైలోమా (ఒక విధమైన బ్లడ్ కాన్సర్), పెద్దపేగులు, గర్భాశయం, గాల్‌ బ్లాడర్ (పిత్తాశయం), మూత్రపిండాలు, క్లోమగ్రంధి (పాంక్రియాస్) లకు వచ్చే కాన్సర్‌లు.

ఉదాహరణకు 1950లో పుట్టిన వారి కన్నా 1985లో పుట్టిన స్థూలకాయులకు మల్టిపుల్ మైలోమా వచ్చే అవకాశం 59 శాతం పెరిగింది. అదే పాంక్రియాస్ కాన్సర్ అయితే రెండు రెట్లు పెరిగింది.

స్థూలకాయం వచ్చిన వారిలో మూడింట ఒక వంతు మాత్రమే తమకు స్థూలకాయం వచ్చినట్లు తెలుసుకుని కౌన్సిలింగ్‌కు  వెళుతున్నారని ఈ అధ్యయనం రిపోర్టు రాసిన శాస్త్రవేత్త అహ్మదిన్ జమాల్ పేర్కొన్నారు. స్థూలకాయం తగ్గించడానికి ఆహారం నియమాలు, వ్యాయామం కావాలి కానీ, చికిత్స నిపుణుల సలహాలు కూడా అవసరమని ఆయన అన్నారు. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో శరీరం బరువు చూసుకోవడం అవసరమని ఆయన అంటున్నారు.

న్యూయార్క టైమ్స్ పత్రిక సౌజన్యంతో

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.