ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Face Pack: 5 రూపాయలకే పార్లర్ లాంటి ఫేషియల్ గ్లో..

Share

Face Pack: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కాస్త ఖర్చయినా ఫేషియల్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు.. అయితే ఇందులో ఉపయోగించే కెమికల్స్ తాత్కలికంగా అందంగా కనిపించేలా చేసినా.. ఆ తరువాత దృష్పరిమనాల మాటేంటి అని ఒక్కరూ కూడా ఆలోచించడం లేదు.. అదే మన ఇంట్లో ఉండే వీటితో కేవలం 5 రూపాయలు ఖర్చు కూడా అవ్వదు.. ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Parlor Glow Facial Face Pack:
Parlor Glow Facial Face Pack:

పార్లర్ గ్లో పది నిమిషాల్లో..

ఈ ఫేస్ ప్యాక్ కోసం మూడు పదార్థాలు అవసరం. ఒక చెంచా కలబంద గుజ్జు, ఒక చెంచా ఫెయిర్ అండ్ లవ్లీ, ఒక చెంచా శెనగపిండి తీసుకోవాలి. ఒక బౌల్ లో వీటన్నిటినీ వేసి కలుపుకోవాలి. కలబంద గుజ్జు లేకపోతే మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ ను ఉపయోగించవచ్చు. అదేవిధంగా మీకు ఫెయిర్ అండ్ లవ్లీ పడకపోతే మీరు ఉపయోగించే ఫేస్ క్రీమ్ వాడుకోవచ్చు. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకుని బాగా మసాజ్ చేయాలి. పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.

Parlor Glow Facial Face Pack:
Parlor Glow Facial Face Pack:

ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ముఖంపై ఉన్న మొటిమలను వాటి తాలూకు మచ్చలను పోగొడుతుంది. మోము కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. తరుచుగా ఈ ప్యాక్ వేసుకుంటే పార్లర్ లాంటి గ్లో వస్తుంది. చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి ని తొలగించి సహజ సిద్ధమైన నిగారింపును సంతరించుకునేలా చేస్తుంది. కలబంద, శనగ పిండి డెడ్ స్కిన్ సెల్స్ ను రిపేర్ చేసి స్కిన్ గ్లో అయ్యేలా చేస్తాయి.


Share

Related posts

వందేమాతరమే కాదు..జనగణమణా పాడతాం!

Siva Prasad

Acharya: థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది..మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

GRK

24న హస్తినకు తెలంగాణ సీఎం

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar