Finger: మనం రోజువారీ పనులు చేసేది చేతివేళ్ళ సాయంతోనే.. కూరగాయలు తరగలన్నా, ఫోన్ నొక్కాలాన్నా, కీబోర్డుపై వేళ్ళతో నాట్యం చేయాలన్నా, స్టీరింగ్ తిప్పాలన్నా చేతి వేళ్ళు అవసరమే..!! మరి ఈ చేతి వేళ్ళు కోసం ఏమైనా ఎక్సర్సైజులు చేస్తున్నారా..!? కాదు అని సమాధానమే అందరం చెప్పేది.. మరి ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి.. చేయపోతే ఏమవుతుందో.. ఇప్పుడు చూద్దాం..!!
మనం రోజూ ఒకే రకమైన కదలికలతో చేసే పనులతో వేళ్ళు అలసిపోతాయి. కీళ్ళు బిగుసుకు పోతాయి. కండరాలు బలహీనపడి చేతి బిగుతు తగ్గిపోవచ్చు. అందుకని ఇప్పుడు చెప్పు నే ఎక్స్ సైజులు చేస్తే చేతి వేళ్ళ కదలికలు మెరుగవుతాయి. మనం ఫాస్ట్ గా పని చేయడానికి వేళ్ళు సహకరిస్తాయి. నొప్పులు తగ్గి యాక్టివ్ గా ఉంటాయి. మిగతా వేళ్ళ మీదుగా బొటనవేలు పోనిస్తూ పిడికిలి బిగించాలి. ఇలాగే పిడికిలే ని గట్టిగా పట్టి కాసేపు ఉంచాలి. తరువాత వెళ్ళను వీలైనంత వెడల్పుగా సాగ దియ్యండి. ఇలా చేయడం వలన చేతి నరాలన్నీ యాక్టివ్ గా మారుతాయి.
సాఫ్ట్ బాల్ లేదా స్ట్రెస్ బాల్ చేతిలో పెట్టుకొని వీలైనంత గట్టిగా నొక్కుతూ ఉండాలి. కొద్దిసేపు గట్టిగా పట్టుకుని అలా వదిలేయాలి. ఇలా రోజులో 15 సార్లు చేస్తూ ఉండాలి. అలాగే ఒక టేబుల్ మీద అర చేతిని ఆనించి ఒకవేళ ని పైకి లేపి ఉంచాలి. అలా మీకు వీలైనంత సేపు ఉంచి తర్వాత కిందకు పెట్టేయాలి. తర్వాత మిగతా వేళ్ళు చేస్తూ అలా మొత్తం పది వేళ్ళు చేసుకుంటూ వెళ్లాలి. ఇదేమి మేము చేయలేము అనుకునే వారు చేతిలో గోరు వెచ్చటి నీళ్లలో కాసేపు పట్టుకొని ఉంచండి. ఇలా చేసినా కూడా చేతులు, వెళ్లు నొప్పి గా ఉన్నా, కండరాలు బిగుసుకుపోయినట్లుగా ఉన్నా ఈ వ్యాయామాలు అద్భుతంగా పనిచేస్తాయి.