NewsOrbit
న్యూస్ హెల్త్

Health: అల్ట్రాసెట్ వాడుతున్నారా? అయితే ఇది తప్పక చదవాల్సిందే, అల్ట్రాసెట్ టాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, అడిక్షన్ అవకాశాలు!

Ultracet tablet Uses and side effects and it will be addicted or not

Health: అల్ట్రాసెట్.. ఇంగ్లీష్ మెడిసిన్ వాడివరికి ఈ పేరు తెలియకుండా ఉండదు. ముఖ్యంగా రకరకాల  రక నొప్పులు అనుభవించే వారికి ఈ టాబ్లెట్ పరిచయమే..  ఎందుకంటే ఇది చక్కటి పెయిన్ కిల్లర్.. నొప్పి ఏదైనా సరే అల్ట్రాసెట్ వేస్తే సరి అంటారు ఈ టాబ్లెట్ వాడేవారు.. అల్ట్రాసెట్ టాబ్లెట్ వేసుకోవడం నిజంగా మన ఆరోగ్యానికి మంచిదేనా.!? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తావా.!? అడిక్షన్ అయ్యే అవకాశం ఉందా.,!? వంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

Ultracet tablet Uses and side effects and it will be addicted or not
Ultracet tablet Uses and side effects and it will be addicted or not

అల్ట్రాసెట్ ఉపయోగాలు..
అల్ట్రాసెట్ అనేది జ్వరం, తలనొప్పి, బాడీపెయిన్స్ నుంచి ఉపశమనాన్ని అందించే టాబ్లెట్. కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పి, వెన్ను నొప్పులు, రుతు సమయంలో వచ్చే నొప్పులు, పంటి నొప్పి , ఇలా అన్ని రకాల నొప్పులకు చక్కని పెయిన్ కిల్లర్ గా ఈ టాబ్లెట్ ఉపయోగపడుతుంది.. అల్ట్రాసెట్ అనేది ట్రామాడోల్, ఎసిటమైనోఫెన్ మిశ్రమం. ట్రామాడోల్ అనేది ఓపియాయిడ్ల మాదిరిగానే పనిచేసే నొప్పి నివారిణి కొన్నిసార్లు దీనిని మత్తుమందు అని కూడా పిలుస్తారు. ఎసిటమైనోఫెన్ అనేది తేలికపాటి నొప్పి నివారిణి. ఎసిటమైనోఫెన్ కొన్ని సార్లు ట్రామాడోల్ ప్రభావాన్ని పెంచుతుంది.

అల్ట్రాసెట్ సైడ్ ఎఫెక్ట్స్..!
ప్రతి టాబ్లెట్ కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది అలాగే అల్ట్రాసెట్ టాబ్లెట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి..
వాంతులు, వికారం , ఊపిరి ఆడకపోవటం, ఛాతి నొప్పి, దద్దుర్లు, అలర్జీ , అజీర్ణం, పొత్తి కడుపులో నొప్పి, నోరు ఎండిపోవడం, ఆందోళన , మైకం, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూల ప్రభావాలు మీకు ఏమైనా ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆలర్జీలు ఉన్నవారు ఈ టాబ్లెట్ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని గుర్తుంచుకోవాలి. అలాగే మెదడు రుగ్మతలు, శ్వాస సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, కాలేయ సమస్యలు, మానసిక రుగ్మతలు ఉన్నవారు అల్ట్రాసెట్ ను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. దీనిని బట్టి చూస్తుంటే అల్ట్రాసెట్ తగ్గించే వాటికన్నా.. అల్ట్రాసెట్ ను ఉపయోగించడం వలన ఎన్ని దుష్ప్రభావాలు కలుగుతాయో అర్థం చేసుకోవచ్చు.

అల్ట్రాసెట్ కి అడిక్షన్ అవుతారా.!?
అల్ట్రాసెట్ కి అడిక్షన్ అవుతారా అంటే అవును అంటున్నారు వైద్యులు. అల్ట్రాసెట్ టాబ్లెట్ అనేది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడితే ఉపయోగకరం. ఎందుకంటే ఇది వేసుకోవటం ఒక అలవాటుగా మారితే అది వ్యసనంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా ఎక్కువ కాలం ఈ టాబ్లెట్ ను ఉపయోగిస్తే తక్కువ మోతాదులో తీసుకున్నా కానీ.. అల్ట్రాసెట్ వ్యసనంగా మారుతుంది. ప్రతిరోజు ఈ టాబ్లెట్ వేసుకోకుండా ఉండలేని పరిస్థితికి కూడా రావచ్చు.. అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అల్ట్రా సెట్ తీసుకోకూడదు. ఈ టాబ్లెట్ ఎక్కువ రోజులు వాడితే కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలుగుతాయని గుర్తుంచుకోవాలి. టీ కాఫీ లకు ఎలాగైతే ఎడిక్ట్ అయిపోతాము‌. అల్ట్రాసెట్ కూడా అలాగే ఎడిక్ట్ అయిపోతామని నిపుణులు చెబుతున్నారు.

author avatar
bharani jella

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!