Under Arm: కొన్ని రకాల హోమ్ టిప్స్ ఉపయోగించి వాటి ద్వారా మనం చాలా సులభంగా చంక భాగంలో పేరుకుపోయిన నలుపుని ఈజీగా తొలిగించుకోవచ్చు. చంక భాగంలో పేరుకుపోయిన నలుపుని తొలగించే ఈ టిప్ ఏంటో తెలుసుకుందాం..

ఈ టిప్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల మైదాపిండిని తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ బంగాళాదుంప రసం,1 స్పూన్ పెరుగు,ఇంకా అలాగే అర టీ స్పూన్ వంట సోడా , నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చంక భాగాన్ని చర్మం పై రాసి బాగా మర్దన చేసుకోవాలి. ఇక అది ఆరిన తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. దీనికి వంట సోడా ఉపయోగిస్తే ఈ టిప్ ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. అదే వంట సోడా ఉపయోగించకపోతే ఈ టిప్ ని వారానికి మూడు నుండి నాలుగు సార్లు ఉపయోగించుకోవచ్చు..
ఈ విధంగా ఈ టిప్ ని ఉపయోగించడం వల్ల చంక భాగంలో పేరుకుపోయిన నలుపు చాలా ఈజీగా తొలిగిపోతుంది. దీనిని వాడిన మొదటి సారి మనం కచ్చితంగా చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఇంకా అదే విధంగా చంక భాగంలో నలుపు తొలగించే మరో టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దీనికోసం ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల శనగ పిండిని తీసుకుని ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు మరియు రెండు టీ స్పూన్ల పంచదార ఇంకా రెండు టీ స్పూన్ల పెరుగు వేసి కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చంక భాగంలో రాస్తూ మర్దన చేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చంక భాగం లో పేరుకుపోయిన నలుపు మరియు మృత కణాలు ఇంకా అలాగే మురికి తొలగిపోయి.. ఆ భాగంలో చర్మం కచ్చితంగా తెల్లగా మారుతుంది.వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల కచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది..