vinegar: తామర అనేది చాలా చిరాకు కలిగించే వ్యాధి. సకాలంలో చికిత్స చేయించుకోకపోతే , అది నెమ్మదిగా శరీరమంతా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తామర అనేది ఒక రకమైన ఫంగస్. ఇది ఒక వ్యక్తి యొక్క తల, పాదం, మెడ లేదా శరీర ఇతర అంతర్గత భాగాల్లో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎరుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది గుండ్రని ఆకారంలో ఉంటుంది. ఈ తామర (రింగ్వార్మ్) తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం.
రెండు లవంగాలు, ఒక పచ్చి వెల్లుల్లి మొగ్గ, ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. లవంగాలు మరియు వెల్లుల్లి లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు దురద ను తగ్గిస్తాయి. కొబ్బరి నూనె మరో వండర్ ఫుల్ హోం రెమెడీ. తామర ను మూలాల నుండి నివారించే గుణాలు కొబ్బరి నూనెలో ఎక్కువగా ఉన్నాయి. అంతే కాదు, ముందు ముందు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.ఈ ఔషధాన్ని తయారు చేయడానికి ముందుగా లవంగాలు, వెల్లుల్లి ని మెత్తగా నూరుకుని దానికి చిన్న చెంచా కొబ్బరి నూనె ను కలిపి ఈ మూడింటినీ బాగా కలిపి మరలా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను శరీరంలో తామర ఉన్న భాగాలపై అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఈ రెమిడీ రోజుకు రెండుసార్లు చొప్పున, మూడు నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా రాస్తూ ఉండడం వల్ల, దురద మరియు తామర రెండు కూడా మూలాల నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది .వెనిగర్ తో,ఉప్పును కలిపితే ఇది ఒక మంచి యాంటీ ఫంగల్ మెడిసిన్ గా పనిచేస్తుంది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తామర ఉన్న ప్రదేశంలో ఈ కాంబినేషన్ ద్రవాన్ని అప్లై చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు.