NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: మార్చి 31 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: మార్చి 31 – శుక్రవారం చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
వృత్తి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు కలసి వస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి.
మిధునం
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలసి రావు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటకం
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సమర్థించుకుంటారు. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.
సింహం
బంధువర్గం తో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహపరుస్తాయి. కొన్ని పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
కన్య
వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
తుల
కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మరింత ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికం
దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. సోదరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ధనస్సు
మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆలయాలు సందర్శించు కుంటారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతోంది. కుటుంబ పెద్దలు ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం.
మకరం
ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన సౌకర్యాల విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
కుంభం
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మీనం
కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నూతన ప్రయత్నాలు కలిసి రాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఉంటాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

Today Horoscocpe: ఏప్రిల్ 15- చైత్ర మాసం – రోజు వారి రాశిఫలాలు

somaraju sharma

Today Horoscope: ఏప్రిల్ 21 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Daily Horoscope జూలై 26 ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha