Agriculture: షాక్ః రైతుల‌ ఆందోళ‌న‌ల‌కు శుభం కార్డు?

Share

Agriculture: ఢిల్లీ కేంద్రంగా జ‌రుగుతున్న రైతు ఆందోళ‌న‌ల‌కు శుభం కార్డు ప‌డ‌నుందా? అన్న‌దాత‌ల ఆందోళ‌న‌ల విష‌యంలో ప్ర‌చారం ఒక‌టి వాస్త‌వ ప‌రిస్థితి మ‌రొక‌టి అన్న‌ట్లుగా ప‌రిస్థితులు మారిపోతున్నాయా? అంటే అవున‌నే అంటున్నాయి స‌ద‌రు భాగ‌స్వామ్య‌ప‌క్షాలు. రైతు ఉద్య‌మంపై రాష్ట్రీయ కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ట‌న్ జాతీయ అధ్య‌క్షుడు స‌ర్దార్ వీఎం సింగ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైతుల ఆందోళ‌న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ నాయ‌కులు కావాల‌న్న ఆతృత‌, ఉబ‌లాటంలో రైతు స‌మ‌స్య‌లు అలాగే మిగిలిపోతున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Read More: Black fungus: షాక్ః క‌రోనా రాక‌పోయినా… బ్లాక్ ఫంగ‌స్ ముప్పు మ‌న‌కు ఉంటుంద‌ట‌

రైతు ఉద్య‌మంలో రాజ‌కీయాలు…

రైతు నాయ‌కులు కావ‌డానికి రేసులో ఉన్నవారు రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోతే లాభం ఏంట‌ని రాష్ట్రీయ కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ట‌న్ జాతీయ అధ్య‌క్షుడు స‌ర్దార్ వీఎం సింగ్ ప్ర‌శ్నించారు. రైతు ఉద్య‌మంలో రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని స‌ర్దార్ వీఎం సింగ్ విమ‌ర్శించారు. రైతులు నాయ‌కులుగా మార‌డం మంచిదే, అయితే, ఇదే స‌మ‌యంలో రైతుల స‌మ‌స్య‌లు కూడా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం మరింత మంచి చేయటానికి దేవుడు వారికి కొంచెం జ్ఞానం ఇవ్వాల‌ని కామెంట్ చేశారు.

Read More : YS Jagan: ముందు మోడీ , ఆ త‌ర్వాత జ‌గ‌న్‌… ఓ ప్ర‌త్యేక‌త‌

నేను వెన‌క్కి త‌గ్గాను…
ఉద్యమాన్ని సరైన దిశలో తీసుకుపోవ‌డం ద్వారా కేంద్రం మ‌న మాట వినేలా చేసుకోవ‌చ్చున‌ని రాష్ట్రీయ కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ట‌న్ జాతీయ అధ్య‌క్షుడు స‌ర్దార్ వీఎం సింగ్ రైతు నేత‌ల‌కు సూచించారు. మీ కోసం మాత్రమే కాకుండా రైతులకు కూడా మంచి చేయండని ఆయ‌న సూచించారు. రైతు బ‌తికేలా, రైతుల ఇంట్లో ప్ర‌యోజ‌నం చేకూరేలా వ‌చ్చే ఆగస్టు 9 న మ‌రో రైతు ఉద్య‌మం చేప‌ట్టేలా ప్ర‌ణాళిక త‌యారుచేస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 న ఢిల్లీలో జరిగిన ఆందోళ‌న‌ల తర్వాత తాను కొంత‌ వెనక్కి తగ్గిన మాట వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న అంగీక‌రించారు. ఉద్యమ స్వభావంతో త‌నకు సమస్య ఉంద‌న్నారు. అయితే, రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నామని, అదే కొనసాగిస్తామని స‌ర్దార్ వీఎం సింగ్ చెప్పారు.


Share

Related posts

డేట్ లాక్ చేశారు సరే ..పెద్ద సినిమాలొస్తే పరిస్థితేంటి ..?

GRK

నిత్యం పఠించాల్సిన శ్లోకాలు ఇవే !!

Sree matha

Black fungus: బ్లాక్ ఫంగ‌స్ భ‌య‌పెడుతోంది … బెడ్లు ఫుల్ అంటూ….

sridhar