NewsOrbit
Featured జాతీయం బిగ్ స్టోరీ

BJP : దీదీనీ అడ్డుకోవడం బీజేపీకి పెద్ద టాస్క్!

BJP : ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్ర నాయకత్వం లో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కువ ప్రాధాన్యం బెంగాల్కే ఇస్తుంది. ఆ రాష్ట్రంలో ప్రధాన పక్షంగా అవతరించిన బీజేపీ కచ్చితంగా ఈ సారి బెంగాల్ పీఠం మీద కాషాయ జెండా ఎగురవేసేందుకు తహతహలాడుతోంది. అయితే ఇదే సమయంలో తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరి ఎన్నికలు ఉన్నప్పటికీ కేవలం బెంగాల్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వెనుక బీజేపీ భవిష్యత్తు ద్రుష్టి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

BJP
BJP

** మమతా బెనర్జీని పూర్తిగా అధికారం నుంచి దూరం చేయడం ద్వారా భవిష్యత్తులో బిజెపి కు ఎదురు లేకుండా చేయాలి అన్నది అసలైన వ్యూహం. ఇప్పటికే పలు కీలకమైన కఠినమైన నిర్ణయాలు తీసుకున్న బీజేపీ మీద క్రమంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో వచ్చే లోక్ సభ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం.

** ప్రస్తుతం 303 లోక్సభ సీట్లు గెలుచుకున్న బిజెపి వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు సాధించుకోవచ్చు అన్నది బీజేపీ పెద్దల భావన. దీంతో పాటు కాంగ్రెస్ తమకు పోటీ ఇవ్వకపోవచ్చు అని, మూడో కూటమి ద్వారా కేంద్రంలో మంచి పోటీ ఉండవచ్చని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.

** ఈ కారణంగానే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మూడో కూటమికి నేతృత్వం వహించడానికి, ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె మూడోసారి బెంగాల్లో గద్దెనెక్కి తే కచ్చితంగా ఆమె బలం పెరుగుతుంది. బిజెపి కు రాజకీయ శత్రువులుగా ఉన్న అన్ని పార్టీలు కలిపి మూడో కూటమి గా ఆవిర్భవిస్తే దానికి కచ్చితంగా మమత నాయకత్వం వహించే అవకాశాలు ఉంటాయి. దీంతో భవిష్యత్తును ఊహించి మమతకు ఇక్కడే చెక్ పెట్టాలని బిజెపి భావిస్తోంది.

** మరోవైపు మమతా సైతం పశ్చిమబెంగాల్ ఎన్నికలపై దృష్టి పెడుతూనే రాష్ట్రంలో నూతన కు ప్రత్యామ్నాయంగా తన మేనల్లుడిని రంగంలోకి దింపారు. వచ్చే ఎన్నికల్లో మూడో కూటమికి నేతృత్వం వహించి ప్రధానమంత్రిగా బాధ్యతలు సేకరిస్తే పశ్చిమబెంగాల్లో తన మేనల్లుడికి సీఎం పీఠం అప్పగించాలని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

** దీంతో ఇప్పుడు పశ్చిమబెంగాల్ రాజకీయాలన్నీ భవిష్యత్ వ్యూహం మీద నడుపుతున్నట్లు కనిపిస్తున్నాయి. కేవలం అసెంబ్లీ ఎన్నికలు వేదికగా బిజెపి భవిష్యత్తులో తనకు ఎదురయ్యే ఇబ్బందిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటే, మమతా బెనర్జీ సైతం భవిష్యత్తులో తనకు అందబోయే అత్యున్నత పీఠం గురించి ఎత్తులు వేస్తున్నారు.

author avatar
Comrade CHE

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju