Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి ధర్నా ఎనిమిదవ రోజుకు చేరింది. మరో వైపు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలపై బ్రిజ్ భూషణ్ ఘాటుగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని పేర్కొంటూ తన రాజీనామా తర్వాత రెజ్లర్లు ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయినా తనకేమీ ఇబ్బంది లేదని వ్యంగ్యంగా విమర్శించారు.

అంతే కాకుండా ఇది రాజకీయ కుట్ర అని కూడా ఆయన ఆరోపించారు. రెజ్లర్ల ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు బ్రిజ్ భూషణ్. తనపై ఆరోపణలు చేయడం ఇదే మొదటి సారి కాదనీ, ఇంతకు ముందు కూడా రెజ్లర్లు తనకు వ్యతిరేకంగా ప్రదర్శలు చేశారని గుర్తు చేశారు. తాను రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని స్పష్టం చేస్తూ ఇందులో ఎవరి హస్తం ఉందో ఈ రోజు కనిపించిందని అన్నారు. బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపులు, మహిళా రెజ్లర్ల పై వివత చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని కైసర్ గంజ్ కి చెందిన బ్రిజ్ భూషణ్ 2009 ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి ఎంపిగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2014, 2019 బీజేపీ నుండి వరుసగా రెండు సార్లు లోక్ సభకు భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 లో 78 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన బ్రిజ్ భూషణ్ గత ఎన్నికల్లో 2,61 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో బీఎస్పీ అభ్యర్ధి పై విజయం సాధించారు.
Char Dham Pilgrims Alert: చార్ థామ్ యాత్రికులకు ఇక్కట్లు.. బద్రీనాథ్ హైవే తాత్కాలికంగా మూసివేత