Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడమే దేశంలోని పలు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వహించి విజయాలు సాధించారు. తన నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్ 2014 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ విజయానికి పని చేసింది. అయితే గత ఎన్నికల తర్వాత ఐప్యాక్ నుండి దూరంగా జరిగిన ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రంలో బీహార్ ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఆ రాష్ట్రంలో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

సాధారణ సామెతకు భిన్నంగా యథా ప్రజ … తథా నేత అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోయి ఓటేస్తే .. వారి నేత దొంగ కాకుండా హరిశ్చంద్రుడు అవుతాడా అని ప్రశ్నించారు. రూ.500 లకు ఓటును అమ్ముకున్నప్పుడు.. నేతను హరిశ్చంద్రులు అవుతారా అని ప్రశ్నించారు. ఓటరు అవినీతిపరుడైతే..రాజకీయ నేతలు కూడా అవినీతి పరులే అవుతారన్నారు. రూ.500లకు ఓటు అమ్ముకుంటే మీ నేత .. మీ గౌరవమర్యాదలను రూ.5 వేలకు అమ్ముకుంటాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చికెన్ బిర్యానీ, మద్యం బాటిల్ కు ఓటు వేసే వారికి నేతలను నిలదీసే అవకాశం లేదని అన్నారు. సమాజం ఎల ఉంటే నేతలూ అలానే ఉంటారని అన్నారు. ఓటు వేయడానికి నేతలు డబ్బులిచ్చినప్పుడు ఉచిత ప్రభుత్వ పథకాలకూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తారని అన్నారు. ప్రజలు మాత్రం దొంగలుగా ఉండి నేతలను మాత్రం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.
ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓటు కోసం అందరూ డబ్బు తీసుకునే పరిస్థితి లేదు. పార్టీ కోసం డబ్బులు తీసుకోకుండా పని చేసే అభిమానులు ఉంటారు. రాజకీయ నాయకులే తాము ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచుతున్నారు కానీ ఓటర్లు అందరూ తమ ఓటును అమ్ముకోవడం లేదని అంటున్నారు. పోటీ చేసే అభ్యర్ధులు అందరూ ఏ పార్టీ వారు అయినా ఓటర్లకు డబ్బులు పంచకుండా ఉంటే ఓటర్లు తమకు ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్పు అనేది రాజకీయ నాయకుల్లో రాకుండా ఓటర్లలో రావాలని కోరుకోవడం అవివేకమే అవుతుంది.
Chandrababu Arrest: జగన్ కంటే ఎక్కువ వాళ్ళు పగ బట్టేసారు చంద్రబాబు మీద !