జాతీయం న్యూస్

Sania Mirza: కీలక నిర్ణయాన్ని ప్రకటించి టెన్నీస్ అభిమానులకు షాక్ ఇచ్చిన సానియా మీర్జా.. 

Share

Sania Mirza:  భారత్ టెన్నీస్ స్టార్ సానియా మీర్జా క్రీడాభిమానులకు షాక్ ఇచ్చింది. భారత టెన్నీస్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. టెన్నీస్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. 2022 సీజన్ తన చివరిదని సానియా వెల్లడించింది. ఆస్ట్రేలియా ఓపెన్ లో ఓటమి తరువాత సానియా మీర్జా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ తో కలిసి సానియా మిక్స్‌డ్ డబుల్స్ లో పాల్గొంటున్నారు. సానియా మీర్జా అంతర్జాతీయంగా 68వ ర్యాంక్ లో కొనసాగుతోంది. మూడు సార్లు మహిళల డబుల్స్ టైటిళ్లు, మిక్స్‌డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ విజేతగా సానియా మిర్జా నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ తొలి రౌండ్ లోనే సానియా జోడీ ఓటమిపాలైంది.

Sania Mirza Announces Retirement
Sania Mirza Announces Retirement

 

Sania Mirza:  కేరీర్ ను పొడిగించలేను

ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. “కొన్ని రోజులుగా మోకాలు, మేచేయి నొప్పితో బాధపడుతున్నా. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ ఓటమికికి అవి కారణాలుగా చెప్పదల్చుకోలేదు. అలా అని కేరీర్ ను పొడిగించనూలేను. ఇదే చివరి సీజన్ అని మాత్రం చెప్పగలను. గత ఏడాది ఆఖరులోనే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ ఆటను ఆస్వాదించేందుకు సిద్దంగానే ఉన్నా. అయితే ఇప్పుడు నా వయసు 35. ఈ సీజన్ ను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. కనీసం యూఎస్ ఓపెన్ (జూన్ 16-19) వరకు ఆడేందుకు ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్ నెస్ సాధించేందుకు చాలా కష్టపడ్డా. నాకు నేను మోటివేషన్ చేసుకునే దాన్ని అయితే గతంలో ఉన్న ఎనర్జీ లేదనే చెప్పాలి. అలాగే గాయాల నుంచి కోలుకునేందుకు చాలా రోజుల సమయం పడుతోంది. మూడేళ్ల కుమారుడిని నాతో పాటు విదేశాలకు తీసుకెళ్లడం కూడానూ రిస్క్ తో కూడుకున్నదే” అని పేర్కొంది.

 

డబుల్స్ లో ప్రపంచ నెం. 1 ర్యాంక్

2013 లో సానియా సింగిల్స్ ఆడటం మానేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆమె డబుల్స్ లో మాత్రమే ఆడుతోంది. సింగిల్స్ ఆడుతున్న సమయంలో కూడా సానియా చాలా విజయాలు సాధించింది. ఆమె చాలా మంది పెద్ద టెన్నీస్ క్రీడాకారులను ఓడించి 27వ ర్యాంక్ కు చేరుకుంది. సానియా సుదీర్ఘ కేరీర్ లో ఎన్నో అరుదైన మైలు రాళ్లను దాటింది. డబుల్స్ లో ప్రపంచ నెం. ర్యాంకు సాధించింది. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో ఆసియా క్రీడల్లో సానియా ఆరు బంగారు పతకాలతో సహా 14 పతకాలను సాధించారు.

సానియా మీర్జాకు కొడుకు పుట్టిన తర్వాత 2018లో టెన్నీస్ కోర్టుకు దూరమైంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన సానియా ఉక్రెయిన్ కు చెందిన నదియా కిచెనోక్ తో కలిసి హోబర్డ్ ఇంటర్నేషనల్ లో మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. దీని తర్వాత ఆమె టోక్యో ఒలింపిక్స్ 2020లో ఆడింది కానీ అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.


Share

Related posts

బీజేపీలోకి జానారెడ్డి … రాహుల్ గాంధీ చెప్పినా ఆగేది లేదు

sridhar

ఎవరికో మూడింది..! ఏపీలో ఏదో పెద్ద సంచలనమే జరగబోతుంది..!?

Srinivas Manem

అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై

DEVELOPING STORY
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar