Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. కె. వి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య హై బడ్జెట్‌తో నిర్మించారు.
చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలిసి పేద ప్రజల కోసం బ్రిటీష్ వారిపై ఎలా పోరాటం చేశారు అన్న కథ ఆర్ఆర్ఆర్ రూపుదిద్దుకుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ చిత్రం విడుదల ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు వాయిదా పడింది.
దీంతో అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అవుతున్నారు. అయితే `ఆర్ఆర్ఆర్` రిలీజ్ అవ్వట్లేదని బెంగ పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ కోసం ఓ సూపర్ గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ కంటే ముందే రామ్ చరణ్ నటించిన మరో చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇంతకీ ఆ చిత్రం ఏదో కాదు `రంగస్థలం`.
అసలు మ్యాటర్ ఏంటంటే.. సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన చిత్రమే `రంగస్థలం`. సమంత హీరోయిన్గా నటించిన ఈ మూవీ 2018లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్‌ను అదే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తెలియజేశాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!