A.M.Rathnam: అప్పు చేసి ఏ.ఎం.రత్నం మొదటి సినిమా తీశాడు..దానికి సపోర్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Share

A.M.Rathnam: సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుండటం అనేది చాలా సందర్భాలలో జరుగుతుంటుంది. ఒక హీరో మరొక హీరోకి, హీరో హీరోయిన్ కి, నిర్మాత దర్శకుడికి, హీరోకి నిర్మాత..ఇలా ఏ ఇద్దరి మధ్య అయినా మంచి బంధం ఉంటే రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా సపోర్ట్ చేస్తే దాన్ని నిలబెట్టుకొని పెద్ద స్థాయికి చేరుకున్నవాళ్ళు అగ్ర నిర్మాతగా, హీరోగా, హీరోయిన్‌గా ఎదిగిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు ఆయన సినిమాలు తీస్తున్న సమయంలో ఎంతదో హీరోలని, దర్శకులను, ఇతర టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసి లైఫ్ ఇచ్చారు.

a-m-rathnam-first movie is supported by this star heroine
a-m-rathnam-first movie is supported by this star heroine

అలా అగ్ర నిర్మాతగా మారిన వాళ్లలో మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఏ.ఎం.రత్నం కూడా ఒకరు. ఇప్పుడు ఆయన ఓ బడా నిర్మాత. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరి హర వీరమల్లు అనే పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిష్ ఈ సినిమాను పీరియాడికల్ సినిమాగా అన్నీ సౌత్ భాషలలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు. నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సెట్స్‌కే కేటాయించారు. అంతేకాదు ఇందులో పవన్ కళ్యాణ్ కాస్ట్యూంస్ కోసం కూడా నిర్మాత భారీగా ఖర్చు చేస్తున్నారు.

A.M.Rathnam: అలాంటి హీరోయిన్ అప్పుడు ఎవరూ లేరనే చెప్పాలి.

ఇప్పటికే దీని టీజర్ సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. అయితే ఈ రోజు అగ్ర నిర్మాతగా వెలుగుతున్న ఏ.ఎం.రత్నం ఒకప్పుడు మేకప్ మేన్ గా పని చేసేవారు. అది కూడా స్టార్ హీరోయిన్ విజయశాంతికి. విజయశాంతికి పర్సనల్ మేకప్ మేన్ గా వ్యహరించిన ఏ.ఎం.రత్నం కొంతకాలం తర్వాత మంచి కథ విన్నారు. ఆ కథ ఆయనకి బాగా నచ్చింది. దాంతో ఆయనే సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ అది లేడీ ఓరియెంటెడ్ కథ. ఆ కథ చేయాలంటే చాలా గట్స్ ఉన్న హీరోయిన్ కావాలి. ఫైట్స్ చేయాలి. అలాంటి హీరోయిన్ అప్పుడు ఎవరూ లేరనే చెప్పాలి.

కానీ కథ మాత్రం సూపర్. సినిమా తీస్తే ఖచ్చితంగా సెన్షేషనల్ హిట్ కావడమే కాదు, ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంది. కొత్త సంచలనాలకి పునాది అవుతుంది. అందుకే ఈ విషయం, కథ ఆయన మేకప్ మేన్‌గా చేస్తున్న విజయశాంతికి చెప్పారు. ఆమె కథ విని ..మీరు నిర్మాతగా చేస్తానంటే నేను నటిస్తానని మాటిచ్చారు.
ఈ సినిమాకి కొంత డబ్బు అప్పు చేసి మరీ నిర్మించారు. అంతకాలం తనకి పర్సనల్ మేకప్ మేన్‌గా చేసినందుకు విజయశాంతి కూడా కొంత డబ్బు ఇచ్చి సపోర్ట్ చేశారట. అలా కర్తవ్యం సినిమా మొదలైంది. ఇందులో ఆమె పోలీస్ పాత్రలో నటించి అదరగొట్టారు. అప్పట్లో కర్తవ్యం సినిమా ఓ సంచలనం గా మారింది. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి.

A.M.Rathnam: పవర్ స్టార్ ఇమేజ్ ఈ నిర్మాణ సంస్థకి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

సూర్య మూవీస్ పతాకం మొదలు పెట్టి ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో మొదటి చిత్రంగా ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మించారు. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకొని నిర్మాతగా గొప్ప పేరు తీసుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇదే బ్యానర్‌లో భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుల రోజు, స్నేహం కోసం, ఖుషీ, 7 బై జి బృందావన కాలనీ, లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరి హర వీరమల్లు ఎన్ని సంచలనాలు సృష్ఠిస్తుందో చూడాలి. పవర్ స్టార్ ఇమేజ్ ఈ నిర్మాణ సంస్థకి పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.


Share

Related posts

బ్యూటీ విత్ డ్రమ్స్ అదుర్స్

bharani jella

దెబ్బ కొట్టిన త్రివిక్రం .. పవన్ కళ్యాణ్..రాం చరణ్ కాంబోకి స్క్రిప్ట్ రెడీ ..?

GRK

ఈసీ గ్రీన్ సిగ్న‌ల్‌

Siva Prasad