NewsOrbit
Featured న్యూస్ సినిమా

Allu arjun: ఒక్క భాష వదిలేస్తున్న అల్లు అర్జున్..ఇది మైనస్సేనా..?

TV 9 Debate: Pushpa Villian in AP Politics?

Allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పాన్ ఇండియన్ సినిమా పుష్ప ది రైజ్‌తో రాబోతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య 2 వచ్చి సూపర్ హిట్స్‌గా నిలవగా, ఇప్పుడు హ్యాట్రిక్ మూవీగా ఏకంగా పాన్ ఇండియన్ మూవీతోనే రాబోతున్నారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా పుష్ప సినిమాను ఈ డిసెంబర్ నెలలో భారీ స్థాయిలో 5 భాషలలో పార్ట్ 1ను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.

allu arjun is leaving only that one language is it a minus...?
allu arjun is leaving only that one language is it a minus

అయితే పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప ది రైజ్ మూవీని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించినప్పటి నుంచి ఆయా భాషలలో భారీగా అంచనాలు మొదలయ్యాయి. సుకుమార్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, ఇతర పాత్రల్లో నటిస్తున్న అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ సహామిగతా నటీ నటులను చాలా కొత్తగా చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన వీరి లుక్స్‌ను విశేషంగా ఆదరణ దక్కుతోంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌కు రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ చాలా స్పెషల్ అని తెలిసిందే.

Allu arjun: బాలీవుడ్‌లో అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది.

ఈ మధ్య కాలంలో కాస్త జోరు తగ్గిన దేవీ మళ్ళీ ఉప్పెన సినిమాతో పుంజుకున్నాడు. ఈ సినిమాకు అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటూ మెగాస్టార్ కూడా ప్రశంసించారు. ఆ ఉత్సాహంతో పుష్ప సినిమాకు అద్భుతమైన సాంగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి. అయితే ఇప్పుడు హిందీ వర్షన్ కు సంబంధించి పుష్ప మేకర్స్ కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

TV 9 Debate: Pushpa Villian in AP Politics?

సౌత్ లోని తెలుగు, తమిళం, కన్నడ, మలాయాళం అయిన నాలుగు భాషల్లో మాత్రమే పుష్ప మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నటు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు తను నటించిన యాక్షన్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా మంచి ఆదరణను దక్కించుకున్నాయి. అక్కడ అభిమానులతో పాటు మన వారు కూడా పుష్ప సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయాలని గట్టిగా చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.

Allu arjun: ఎటొచ్చీ సమస్య హిందీలోనే అంటున్నారు.

పుష్ప మూవీని తెలుగుతో పాటుగా తమిళం, కన్నడం, మలయాళంలో రిలీజ్ చేయడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారు. ఇక ఈ నాలుగు భాషల్లో తన పాత్రకు అల్లు అర్జున్ స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నాడట. తమిళ, మలయాళ భాషలలో బన్ని బాగానే మాట్లాడగలడు. కన్నడ భాష కూడా బాగానే అర్థం అవుతుంది..కొంతవరకు మాట్లాడగలడు కూడా. కాబట్టి డబ్బింగ్ చెప్పడం బన్నీకి ఈజీనే. కానీ ఎటొచ్చీ సమస్య హిందీలోనే అంటున్నారు. హిందీలో అంత పట్టు లేకపోవడంతో వేరే వారు అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశాలున్నాయట. అలాగే పుష్ప హిందీ వెర్షన్ కూడా కాస్త డిలేగా రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి ఈ ఒక్క భాషలో ఎందుకు రిలీజ్ లేట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

 

Related posts

Sindhu Menon: చంద‌మామ న‌టి సింధు మీనన్ ఏమైపోయింది.. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే యాక్టింగ్ ఎందుకు మానేసింది..?

kavya N

Article 370 OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న యామి గౌతమ్ కాంట్రవర్సీ ” ఆర్టికల్ 370 ” మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ   

sharma somaraju

Hanuman OTT response: ఓటీటీలో హనుమాన్ పాట రికార్డుల వేట.. ఢీ కొట్టేది ఎవరు..?

Saranya Koduri

Last week OTT most trending web series – movies: గతవారం ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్న సిరీస్ – సినిమాలు ఇవే..!

Saranya Koduri

Family star OTT budget: భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” ఓటీటీ రైట్స్.. దిల్ రాజు వాటా ఎంతంటే..!

Saranya Koduri

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Malli Nindu Jabili March 19 2024 Episode 601: హాస్పిటల్ కి వెళ్ళిన మల్లి కి అరవింద్ బ్రతికున్నాడని తెలుస్తుందా లేదా?..

siddhu

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?