Anushka shetty : అనుష్క శెట్టి నిశ్శబ్ధం సినిమా తర్వాత మళ్ళీ ఏ సినిమా ని కమిటవ్వలేదు. ఈ సినిమా వచ్చి కూడా చాలా నెలలు గడిచిపోయింది. కానీ అనుష్క నుంచి కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన సినిమా అప్డేట్స్ ఏవీ రావడం లేదు. కొందరేమో ఇక అనుష్క సినిమాలు చేయదని వార్తలు రాసేస్తున్నారు.కొందరేమో త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని చెప్పుకుంటున్నారు. కాని అనుష్క మాత్రం ఇవన్ని చూస్తూ నిశ్శబ్ధం గా ఉంటుంది తప్ప నిశ్శబ్ధం తర్వాత చేయబోయో సినిమాని మాత్రం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం లేదు.
ఆమధ్య కోలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాలో నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తాడని ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించిన వార్తలేవీ రాలేదు. దాంతో ఇది కూడా గాసిప్ అని అందరూ డిసైడయ్యారు. కాగా తాజాగా టాలీవుడ్ లో అనుష్క శెట్టి నటించబోయే సినిమా దాదాపు కన్ఫర్మ్ అన్న మాట వినిపిస్తోంది.
Anushka shetty: అనుష్క శెట్టి తో నవీన్ పోలిశెట్టి..?
ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేదు గాని ప్రస్తుతం ఈ న్యూస్ అంతటా హాట్ టాపిక్ గా మారింది.
చూడాలి మరి ఇది అఫీషియల్ గా ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందో. కాగా నవీన్ పోలిశెట్టి నటించిన తాజా చిత్రం జాతి రత్నాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని డార్లింగ్ ప్రభాస్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!