ఏపి అసెంబ్లీ.. చంద్రబాబుతో సహా 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

 

సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారన్న కారణంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా 12 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు  సమావేశాల నుండి  సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలి రోజైన సోమవారం తుఫాను పంట నష్టంపై అధికార విపక్ష సభ్యుల మధ్య రగడ జరిగింది. టీడీపీ సభ్యుడు రామానాయుడు విమర్శలపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.

దీనిపై చంద్రబాబు ఎలా మాట్లాడతారంటూ అధికార పక్షం అడ్డుకుంది. దీంతో అధికార పక్షం తీరును నిరసిస్తూ చంద్రబాబు పోడియం ఎదుట బేటాయించి నిరసన తెలిపారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తుండటంతో టీడీపీ నేతలపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో విరుచుపడింది. గందరగోళ పరిస్థితితో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో  చంద్రబాబుతో పాటు టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, వీరాంజనేయులు, ఏలూరి సాంబశివరావు,  పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణ బబు, బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావులను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు.