Balakrishna: నందమూరి బాలయ్య బాబు హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయాయి. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య బాబు నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేదు. పైగా 2019 ఎన్నికల టైంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ గా రెండు భాగాలుగా చిత్రీకరించి బాలయ్య ఫ్లాప్ అందుకోవడం జరిగింది.
దీంతో నందమూరి అభిమానులు ఫుల్ నిరుత్సాహం చెందడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే పూర్తి పరాజయాలతో ఉన్న బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తూ ఉండటం తో ఈ సినిమా హిట్ అవ్వాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంలో బోయపాటి తో సింహా లెజెండ్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు.
Read more: Balakrishna: రాయలసీమ లో రచ్చ రచ్చ చేస్తున్న బాలయ్య బాబు..!!
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బాలయ్య బాబు పుట్టినరోజు నాడు ఈ సినిమాకి సంబంధించి కీలక ప్రకటన కూడా రావడం జరిగింది. ఇక అదే సమయంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా బాలయ్య సినిమా చేస్తున్నట్లు వార్తలు రాగా… ఆరోజు బాలయ్య బర్తడే నాడు ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో అనిల్ రావిపూడి సినిమా ప్రాజెక్ట్ లేదని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యబాబు.. అనిల్ రావిపూడి సినిమా ఉన్నట్లు ఇండైరెక్ట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలావుంటే ఇటీవల అనిల్ రావిపూడి.. పూర్తి స్టోరీ బాలయ్య బాబుకు వినిపించడం జరిగినట్లు ఆయన అంతా ఓకే అన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి “ఎఫ్ త్రి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారట. ఈ సినిమా అయిన వెంటనే బాలయ్యబాబు ప్రాజెక్టు అనిల్ రావిపూడి స్టార్ట్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!