NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: బాలినేని వ్యవహారం మళ్లీ మొదటికి .. అలకపాన్పు ఎక్కినట్లే(నా)..! 

YSRCP: వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యవహారం మళ్లీ మొదటి వచ్చినట్లు తెలుస్తొంది. బాలినేని తరచు అలకపాన్పు ఎక్కడం, పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించడం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా పార్టీ పెద్దలతో చర్చల అనంతరం ఒంగోలుకు చేరుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంపీ ఎవరైతే నాకేంటి..నా పని నేను చేసుకుపోతాను..అని వ్యాఖ్యానించారు. తనకు ఒంగోలులో పేదల ఇళ్ల పట్టాల పంపిణీయే ముఖ్యమని చెప్పుకొచ్చారు.

Balineni Srinivasa Reddy

అయితే మళ్లీ వైసీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైదరాబాద్ కు వెళ్లిపోయారని అంటున్నారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఒంగోలు పార్లమెంట్ టికెట్ విషయంలో బాలినేని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే టికెట్ ఖరారు చేయాలని పార్టీ పెద్దల వద్ద డిమాండ్ పెట్టారు.

అయితే పార్టీ హైకమాండ్ మాత్రం మాగుంటకు  టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిలతో బాలినేని చర్చలు జరిపారు. ఒంగోలు లోక్ సభ స్థానం నుండి సీఎం జగన్ ఆదేశాల మేరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ చేస్తారని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తొంది. పార్టీ బాధ్యతలు మాత్రం చెవిరెడ్డికి అప్పగించడం లేదని బాలినేనికి చెప్పారుట. దీంతో ఒంగోలుకు చేరుకున్న బాలినేని .. ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.

మాగుంట టికెట కోసం అడగితే పార్టీ మారుతాననితన పై దుష్ప్రచారంచ చేస్తున్నారని వాపోయారు. అయితే ఆ రాత్రికే ఒంగోలు పార్లమెంట్ పార్లమెంట్ పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను చెవిరెడ్డికి అప్పగిస్తూ వైసీపీ ప్రకటన విడుదల చేసింది. దీంతో పార్టీ హైకమాండ్ తనకు చెప్పింది ఒకటి, చేసిందోకటి అంటూ బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ కు వెళ్లిపోయారుట. తన మాటకు విలువ లేని చోట తాను ఉండటం ఎందుకు అని సన్నిహితుల వద్ద బాలినేని వాపోయారని అంటున్నారు.

తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని కూడా ముఖ్య నేతలకు బాలినేని చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. బాలినేని మెత్తపడ్డారు. ఒంగోలు వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరల బాలినేని అలకపాన్పు ఎక్కడం మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. ఈ సారి పార్టీ హైకమాండ్ పెద్దలు బాలినేనిని బుజ్జగిస్తారా లేక ఒంగోలుకు ప్రత్యామ్నాయ అభ్యర్ధిని రంగంలోకి దింపుతారా అనేది వేచి చూడాలి.

YS Sharmila: ఢిల్లీ కేంద్రంగా జగనన్న పరువు తీయడానికి సిద్దమైన చెల్లి షర్మిలమ్మ

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!