Romance:సీసీ కెమెరాలను భద్రత కోసం ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..10,20 కాదు ఏకంగా 50వేల మంది ఇంట్లో పడక గది లో జరిగిన శృంగారం ఏకంగా పోర్న్ సైట్లలో దర్శనమిచ్చాయి.నమ్మలేక పోయిన ఇది నిజం ఈ సంఘటన సింగపూర్ లో జరిగింది. భద్రత కోసం ఇంట్లో పెట్టుకున్న సీసీ కెమేరా ఫుటేజీలను కొందరు వ్యక్తులు హ్యాక్ చేసి.. ఆ హ్యాకింగ్ వీడియోలను ఓ పోర్న్ సైట్ కి అమ్మేశారు.దీంతో ఈ వీడియోలన్నీ నెట్టింట అందరికి దర్శనమిచ్చాయి.
ఆ వీడియోల్లో శృంగార సీన్ లతోపాటు.. తల్లులు పిల్లలకు పాలు ఇస్తున్న వీడియోలు కూడా ఉండటం గమనించవలసిన విషయం. చాలా మంది మన ఇంట్లో మనకేంటి భయమని లివింగ్ రూమ్ లో కూడా నచ్చినట్లుగా ఉంటుంటారు.అలా ఉన్నప్పుడు వారికి తెలీకుండా అక్కడ జరుగుతున్నా రొమాన్స్ అంతా వీడియో రూపంలో దర్శనమివ్వడం చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా వీడియోలు హాలు, పడక గదులలో వే కావడం ఇక్కడ ఉన్న ముఖ్యమైన విషయం. వీటితో పాటు కొన్ని బాత్రూమ్ వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలన్నీ ఈ ఏడాదిలో ఇవే కావడం మరో విశేషం….సింగపూర్ లో చాలా మంది భద్రత కోసం సీసీ కెమేరాలు పెట్టుకుంటారు.
దొంగల భయం, ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలేసినప్పుడు ట్రాక్ చేసుకోవడానికి ఇలా అనేక రకాల కారణాల తో వారంతా కచ్చితంగా ఈ కెమెరాలను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు. కాగా సైబర్ నేరస్థులు వీటి పై కన్నేసి.. మొత్తాన్ని హ్యాక్ చేశారు. పలు సోషల్ మీడియా గ్రూప్ లో కూడా ఈ వీడియోలు దర్శనమిచ్చాయి అని పలువురు బాధ వ్యక్తం చేస్తున్నారు.తమ వీడియోలు పోర్న్ సైట్స్ ఎక్కాయి అన్న విషయం తెలిసి మరికొందరు షాక్ అయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రత కోసం పెట్టుకున్నవి ఇంత అబద్రం గా ఉంటే ఇంక ఏమి చేయాలని పలువురు గోడు వెళ్లబోసుకున్నారు..