NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kodali Nani : మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్..! మీడియా కళ్ళు బైర్లు కమ్మే న్యూస్ చెప్పిన సర్పంచి అనూష..!!

Kodali Nani : ఒక సెక్షన్ మీడియా ఆనందం గంటల వ్యవధిలో ఆవిరైపోయింది!

 Big relief for Minister Kodali Nani ..!
Big relief for Minister Kodali Nani ..!

కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామపంచాయతీలో టిడిపి అభ్యర్థి సర్పంచ్ గా గెలవడాన్ని ఆ మీడియా భూతద్దంలో చూపి ఇది రాష్ట్ర మంత్రి కొడాలి నాని స్వగ్రామమని ఆయనకు అక్కడ ఎదురుదెబ్బ తగిలిందని విపరీత ప్రచారం చేసింది.అయితే ఆదివారం నాడు ఆ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన టిడిపి మద్దతుదారు అనూష అసలు తన ఎన్నికకు మంత్రి కొడాలి నాని కి సంబంధమే లేదని తేల్చి చెప్పేశారు.అసలు ఎలమర్రు కొడాలి నాని స్వగ్రామమే కాదని కూడా ఆమె తేల్చేశారు.దీంతో కొడాలి నానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మీడియా ముఖ౦ దాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది వివరాల్లోకి వెళితే ..

Kodali Nani : టీడీపీ ఘన విజయం!

యలమర్రు పంచాయతీలో టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం గమనార్హం. ఈ గెలుపుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజంగా ఇది నానికి ఊహించని షాక్ అని కొందరు టీడీపీ వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Kodali Nani : షాక్ ఇచ్చిన సర్పంచ్ అనూష!

ఈ నేపథ్యంలో అనూష పత్రికాముఖంగా స్పందించారు.మంత్రి కొడాలి నాని స్వంత గ్రామంలో వైసీపీకి ఎదురు దెబ్బ అని కొన్ని మీడియాల లో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. శనివారం రాత్రి నుండి కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలు అవాస్తమని పేర్కొన్నారు. మంత్రి కొడాలి నానిది గుడివాడ నియోజకవర్గమని.. తమ గ్రామం యలమర్రు పామర్రు నియోజకవర్గంలో ఉందని ఆమె చెప్పారు.  తమ గ్రామంలో మంత్రి కొడాలి నాని ఎటువంటి రాజకీయాలు చేయ్యలేదని వెల్లడించారు. గ్రామస్తుల అండదండలతో గెలిచానని.. రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో గ్రామ అభివృద్ధి చేసుకుంటామని నూతన  సర్పంచ్‌గా ఎన్నికైన అనూష తెలిపారు.

యలమర్రు నా ఊరే కాదు:మంత్రి నాని!

మరోవైపు మంత్రి కొడాలి నాని కూడా ఈ ప్రచారంపై స్పందించారు. యలమర్రు తన పూర్వికులదని.. తన తండ్రి, తాను గుడివాడలోనే పుట్టామని స్పష్టం చేశారు. యలమర్రు పాలిటిక్స్ తనకు తెలియవని.. ఒకవేళ అక్కడ తాను ప్రచారం చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తానని సవాల్ విసిరారు. 21 తర్వాత వాస్తవాలను మీడియాతో వెల్లడిస్తానన్న కొడాలి నాని.. అప్పుడు అసలు లెక్కలు తేలుతాయన్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju