బిగ్ బాస్ 4: ఓటింగ్ లో కుట్ర జరుగుతుంది అంటున్న నెటిజన్లు..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరిదశకు చేరుకుంది. హౌస్ లో 19 మంది ఎంటర్ కాగా చివరాకరికి ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. ప్రస్తుతం 12 వ వారం కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో ఇంటిలో ఉన్న సభ్యుల మద్దతుదారులు బయట గెలిపించడంకోసం వేస్తున్న ఓటింగ్ విషయంలో కుట్ర జరుగుతున్నట్లు టాక్ సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతోంది.

Bigg Boss 4 Telugu New Logo Is Hereమొదటి నుండి బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్క్రిప్ట్ పరంగా షో రన్ అవుతుందని ఉద్దేశపూర్వకంగా ఇంటిలో ఉన్న సభ్యులను షో నిర్వాహకులు చాలా సందర్భాలలో ఎలిమినేట్ చేసినట్లు ఎప్పటి నుండో టాక్ బయట ఉంది. ముఖ్యంగా టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేషన్ చాలా అన్యాయమని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

 

ఇదే తరుణంలో భారీ స్థాయిలో ఓటింగ్ వేసిన ఇటీవల అవినాష్ ఇంటి నుండి ఎలిమినేట్ కాకపోవడం పట్ల కూడా సెటైర్లు పడ్డాయి. ఓటింగ్ వేయటం కోసం బయట జనాలు కష్టపడుతుంటే షో నిర్వాహకులు ఇష్టానుసారంగా… ఎలిమినేట్ కావాల్సిన క్యాండేట్ నీ కాపాడటం దారుణమని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటిలో ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వాళ్ళు అభిజిత్, హారిక, మోనాల్, అఖిల్. ఈ కంటెస్టెంట్ లలో మోనాల్ మినహా మిగతా కంటెస్టెంట్ ఓటింగ్ చేద్దామని ఫోన్ చేస్తుంటే రింగ్ కావడం లేదని బయట భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక మోనాల్ కి మాత్రమే రింగ్ అవుతుంది అని ఓట్లు పడుతున్నాయని టాక్ బయట వినపడుతోంది. మిగతా ముగ్గురూ తెలుగు వారు కావడంతో.. లైన్స్ కలవడం లేదనీ ఇది ఏదో ఒక ప్లాన్ ప్రకారం షో నిర్వాహకులు చేస్తున్నట్లు నెటిజన్లు బయట అనుమానం వ్యక్తం చేస్తున్నారు.